OTT Telugu: ఏసీ కోసం మిడిల్ క్లాస్ వైఫ్ పాట్లు.. అప్పుడే కన్నీళ్లు తెప్పించే బాధ.. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ
OTT Telugu: సండే స్పెషల్ గా ఓ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఏసీ కోసం ఓ మిడిల్ క్లాస్ వైఫ్ పాట్లు, అప్పడే చోటు చేసుకునే విషాదం చుట్టూ ఈ సినిమా సాగుతుంది.
OTT Telugu: ప్రతి ఆదివారం ఒక చిన్న సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ను ఈటీవీ విన్ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అదే క్రమంలో ఈ రోజు (ఏప్రిల్ 26) మరో సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆ చిత్రం పేరే ‘ఆమె కథ’. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ సాగే కథతో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో ఆమని ప్రధాన పాత్ర పోషించింది.

ఆమె కథ ఓటీటీ
కథా సుధ సిరీస్ లో భాగంగా ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ ఈటీవీ విన్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ‘ఆమె కథ’ అనే చిన్న సినిమా వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఆదివారమే ఈ మూవీ రిలీజ్ అయింది.
మిడిల్ క్లాస్
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ల అవసరాలు, పడే బాధలు ఎలా ఉంటాయో గుండెకు హత్తుకునేలా చూపించిన సినిమా ‘ఆమె కథ’. ఈ మూవీలో ఆమని, దేవి ప్రసాద్, త్రిశూల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి గాట్రెడ్డి హరి ప్రసాద్ డైరెక్టర్. ఆమె కథ సినిమాను నవీన యాట నిర్మించారు.
ఏసీ కోసం
ఆమె కథ సినిమాలో ఆమని, దేవి ప్రసాద్ భార్యాభర్తలుగా నటించారు. ఏసీ కోసం భర్తను భార్య విసిగిస్తూనే ఉంటుంది. ఇంటి పేరు ఏమో చల్లా వారు కానీ ఇంట్లో మాత్రం చల్లదనం లేదని వెటకారంగా మాట్లాడుతూనే ఉంటుంది. మాటకు ముందు, మాటకు వెనుక ఏసీ అంటూ గోల పెట్టేస్తుంది.
కొడుకు మాట
ఏసీ కోసం పట్టుబడుతున్న ఆమనిని చూసి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్లు ఎగతాళి చేసి మాట్లాడతారు. చిన్నగా ఉండే ఆమె కొడుకు పెద్దయ్యాక ఏసీ కొంటానని మాటిస్తాడు. అన్నట్లే ఏసీ కూడా కొంటాడు.
అమ్మ బాధ
కానీ ఏసీని అమ్మ గదిలో కాకుండా తమ గదిలో పెట్టిస్తాడు ఆ కొడుకు. అమ్మను గదిలోకి రాకుండా భార్యతో కలిసి నానామాటలు అంటాడు. ఆ మాటలకు ఆమని చాలా ఫీల్ అవుతుంది. ఆ సమయంలోనే కన్నీళ్లు తెప్పించే ఒక ఘటన చోటు చేసుకుంటుంది.
అసలు ఏం జరిగింది? ఆమనికి అంత బాధ ఎందుకు వచ్చింది? అనేది ఆమె కథ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. 39 నిమిషాలే ఉన్న ఈ మూవీ సండే రోజు ఓటీటీ లవర్స్ కు మంచి టైమ్ పాస్. త్వరగా కంప్లీట్ చేసేయొచ్చు. మరి ఇంకా ఎందుకు లేటు ఓ లుక్కేయండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


