...
...
Next Story

Bimal Oberoi: చాలా ఆడిషన్స్ ఇచ్చాను, గుండు చేయించుకున్నా- రణ్‌వీర్ హీరోలా కాదు నిర్మాతలా ఉంటాడు: ధురంధర్ 2 నటుడు బిమల్

Bimal Oberoi On Dhurandhar 2 Audition Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రంలో ‘శిరానీ’ పాత్రలో మెప్పించిన బిమల్ ఒబెరాయ్ తనకు ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పారు. అలాగే, సెట్‌లో రణ్‌వీర్ సింగ్ ఎలా మెలిగేవాడు తెలిపారు బిమల్ ఒబెరాయ్.

Published on: Mar 30, 2026, 10:20:48 IST
Advertisement

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ‘షేర్-ఏ-బలోచ్’ అనే బిరుదును అందించే ‘శిరానీ’ పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్‌గా మారి బాగా వైరల్ అవుతోంది. ఈ పాత్రలో నటించిన నటుడు, నిర్మాత బిమల్ ఒబెరాయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ధురంధర్ 2 సినిమా విశేషాలను, రణ్‌వీర్ సింగ్‌తో తన అనుబంధాన్ని పంచుకున్నారు.

ఆడిషన్స్‌తో మొదలైన ప్రయాణం

చాలా ఆడిషన్స్ ఇచ్చాను, గుండు చేయించుకున్నా- రణ్‌వీర్ హీరోలా కాదు నిర్మాతలా ఉంటాడు: ధురంధర్ 2 నటుడు బిమల్
చాలా ఆడిషన్స్ ఇచ్చాను, గుండు చేయించుకున్నా- రణ్‌వీర్ హీరోలా కాదు నిర్మాతలా ఉంటాడు: ధురంధర్ 2 నటుడు బిమల్

ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందనే విషయంపై బిమల్ స్పందిస్తూ.. "నేను ఈ ప్రాజెక్టులో చాలా ఆలస్యంగా చేరాను. అప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. శిరానీ పాత్ర కోసం సరైన నటుడి కోసం వెతుకుతున్న సమయంలో నేను ఆడిషన్ ఇచ్చాను" అని చెప్పారు.

"నేను కొన్ని నెలల్లోనే చాలా ఆడిషన్స్ ఇచ్చాను. వాళ్లు మళ్లీ కాల్ చేస్తామని చెప్పెవారు. ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగింది. ఆ తర్వాత ఆదిత్య ధర్ నన్ను కలిసి, ఈ పాత్ర కోసం గడ్డం పెంచి, గుండు గీయించుకోవాలని అడిగారు. అది వినగానే నేను వెంటనే ఒప్పుకున్నాను. ఇది చాలా మంచి పాత్ర. చాలా ప్రిపరేషన్ కూడా చేశాం. 2018లో మళ్లీ నటనను ప్రారంభించిన నాకు ఇది ఒక అద్భుతమైన అవకాశం" అని బిమల్ ఒబెరాయ్ తెలిపారు.

రణ్‌వీర్ సింగ్ ఒక ఆల్ రౌండర్

షూటింగ్ సెట్‌లో రణ్‌వీర్ సింగ్ ప్రవర్తనపై బిమల్ ఒబెరాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. "రణ్‌వీర్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. సెట్‌లో ఆయన కేవలం ‘హమ్దా’ అనే నటుడిలా మాత్రమే కాకుండా.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌లా, ఒక నిర్మాతలా అన్ని బాధ్యతలు చూసుకునేవారు" అని బిమల్ తెలిపారు.

కాగా ధురంధర్ మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా పాత్రకు ‘షేర్-ఏ-బలోచ్’ బిరుదునిచ్చిన శిరానీ.. రెండో భాగంలో రెహ్మాన్ డెకాయిత్ మరణం తర్వాత ఆ టైటిల్‌ను రణ్‌వీర్ పాత్ర అయిన హమ్జా అలీ మజారీకి అందిస్తారు. ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌పై హమ్జా తీర్చుకునే ప్రతీకారంలో శిరానీ పాత్ర ఎంతో కీలకంగా మారుతుంది.

రికార్డుల వేటలో 'ధురంధర్ 2'

మొదటి భాగం ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ‘ధురంధర్: ది రివెంజ్’ కూడా అదే బాటలో నడుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి మొదటి భాగం రికార్డును అధిగమించింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచేందుకు ధురంధర్ 2 సిద్ధమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe