...
...
Next Story

200 కథలు, బ్లాంక్ చెక్స్‌తో నా ముందు నిర్మాతలు ఉండేవారు- ఎంత డబ్బైన రాసుకోమన్నారు.. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కామెంట్స్

Nawazuddin Siddiqui About 200 Scripts Blank Cheque: అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2' తన కెరీర్‌ను మలుపు తిప్పిందని బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వెల్లడించారు. ఆ మూవీ తర్వాత వందల కథలు వచ్చాయని, నిర్మాతలు బ్లాంక్ చెక్కులు ఇచ్చి ఎంత డబ్బు అయిన రాసుకోమన్నారని తెలిపారు.

Published on: Sep 14, 2026, 11:42:54 IST
Advertisement

Nawazuddin Siddiqui About 200 Scripts Blank Cheque: బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మంది కొత్త నటులకు ప్రేరణగా నిలుస్తుంటారు.

200 కథలు, బ్లాంక్ చెక్స్‌తో నా ముందు నిర్మాతలు ఉండేవారు- ఎంత డబ్బైన రాసుకోమన్నారు.. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కామెంట్స్
200 కథలు, బ్లాంక్ చెక్స్‌తో నా ముందు నిర్మాతలు ఉండేవారు- ఎంత డబ్బైన రాసుకోమన్నారు.. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కామెంట్స్

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2' తన సినీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ సిద్ధిఖీ పంచుకున్నారు.

200 కథలు.. టేబుల్‌పై బ్లాంక్ చెక్కులు!

'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2' సాధించిన విజయం తర్వాత తనకు నిజమైన స్టార్‌డమ్ వచ్చిందని నవాజుద్దీన్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా విడుదలైన వెంటనే దాదాపు 200కి పైగా కథలు తన వద్దకు వచ్చినట్లు ఆయన చెప్పారు.

"నా టేబుల్‌పై బ్లాంక్ చెక్కులు పడి ఉండేవి. ఇదిగో కథ, ఇదిగో ఖాళీ చెక్.. నీకు కావలసినంత డబ్బు రాసుకో, ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడే షూటింగ్ చేద్దాం అని నిర్మాతలు ఆఫర్లు ఇచ్చేవారు" అని నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు. అంత పెద్ద ఆఫర్లు వచ్చినా, ఒక్క కథ కూడా నచ్చకపోవడంతో సైన్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు నవాజుద్దీన్ స్పష్టం చేశారు.

తొందరపడకుండా ఓపికతో..

"నాకు ఏ స్క్రిప్ట్ నచ్చలేదు. అందుకే ఒక్కటి కూడా ఒప్పుకోలేదు. మంచి అవకాశం వచ్చేవరకు ఆగాలనుకున్నాను. అవకాశాల కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన అనుభవం నాకు ఉంది. తొందరపడి నచ్చని సినిమాలు చేసేకంటే, మరో రెండేళ్లు ఖాళీగా ఉండడమే మేలని భావించాను" అని నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు.

ఫైజల్ ఖాన్‌గా మరపురాని నటన

మొదట్లో లక్ష్యం లేకుండా తిరిగే ఒక సగటు యువకుడిగా కనిపించి, కుటుంబంలో జరిగిన దారుణాల తర్వాత క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌గా మారే క్రమాన్ని ఆయన అద్భుతంగా పండించారు. ధన్‌బాద్‌లోని బొగ్గు గనుల ఆధారంగా సాగే ముఠా కక్షల నేపథ్యాన్ని అనురాగ్ కశ్యప్ ఎంత నగ్నంగా చూపించారో, నవాజుద్దీన్ నటన అంతటి జీవాన్ని పోసింది.

'తుంబాడ్ 2'లో భారీ ప్రాజెక్ట్

ఈ చిత్రం ఉత్తరాదినే కాకుండా దక్షిణాది ఓటీటీ ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ పొందింది. ఇటీవల 'మై యాక్టర్ నహి హూన్' చిత్రంతో పలకరించిన నవాజుద్దీన్, త్వరలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ హారర్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న 'తుంబాడ్ 2'లో నటించబోతున్నారు.

ఇందులో అలియా భట్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. 2018లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ 'తుంబాడ్' కు సీక్వెల్‌గా ఇది వస్తోంది. ముంబైలో దాదాపు 7 నుంచి 8 ఎకరాల విశాలమైన స్థలంలో భారీ సిటీ సెట్ వేసి ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు.

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో నయా విజువల్ వండర్

ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లుగా ఉండనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. "ప్రళయ్ ఆయేగా" అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ విజువల్ వండర్ 2027 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks