...
...
Next Story

NTR NEEL: రాసిపెట్టుకోండి.. తారక్ అన్న రూ.2 వేల కోట్లు కొట్టడం గ్యారెంటీ.. ఎన్టీఆర్-నీల్ మూవీపై నటుడి సంచలన వ్యాఖ్యలు

NTR NEEL: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమాపై భారీ హైప్ ఉంది. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇందులో నటించిన ఓ నటుడు కామెంట్లు వైరల్ గా మారాయి. ఈ మూవీ రూ.2 వేలు కొట్టడం గ్యారెంటీ అని ఆ నటుడు పేర్కొన్నాడు.

Published on: Mar 3, 2026, 12:18:15 IST
Advertisement

ఓ వైపు కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్.. మరోవైపు యాక్టింగ్ తో అదరగొట్టే యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీళ్ల కాంబినేషన్లో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటున్న ఎన్టీఆర్ నీల్ మూవీపై భారీ హైప్ ఉంది. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ నటుడు చేసిన కామెంట్లు దీనికి మరింత క్రేజ్ ను ఇచ్చాయి.

శివకుమార్ కామెంట్లు

రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (instagram-jrntr)
రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (instagram-jrntr)

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సాగిపోతున్న శివ కుమార్ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని సినిమాల్లో విలన్ గా చేసిన శివ, హీరోగానూ తన లక్ పరీక్షించుకుంటున్నాడు. ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్)లో శివ కుమార్ నటిస్తున్నాడు. తాజాగా ఓ మూవీ ఈవెంట్లో ఎన్టీఆర్-నీల్ సినిమా గురించి శివ కుమార్ సంచలన కామెంట్లు చేశాడు.

2000 కోట్లు

ఓ మూవీ ఈవెంట్లో ఎన్టీఆర్-నీల్ సినిమా గురించి శివ కుమార్ ను ప్రశ్నలు అడిగారు. ‘‘నేను శివకుమార్. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా. ఆ సినిమా (ఎన్టీఆర్-నీల్) షూటింగ్ నుంచి వచ్చి అయిదు రోజులే అవుతుంది. ఈ కథ, బిల్డప్ లు అందరూ చెప్పేవే. ఈ సంవత్సరం తారక్ అన్న రూ.2000 కోట్లు కొడతాడు.

రాసి పెట్టుకోండి. అన్న నడుం ఇంతే ఉంది. ఏడారిలో ఆయన వాక్ అదిరిపోయింది. మీరే చూస్తారు. ఇంతకుమించి ఇంకేం చెప్పను’’ అని శివ కుమార్ రిప్లే ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నిన్ను కోరి, తొలి ప్రేమ, మజిలీ, భీష్మ, వకీల్ సాబ్, హిట్ 2, నరుడి బతుకు నటన, విద్రోహి తదితర సినిమాల్లో శివకుమార్ నటించాడు.

నీల్ సినిమా కోసం

జూనియర్ ఎన్టీఆర్ చివరగా వార్ 2 సినిమాలో నటించాడు. బాలీవుడ్ లో అతనికి ఇది డెబ్యూ మూవీ. హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపర్చింది. స్పై థ్రిల్లర్ గా థియేటర్లలోకి వచ్చిన వార్ 2 ఫ్లాప్ గా నిలిచిపోయింది.

వార్ 2 ఫెయిల్యూర్ కారణంగా ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ అందరూ ప్రశాంత్ నీల్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe