Avasarala Srinivas: చాలా మంది నటులు మారారు కానీ నేను తప్పా, హీరోయిన్‌తో ఇది మూడో మూవీ: నటుడు అవసరాల శ్రీనివాస్ కామెంట్స్
Avasarala Srinivas Comments In Tortoise Song Launch: నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ నటించిన మూవీ టార్టాయిస్. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి నీ పరిచయం సాంగ్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో అవసరాల శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Avasarala Srinivas Comments In Tortoise Song Launch: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ సినిమా టార్టాయిస్. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అమృత చౌదరి, ధన్య బాలకృష్ణ నటించగా.. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.

నీ పరిచయం సాంగ్ లాంచ్
టార్టాయిస్ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించారు. సస్పెన్స్, డ్రామా, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి నీ పరిచయం సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నీ పరిచయం సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు అవసరాల శ్రీనివాస్, హీరోయిన్ ధన్య బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
యాక్టర్ అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. "చిన్మయి గారి గాత్రం, అనూప్ గారి మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఈ పాట వింటుంటే సినిమాలో ఈ సాంగ్‌కు ఉండే ఇంపార్టెన్స్ తెలిసింది. ఇంతమంచి సాంగ్ రాసిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్" అని అన్నారు.
అందరు మారారు నేను తప్పా
"ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ మూవీ ప్లాన్ చేశాక చాలా మంది ఆర్టిస్టులు మారారు కానీ నన్ను మాత్రం మార్చలేదు. ఇలాంటి క్యారెక్టర్స్ నాకు మరిన్ని రావాలని కోరుకుంటున్నా. ఈ ప్రొడ్యూసర్ ఇంకా మరిన్ని మంచి మూవీస్ చేయాలి" అని నటుడు అవసరాల శ్రీనివాస్ తెలిపారు.
"అమృత పర్‌ఫార్మెన్స్ చూస్తుంటే కొత్త అమ్మాయిలా అనిపించలేదు. ఆమెకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. ధన్యతో నేను కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నా తమ్ముడిగా కనిపిస్తాడు. రాజ్ తరుణ్‌తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీకి థియేటర్స్‌లో మీరు ఇచ్చే రెస్పాన్స్ చూడాలనే ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నాను" అని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఫ్యూర్ ఇన్నోసెన్స్‌తో చేసింది
హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. "ఇదే ప్లేస్‌లో పూజా కార్యక్రమాలతో మా సినిమా ప్రారంభించాం. ఈ రోజు సక్సెస్‌ఫుల్‌గా మా మూవీ కంప్లీట్ చేసి కాన్ఫిడెంట్ గా మీ ముందుకు వస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రమోషన్ గట్టిగా స్టార్ట్ చేయబోతున్నాం" అని తెలిపింది.
"ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా ఈ చిత్రానికి మేము చేసిన జర్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ మూవీ కంప్లీట్ చేశాం. చిన్మయి గారు నా ఫేవరేట్ సింగర్. సింపుల్ లుక్స్‌లో రాజ్ తరుణ్, అమృత ఫ్యూర్ ఇన్నోసెన్స్‌తో చేసిన ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. టార్టాయిస్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూవీ. మీకు బాగా నచ్చుతుంది. అది మా ప్రామిస్" అని నటి ధన్య బాలకృష్ణ చెప్పుకొచ్చింది.
సింగర్ చిన్మయి కామెంట్స్
నీ పరిచయం పాట పాడిన సింగర్ చిన్మయి మాట్లాడుతూ.. "అనూప్ గారి మ్యూజిక్‌లో ఈ పాట పాడే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్న. అలాగే చంద్రబోస్ గారు ఈ పాటకు బ్యూటిఫుల్ లిరిక్స్ అందించారు. ఈ పాట మీ అందరినీ ఎలా అలరిస్తుందో సినిమా కూడా అంతగానే ఎంగేజ్ చేయాలని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


