...
...
Next Story

Aasman: హీరోగా నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్- సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆస్మాన్- కోడి రామకృష్ణ శిష్యుడు డైరెక్టర్

Aasman Pooja Ceremony: తెలుగు సీనియర్ నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆస్మాన్. శ్రీ క్లింకార సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో వస్తోన్న ఆస్మాన్ మూవీ పూజా కార్యక్రమానికి హీరోలు సాయి దుర్గా తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్‌తోపాటు నిహారిక కొణిదెల హాజరయ్యారు.

Published on: Apr 5, 2026, 10:13:15 IST
Advertisement

శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ‘ఆస్మాన్’ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాను కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం (ఏప్రిల్ 4) నాడు ఘనంగా నిర్వహించారు.

అతిథులుగా హీరోలు

హీరోగా నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్- సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆస్మాన్- కోడి రామకృష్ణ శిష్యుడు డైరెక్టర్
హీరోగా నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్- సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆస్మాన్- కోడి రామకృష్ణ శిష్యుడు డైరెక్టర్

శ్రీహరి కొడుకు హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీ పూజా కార్యక్రమానికి సుప్రీం హరీరో సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని అందించగా.. తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు.

ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవంలో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. "నా ‘ఆస్మాన్’ సినిమా ప్రారంభోత్సవంకి వచ్చిన సాయి అన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి అందరికీ థాంక్స్. నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్ నందన్ ఓ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నాం. మిగిలిన వివరాలు మున్ముందు ప్రకటిస్తాం" అని అన్నారు.

రామ్ నందన్ కామెంట్స్

డైరెక్టర్ రామ్ నందన్ మాట్లాడుతూ.. "తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి అవకాశం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్ గారు, శ్రీకాంత్ గార్లకు థాంక్స్. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మూడు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేస్తాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో రాబోతోన్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది" అని తెలిపారు.

నిర్మాత వెంకటేష్ కొండారు మాట్లాడుతూ.. "మా తొలి చిత్రం ‘ఆస్మాన్’ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మూడేళ్ల క్రితం మా ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశాం. అప్పటి నుంచీ కథలు వింటూనే ఉన్నాం" అని చెప్పారు.

"కోడి రామకృష్ణ గారి స్టూడెంట్ అయిన రామ్ నందన్ మాకు ఈ కథను ఏడాది క్రితం చెప్పారు. ఆయన ఇది వరకే అరబిక్‌లో సినిమా చేశారు. ఇక రామ్ నందన్ గారు చెప్పిన కథకి మేఘాంశ్ గారు సెట్ అవుతారని మేం ఆయన్ను సంప్రదించాం. మేఘాంశ్ గారికి కథ చాలా నచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం రాబోతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం" అని నిర్మాత వెంకటేష్ కొండారు వెల్లడించారు.

"నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్ గారు, శ్రీకాంత్ గార్లకు థాంక్స్. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది" అని శోయభ్ పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe