OTT Movies: ఓటీటీలోకి 9 స్పెషల్ సినిమాలు- ఒకేదాంట్లో 5, తెలుగులో 1 ఇంట్రెస్టింగ్-కోర్ట్ రూమ్ డ్రామా టు క్రైమ్ థ్రిల్లర్!
OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం 9 స్పెషల్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. దీంతో మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు వారం వరకు ఓటీటీ ప్రియులకు పండగ కానుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5లలో రవి కిషన్ లీగల్ డ్రామా నుంచి వీర్ దాస్ స్పై కామెడీ వరకు ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
సినిమా థియేటర్లకు వెళ్లకపోయినా, ఇంట్లోనే కూర్చుని ప్రపంచ స్థాయి వినోదాన్ని ఆస్వాదించే ఓటీటీ ప్రియులకు ఈ వారం అదిరిపోయే అప్‌డేట్స్ వచ్చాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ (Netflix)
అన్‌టోల్డ్- ది డెత్ అండ్ లైఫ్ ఆఫ్ లామర్ ఓడమ్ (మార్చి 31): ఎన్‌బీఏ స్టార్ లామర్ ఓడమ్ జీవితంలోని ఎత్తుపల్లాలు, ఖలో కర్దాషియాన్‌తో వివాహం, డ్రగ్స్ వల్ల మరణం అంచు దాకా వెళ్లిన భయంకర అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూడవచ్చు.
హ్యాపీ పటేల్ - ఖతర్నాక్ జాసూస్ (ఏప్రిల్ 1): ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. ఒక అమాయకపు బ్రిటిష్ గూఢచారి గోవాలో ఒక మహిళను రక్షించే క్రమంలో చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఇందులో మిథిలా పాల్కర్, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎక్సో కిట్టి - సీజన్ 3 (ఏప్రిల్ 2): కిట్టి సాంగ్ కోవీ సీయోల్‌లో తన కాలేజ్ జీవితం, ప్రేమ పాఠాల చుట్టూ తిరిగే ఈ టీన్ డ్రామా మూడో సీజన్‌తో ప్రేక్షకులను పలకరించనుంది.
మృత్యుంజయ్ (ఏప్రిల్ 3): తెలుగులో తెరకెక్కిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇది. శ్రీవిష్ణు హీరోగా చేసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మృత్యుంజయ్ ఓటీటీ రిలీజ్ కానుంది.
మామ్లా లీగల్ హై సీజన్ 2 (ఏప్రిల్ 3): పట్పర్‌గంజ్ జిల్లా కోర్టులో వింత వింత కేసులు ఎదుర్కొనే లాయర్ వీడీ త్యాగి గుర్తున్నారా? ఇప్పుడు ఆయన జడ్జిగా మారి తన 'జుగాడ్' స్టైల్‌లో తీర్పులు చెప్పబోతున్నారు. రవి కిషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ (Amazon Prime Video)
మా కా సమ్ (ఏప్రిల్ 3): ఒక 19 ఏళ్ల మ్యాథమెటికల్ జీనియస్, ఒంటరిగా ఉంటున్న తన తల్లికి సరైన భాగస్వామిని వెతకడానికి ఫార్ములాలు, అల్గారిథమ్స్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? మోనా సింగ్, మిహిర్ అహుజా నటించిన ఈ సినిమా ఒక విభిన్నమైన కథాంశంతో ఓటీటీలోకి వచ్చేస్తోంది.
జీ5 ఓటీటీ (Zee5)
హే కే నవీన్? (మార్చి 31): ప్రియా బాపట్, ఉమేష్ కామత్ నటించిన ఈ మరాఠీ డ్రామా, ఒక మహిళ తన ఫ్యాషన్ లేబుల్ ప్రారంభించే క్రమంలో ఎదుర్కొనే మానసిక సంఘర్షణను, కుటుంబ మద్దతును చూపిస్తుంది. రేపే హే కే నవీన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
భాబీజీ ఘర్ పర్ హై - ఫన్ ఆన్ ది రన్ (ఏప్రిల్ 3): టెలివిజన్ పాపులర్ షో ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. విభూతి, తివారీ జీ తమ భార్యలతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లడం, అక్కడ ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల వల్ల చిక్కుల్లో పడటం వంటి నవ్వుల ప్రయాణం ఇది.
ఆపిల్ టీవీ+ (AppleTV+)
యువర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ సీజన్ 2 (ఏప్రిల్ 3): ఉద్యోగం కోల్పోయి, విడాకుల బాధలో ఉన్న ఆండ్రూ.. తన ధనిక పొరుగువారి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో వారి ముసుగు వెనుక ఉన్న చీకటి రహస్యాలను ఎలా తెలుసుకున్నాడనేదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్.
ఒక్కదాంట్లో 5
ఇలా ఈ వారం కోర్ట్ రూమ్ డ్రామా నుంచి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వరకు 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 5 ప్రీమియర్ అవనున్నాయి. తెలుగులో మృత్యంజయ్ ఒక్కటి మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


