Heroine Anjali On Marriage Love Rumours: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో అమాయకపు నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'సీతమ్మ'గా చెరగని ముద్ర వేసుకున్నారు హీరోయిన్ అంజలి. రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అంజలిపై రూమర్స్

వెండితెరపై ఎంతటి ఘనవిజయం సాధించినా.. ఆమె వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్లు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. టాలీవుడ్‌లో 'బలుపు', 'గీతాంజలి' వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు కోలీవుడ్‌లో 'అంగడి తెరు' (తెలుగులో షాపింగ్ మాల్), అజిత్ నటించిన 'మంకాతా' (తెలుగులో గ్యాంబ్లర్) వంటి భారీ హిట్లతో అంజలి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగారు.
గత కొంతకాలంగా ఆమె వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ, అంజలి పెళ్లిపై, హీరోలతో లవ్ ఎఫైర్లపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కొంతమంది హీరోలు, దర్శకులతో ఆమె ప్రేమలో పడిందని, అమెరికాకు చెందిన ఓ ఎన్నారై (NRI) ని రహస్యంగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిందంటూ వార్తలు ప్రచారమయ్యాయి. ఈ పుకార్లపై అంజలి ఎక్కడా నోరు మెదపలేదు.
యాంకర్ ఓంకార్‌తో పెళ్లి
బుల్లితెర యాంకర్, తెలుగు డైరెక్టర్ ఓంకార్‌ను కూడా అంజలి పెళ్లి చేసుకుంటుందనే వార్తలు పదేళ్ల క్రితం తెగ వైరల్ అయ్యాయి. అయితే, వాటిపై అప్పుడే అంజలి క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ డిక్టేటర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో అసలు డైరెక్టర్ ఓంకార్ ఎవరో కూడా తెలియదని, ఎప్పుడు చూడలేదని, సినిమా ఆఫర్ కూడా రాలేదని అంజలి అప్పుడే ఆ రూమర్స్‌కు స్వస్తి పలికింది.
విశాల్ 'మకుటం' సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ
ఇక ప్రస్తుతం నలభై ఏళ్ల వయసుకు చేరుకున్న అంజలి.. మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీ అవ్వడానికి పక్కా స్కెచ్ వేస్తున్నారు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే తమిళ యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మగుడం' (తెలుగులో మకుటం)లో ఆమె లీడ్ రోల్ పోషిస్తున్నారు.
నా పెళ్లి వార్తల్లో నిజం లేదు
{{/usCountry}}ఇక ప్రస్తుతం నలభై ఏళ్ల వయసుకు చేరుకున్న అంజలి.. మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీ అవ్వడానికి పక్కా స్కెచ్ వేస్తున్నారు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే తమిళ యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మగుడం' (తెలుగులో మకుటం)లో ఆమె లీడ్ రోల్ పోషిస్తున్నారు.
నా పెళ్లి వార్తల్లో నిజం లేదు
{{/usCountry}}మకుటం సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అంజలికి తన వ్యక్తిగత జీవితం, ప్రేమాయణాలపై మళ్లీ ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ఇంటర్వ్యూలలో తనపై వస్తున్న రూమర్ల గురించి అంజలి ఎంతో ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు.
ఇన్నేళ్లుగా తనపై వస్తున్న అసత్య ప్రచారాలకు ఈ ఒక్క సమాధానంతో తెరదించారు. హీరోలతో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చాలా వార్తలు వచ్చినట్లు, అవి తనను ఎంతో బాధపెట్టినట్లు అంజలి పేర్కొన్నారు.
నా జీవితంలో ఎవరు లేరు
"నా వ్యక్తిగత జీవితం గురించి వచ్చే రూమర్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి వార్తలను నేను అస్సలు పట్టించుకోను. నేను ఒకరి పేరు చెబితే మీరు మరొకరి గురించి అడుగుతారు. అందుకే నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ప్రస్తుతం నా జీవితంలో ఎవరు లేరు. నేను ఇప్పటికీ ఒంటరిగానే (సింగిల్) ఉన్నాను" అని అంజలి స్పష్టం చేశారు.
అనంతరం తన స్కూల్ డేస్‌లో జరిగిన ఒక ఫన్నీ సంఘటనను అంజలి పంచుకున్నారు. "స్కూల్‌లో నా క్లాస్‌మేట్ నాకు వరుసగా ప్రపోజ్ చేస్తూనే ఉండేవాడు. ఓ రోజు నువ్వు రాఖీ కట్టగలవా అని సవాల్ విసిరాడు. దాంతో నేను ఏమాత్రం ఆలోచించకుండా అతనికి నిజంగానే రాఖీ కట్టాను" అని అంజలి చెప్పారు.
సీన్ రివర్స్ అయింది
"రాఖీ కడితే ఆ అబ్బాయి వెంటపడటం ఆపేస్తాడనుకున్నా. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయింది. వెంటనే రాఖీ తీసి నాకు ఇచ్చేసి వెళ్లిపోయాడు" అని హీరోయిన్ అంజలి చెప్పుకొచ్చారు.