బాలీవుడ్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అమీర్ ఖాన్ తన 61వ పుట్టినరోజును (మార్చి 14) ఎంతో ఆత్మీయంగా, తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఎటువంటి ఆడంబరాలు లేకుండా, ఇంట్లోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.

ఈ వేడుకలో అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో పాటు ఆయన పిల్లలు జునైద్ ఖాన్, ఐరా ఖాన్, ఆజాద్ రావు ఖాన్ సందడి చేశారు. విశేషమేమిటంటే, అమీర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆత్మీయ వేడుక.. అల్లరి ముచ్చట్లు
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ తన భార్య సఫా బేగ్‌తో కలిసి ఈ విందుకు హాజరయ్యారు. ఈ వీడియోలో అమీర్ ఖాన్ చాలా సింపుల్‌గా స్ట్రిప్డ్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో కనిపించగా.. గౌరీ స్ప్రాట్ గ్రీన్ కలర్ డ్రెస్సులో మెరిశారు.
కేక్ కట్ చేసే సమయంలో ఐరా ఖాన్ కొవ్వొత్తికి బదులుగా లైటర్‌ను వెలిగించగా.. అమీర్ దానిని ఊదుతూ సరదాగా నవ్వులు పూయించారు. అనంతరం ఐరా తన తండ్రి ముఖానికి కేక్ పూసి అల్లరి చేసింది. అమీర్ తన చేతులతో మొదట ఆజాద్‌కు, ఆ తర్వాత ఐరా, గౌరీ, జునైద్‌లకు కేక్ తినిపించారు.
ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. "అమీర్ భాయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అగత్సు ఫౌండేషన్ ద్వారా ఐరా ఖాన్ చేస్తున్న సామాజిక సేవ, మానసిక ఆరోగ్యంపై ఆమె కల్పిస్తున్న అవగాహన అభినందనీయం" అని పేర్కొన్నారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
{{/usCountry}}ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. "అమీర్ భాయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అగత్సు ఫౌండేషన్ ద్వారా ఐరా ఖాన్ చేస్తున్న సామాజిక సేవ, మానసిక ఆరోగ్యంపై ఆమె కల్పిస్తున్న అవగాహన అభినందనీయం" అని పేర్కొన్నారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
{{/usCountry}}సినీ పరిశ్రమ నుంచి అమీర్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందాయి. కిరణ్ రావు అమీర్ ప్రొడక్షన్ హౌస్ వీడియోను షేర్ చేస్తూ.. "నా ఫరెవర్ సికందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని రాసుకొచ్చారు. అమీర్ ఖాన్‌తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కాజోల్ కూడా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విష్ చేశారు.
కెరీర్ జోరు.. వరుస ప్రాజెక్టులు
ఇదిలా ఉంటే, ‘లాల్ సింగ్ చద్దా’ పరాజయం తర్వాత గతేడాది ‘సితారే జమీన్ పర్’తో అమీర్ ఖాన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన నిర్మాణ రంగంలోనూ చాలా బిజీగా ఉన్నారు. సన్నీ డియోల్ నటిస్తున్న ‘లాహోర్ 1947’ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. అలాగే, ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్’లో ఆయన అతిథి పాత్రలో కనిపించారు.
అన్నిటికంటే ముఖ్యంగా, తన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందుతున్న ‘ఏక్ దిన్’ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఒకే వేదికపైకి తెచ్చి
ఈ సినిమా మే 1, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ బంధాలకు విలువనిచ్చే అమీర్ ఖాన్ తన పాత కొత్త బంధాలన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చి తన పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా మార్చుకున్నారు. దీంతో అమీర్ ఖాన్ అభిమానులు ఖుష్ అవుతున్నారు.