ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సుయోధన. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.
సుయోధన ప్రీ రిలీజ్ ఈవెంట్

సుయోధన సినిమా ఈ నెల 27న అంటే రేపే ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ సుయోధన సినిమాను విడుదల చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఇవాళ (మార్చి 26) సుయోధన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దుర్యోధనుడి నాటకం వేశా
యాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ.. "నేను 1972లో దుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. ఇప్పుడు ఈ చిత్రంలో సుయోధనుడిగా నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకువచ్చాయి" అని అన్నారు.
"మీరు చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతున్నారు. వీలైతే సినిమా అంతా ఇక్కడే చూడాలని ఉంది. మూవీలో ఎలాంటి మలుపులు ఉంటాయో మాకూ తెలియదు. రీసెంట్‌గా ఈ మూవీ ప్రమోషన్స్ యూఎస్‌లో చేశాం. ప్రియదర్శికి ఇక్కడే కాదు యూఎస్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. యూఎస్‌లోని వాళ్లు సుయోధనతో ఒక మంచి మూవీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని అన్నారు" అని సాయి కుమార్ తెలిపారు.
చిన్నప్పుడే నాన్నగారు నేర్పించారు
"అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే విషయాన్ని మా నాన్నగారు చిన్నప్పుడే నేర్పించారు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. ఇలాంటి సినిమాలు తరుచూ రావు. ఈ టీమ్ అంతా చాలా కష్టపడి, ప్యాషనేట్‌గా మూవీ చేశారు. రేపు థియేటర్స్‌లోకి వస్తున్న సుయోధన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా" అని సాయి కుమార్ తన స్పీచ్ ముగించారు.
{{/usCountry}}"అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే విషయాన్ని మా నాన్నగారు చిన్నప్పుడే నేర్పించారు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. ఇలాంటి సినిమాలు తరుచూ రావు. ఈ టీమ్ అంతా చాలా కష్టపడి, ప్యాషనేట్‌గా మూవీ చేశారు. రేపు థియేటర్స్‌లోకి వస్తున్న సుయోధన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా" అని సాయి కుమార్ తన స్పీచ్ ముగించారు.
{{/usCountry}}ఇదే ఈవెంట్‌లో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ.. "నేను ఈ సినిమాలోకి రావడానికి కారణం ఎడిటర్ చోటా కె ప్రసాద్. ఆయన ఈ సినిమాకు ఎడిటింగ్‌తో పాటు అనేక విషయాల్లో సపోర్ట్ చేస్తూ అండగా నిలిచారు" అని తెలిపారు.
మంచి సెట్ వర్క్ చేశాం
"ఈ మూవీ కోసం మంచి సెట్ వర్క్ చేశాం. అది మూవీలో చాలా బిగ్ స్పాన్‌లో కనిపిస్తుంది. సాయి కుమార్ గారికి, ప్రియదర్శికి తమ కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా సుయోధన నిలుస్తుంది" అని చెప్పుకొచ్చారు బ్రహ్మ కడలి.
"సుయోధన సినిమా ఒక సౌండింగ్ నేపథ్యంగా ఉంటుంది అని తెలియగానే మ్యూజిక్ డైరెక్టర్‌గా హ్యాపీగా ఫీలయ్యాను. ఒక కొత్త వైబ్ ఈ సినిమాలో మీరంతా ఫీలవుతారు" అని సంగీత దర్శకుడు జై క్రిష్ పేర్కొన్నారు.
బీజీఎమ్ మరింత బాగా వచ్చేలా
"ప్రియదర్శి, సాయి కుమార్ గారి పర్‌ఫార్మెన్స్‌లు చూశాక నా బీజీఎమ్‌ను మరింత బాగా వచ్చేలా చూసుకున్నాను. ఈ సినిమా మీ అందరికీ ఒక కొత్త అనుభూతిని పంచుతుంది" అని వెల్లడించారు మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్.