Narayanamma Song: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ' ఈ రోజు (సెప్టెంబర్ 27) విడుదలయ్యింది. ఈ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ గా మారింది.
నారాయణమ్మ సాంగ్

ఆదర్శ కుటుంబం సినిమా నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్ వచ్చేసింది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. రామ్ మిరియాల, ప్రభ బంగారిగల్ల పాడారు.
డింపుల్ హయాతి కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్, వెంకటేష్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ గ్లామర్ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్టోబర్ 9న విడుదల కానున్న ఈ ఆదర్శ కుటుంబం సినిమాకు ఈ పాట భారీ హైప్‌ను తీసుకొచ్చింది.
డింపుల్ హయాతి ఊరమాస్ డ్యాన్స్
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ' లిరికల్ పాటను ఈ రోజు ఆదర్శ కుటుంబం మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో డింపుల్ హయాతి తన అద్భుతమైన గ్రేస్‌తో, మాస్ డ్యాన్స్ మూమెంట్స్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఆమెతో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్‌లతో కలిసి విక్టరీ వెంకటేష్ చేసిన హుక్ స్టెప్పులు అభిమానులకు ఐ-ఫీస్ట్‌గా మారాయి. వెంకీ మామ తనదైన ఎనర్జీ అండ్ టైమింగ్‌తో పాటలో సందడి చేశారు.
త్రివిక్రమ్-తమన్ కాంబోకి మరో బ్లాక్‌బస్టర్
త్రివిక్రమ్ సినిమాల్లో మ్యూజిక్, ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ ఆడియో హైప్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 'ఆదర్శ కుటుంబం' విడుదల తేది అక్టోబర్ 9కి మారిన నేపథ్యంలో, ఈ 'నారాయణమ్మ' ప్రమోషనల్ పాటతో చిత్ర బృందం ప్రచార హోరును పీక్స్‌కు తీసుకెళ్లింది.
{{/usCountry}}త్రివిక్రమ్ సినిమాల్లో మ్యూజిక్, ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ ఆడియో హైప్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 'ఆదర్శ కుటుంబం' విడుదల తేది అక్టోబర్ 9కి మారిన నేపథ్యంలో, ఈ 'నారాయణమ్మ' ప్రమోషనల్ పాటతో చిత్ర బృందం ప్రచార హోరును పీక్స్‌కు తీసుకెళ్లింది.
{{/usCountry}}విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌లోనే కాకుండా మాస్ ఆడియన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. డింపుల్ హయాతి గ్లామరస్ డ్యాన్స్ మూవ్స్, శ్రీనిధి, నివేదాల ప్రెజెన్స్ పాట గ్రాండ్‌నెస్‌ను పెంచాయి. తమన్ ఈ మధ్య కాలంలో అందించిన బెస్ట్ మాస్ ఫోక్ ట్రాక్స్‌లో ఒకటిగా 'నారాయణమ్మ' నిలిచిపోయే అవకాశం ఉంది. రామ్ మిరియాల వాయిస్ ఉండటం పాటలోని ఫోక్ ఫీల్‌ను మరింత ఎలివేట్ చేసింది.
ఇది మామూలు కుటుంబం కాదు
నారాయణమ్మ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో మాట్లాడుతూ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ‘‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తర్వాత మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి పని చేశా. అవన్నీ క్లాసిక్ లవ్ స్టోరీలు. అప్పుడు పెళ్లికాని ప్రసాద్. ఇప్పుడు పెళ్లయిపోయింది. ఆ రోజులు అయిపోయాయి.
ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఫన్ తో పాటు ట్విస్టులుంటాయి. ఇది మామూలు కుటుంబం కాదు. వేరే లెవల్ లో ఉంటుంది ఆదర్శ కుటుంబం’’ అని వెంకటేష్ పేర్కొన్నారు.