నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అఖండ 2 ది తాండవం. అఖండ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా రామ్ లక్ష్మణ్ చేశారు. తాజాగా మీడియా ఇంటర్వ్యూలో బాలకృష్ణ నటనపై ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు.
మీ యాక్షన్ కంపోజిషన్ చూసిన తర్వాత బాలయ్య గారు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు?

-బాలయ్య బాబు గారితో మేము ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాము. మేము అంటే బాబు గారికి చాలా నమ్మకం. మేము సింహ లెజెండ్ లాంటి మాస్ క్యారెక్టర్స్‌కి ఫైట్స్ డిజైన్ చేశాము. అలాంటి ఒక క్యారెక్టర్‌కి ఒక డివైన్ ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో ఆ ఎనర్జీని తీసుకుని మేము ఇందులో ఫైట్స్ కంపోజ్ చేశాం. సినిమాలో యాక్షన్ మీరు చూస్తున్నప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి.
-బాలయ్య గారు ఒక అద్భుతం. మేము మంచులో నాలుగు ఐదు కోట్లు వేసుకుని సూట్‌కి వెళ్లేవాళ్లం. బాలకృష్ణ గారు క్యారెక్టర్‌కు తగ్గట్టు స్లీవ్ లెస్‌లో ఆ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చేశారు. ఒక పాత్రలో అంతగా లీనమైపోయే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే బాలకృష్ణ గారి లాంటి నటుడు మనకు ఉండడం మనందరికీ గర్వకారణం.
-ఈ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారి తప్పితే ఈ క్యారెక్టర్‌ని ఇంకెవరు చేయలేరని చెప్పొచ్చు. బాలయ్య గారిని షూటింగ్‌లో ఎదురుగా చూస్తున్నప్పుడు ఒక దైవ శక్తిని చూస్తున్నట్టుగా ఉండేది.
నిర్మాతల గురించి?
-14 రీల్స్ గోపి గారికి రామ్ గారికి ధన్యవాదాలు. అఖండకు మించి డబల్ త్రిబుల్ స్పాన్ ఉన్న సినిమా ఇది. మొదటి నుంచే పాన్ ఇండియా స్థాయిలో అద్భుతంగా ఉండాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు.
-పాన్ ఇండియా లెవెల్లో అద్భుతంగా తీసుకు వెళ్లాలని ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌ని గొప్పగా తీసేలా ప్రోత్సహించారు. మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా శివుడు శక్తి ఇంత అద్భుతంగా ఉంటుందా అని గర్వపడేలా ఈ సినిమా ఉండబోతుంది.
{{/usCountry}}-పాన్ ఇండియా లెవెల్లో అద్భుతంగా తీసుకు వెళ్లాలని ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌ని గొప్పగా తీసేలా ప్రోత్సహించారు. మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా శివుడు శక్తి ఇంత అద్భుతంగా ఉంటుందా అని గర్వపడేలా ఈ సినిమా ఉండబోతుంది.
{{/usCountry}}-ఈసారి జరిగిన కుంభమేళా హిందూ ధర్మానికి ఒక జ్యోతిలా వెలిగింది. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. అలాంటి కుంభమేళాలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం ఒక అద్భుతమైన అనుభూతి.