Rajendra Prasad Speech In Pithapuram Lo Ala Modalaindi Pre Release Event: ప్రేయసి రావే సినిమా డైరెక్టర్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పిఠాపురంలో అలా మొదలైంది. రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ రాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో నటించారు.
పిఠాపురంలో అలా మొదలైంది ప్రీ రిలీజ్ ఈవెంట్

మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎమ్ మురళి (గోదారి కిట్టయ్య) ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పిఠాపురంలో అలా మొదలైంది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురంలో అలా మొదలైంది మూవీ టీజర్‌ను సీనియర్ హీరో సుమన్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్, సుమన్ తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నటుడు సుమన్ కామెంట్స్
సీనియర్ హీరో, నటుడు సుమన్ మాట్లాడుతూ .. "చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆయన క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడు. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి. కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను" అని అన్నారు.
డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "నా 49 సంవత్సరాల సినిమా జీవితంలో నాకు దొరికిన అదృష్టం ఏమిటంటే, నాకు దొరికిన మంచి పాత్రలు. ఇదే ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ గారు ‘ఆ నలుగురు’ ప్రివ్యూ చూసి ‘ఈ సినిమాలో రఘురామ్ పాత్ర కాకుండా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని చూశాను. ఎక్కడా దొరకలేదు’ అని అభినందించారు" అని తెలిపారు.
అది నా గొప్పతనం కాదు
"సి.నారాయణరెడ్డి గారు కూడా ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడిపిస్తున్నావంటూ నాకు ‘నట కిరీటి’ బిరుదు ఇచ్చారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆ పాత్రల తాలూకు గొప్పతనం. తీసినవారి గొప్పతనం. అలాంటి పాత్రలు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన వరం" అని సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
{{/usCountry}}"సి.నారాయణరెడ్డి గారు కూడా ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడిపిస్తున్నావంటూ నాకు ‘నట కిరీటి’ బిరుదు ఇచ్చారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆ పాత్రల తాలూకు గొప్పతనం. తీసినవారి గొప్పతనం. అలాంటి పాత్రలు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన వరం" అని సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
{{/usCountry}}"ఎవరైనా హాలీవుడ్ నటుడిని కూర్చోబెట్టి, ఇదే థియేటర్లో పొద్దున ‘లేడీస్ టైలర్’, సాయంత్రం ‘ఆ నలుగురు’ సినిమా చూపిస్తే ఆ ఆర్టిస్టు ఎవరు, ఈ ఆర్టిస్టు ఎవరు అని అడుగుతారు. ఈ అదృష్టమంతా నాకు ఆ పాత్రలవల్లే దక్కింది" అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
నా పాత్ర డెప్త్ ఏంటో అర్థమైంది
"చంద్ర మహేష్ ఎలాంటి దర్శకుడో నాకు ముందు నుంచీ తెలుసు. ఈ కథ చెప్పినప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. చంద్ర మహేష్ అంటే ఏమిటో ఈ సినిమా చూపిస్తుంది. ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు తను" అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
"ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఎందుకంటే, ఇది అందరి ఇళ్లలో ఉండే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్" అని కృతజ్ఞత చూపారు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.
దండం పెట్టి చెబుతున్నా
"క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతటి ఎమోషన్ ఉంది. దాంతోపాటే ఈ జనరేషన్‌కి నచ్చే అన్ని మసాలాలూ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ దండం పెట్టి చెబుతున్నా. దయచేసి ఒక మంచి సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడండి" అని తన స్పీచ్ ముగించారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.