...
...
Next Story

Actress: బయటకెళ్లి డబ్బు సంపాదించకపోయిన మహిళలే అసలైన శక్తిమంతులు, నటులకు వేరే ఆదాయ మార్గం ఉండాలి: నటి హర్షిత కామెంట్స్

Actress Harshita Gaur About Women And Extra Income Sources: సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'మీర్జాపూర్'లో బద్ధశత్రువుల వర్గాలుగా కనిపించిన హర్షిత గౌర్, దివ్యేందు ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన వెయిటింగ్ హై వెబ్ సిరీస్‌లో దంపతులుగా అలరిస్తున్నారు. మహిళల శక్తి, నటీనటులకు అదనపు ఆదాయంపై హర్షిత పంచుకున్నారు.

Published on: Oct 1, 2026, 15:01:34 IST
Advertisement

Actress Harshita Gaur About Women And Extra Income Sources: ఒకే తెరపై కరడుగట్టిన ప్రత్యర్థులుగా కనిపించిన నటీనటులు, మరో ప్రాజెక్టులో అత్యంత ఆత్మీయమైన భార్యాభర్తలుగా నటిస్తే ఆ భావన ఎలా ఉంటుంది? సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'మీర్జాపూర్'లో విలన్ మున్నా త్రిపాఠి (దివ్యేందు), హీరో చెల్లి డింపీ (హర్షిత గౌర్) పాత్రలను ప్రేక్షకులు అంత సులభంగా మరచిపోలేరు.

ఓటీటీ రిలీజ్ అయిన సిరీస్

బయటకెళ్లి డబ్బు సంపాదించకపోయిన మహిళలే అసలైన శక్తిమంతులు, నటులకు వేరే ఆదాయ మార్గం ఉండాలి: నటి హర్షిత కామెంట్స్
బయటకెళ్లి డబ్బు సంపాదించకపోయిన మహిళలే అసలైన శక్తిమంతులు, నటులకు వేరే ఆదాయ మార్గం ఉండాలి: నటి హర్షిత కామెంట్స్

రక్తపాతం, కక్షసాధింపులతో సాగే ఆ క్రైమ్ ప్రపంచంలో ఒకరికొకరు బద్ధశత్రువులు. కానీ ఇటీవల ఓటీటీ రిలీజ్ అయిన 'వెయిటింగ్ హై' అనే వెబ్ షోలో వీరిద్దరూ సుగంధ్, ప్రిన్సీ పాత్రల్లో దంపతులుగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ వినూత్న ప్రయాణంపై నటి హర్షిత గౌర్ హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆధిపత్యం కాదు.. ఇంటిని నడిపే స్త్రీలదే అసలైన బలం!

'వెయిటింగ్ హై' ఓటీటీ సిరీస్‌లో అత్తగారైన సునీతా రాజ్‌వార్‌తో తన కాంబినేషన్ సీన్ల గురించి హర్షిత మాట్లాడారు. సమాజంలో ఇల్లు చక్కదిద్దే గృహిణుల శ్రమకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

"ప్రతి ఇంట్లోనూ కుటుంబ బంధాలను నిలబెడుతూ, అందరినీ ఏకం చేసే మహిళలే అసలైన శక్తులు. బయటకు వెళ్లి డబ్బు సంపాదించకపోయినా, ఇంట్లోని భావోద్వేగాలను భరిస్తూ నిశ్శబ్దంగా తమ బలాన్ని చాటుకుంటారు" అని హర్షిత గౌర్ వ్యాఖ్యానించారు. ఈ షోలో ప్రిన్సీ పాత్ర అటువంటి గృహిణుల ప్రాతినిధ్యమేనని పేర్కొన్నారు.

'మీర్జాపూర్' సీరియస్.. సెట్‌లో మాత్రం నవ్వుల పువ్వులు!

అలాగే రక్తపాతం, సీరియస్ డ్రామాతో సాగే 'మీర్జాపూర్' చిత్రీకరణ సమయంలో వాతావరణం ఎప్పుడూ ఒత్తిడితో కూడుకుని ఉండేదని, అయితే దర్శకుడు గుర్మీత్ సింగ్ మాత్రమే సెట్‌లోని ప్రతి ఒక్కరినీ ప్రశాంతంగా, సరదాగా ఉంచేవారని గుర్తుచేసుకున్నారు.

రవికిషన్ ఉత్సాహం.. జితేంద్ర కుమార్ ఎంట్రీ!

'మీర్జాపూర్ ది మూవీ'లో సీనియర్ నటుడు రవి కిషన్‌తో పనిచేసిన అనుభవాన్ని హర్షిత పంచుకున్నారు. నాటి తరం నుంచి నేటి వరకు ముప్పై-నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ, ఆయనలో ఇప్పటికీ ఒక చిన్న పిల్లాడి లాంటి ఉత్సాహం ఉందన్నారు. సెట్‌లో ఆయన చూపించే శక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు.

ఇక నటుడు విక్రాంత్ మాస్సీ స్థానంలో జితేంద్ర కుమార్ మిర్జాపూర్ సినిమాలో నటించడంపై హర్షిత్ గౌర్ స్పందిస్తూ.. "ఇప్పటికే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఒక పాత్రలోకి కొత్తగా అడుగుపెట్టడం ఏ నటుడికైనా కష్టమే. కానీ జితేంద్ర కుమార్ ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు అద్భుతం" అని ప్రశంసించారు.

అవకాశాల కోసం నిరీక్షణ.. మానసిక ఆరోగ్యమే ముఖ్యం!

చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం వేచిచూసే సమయాన్ని ఎదుర్కోవడం ఎంతో సవాలుతో కూడుకున్నదని హర్షిత స్పష్టం చేశారు. "ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడాన్ని నేను తిరస్కరణగా చూడను. ఆ పాత్రకు మనం సరిపోలేదని మాత్రమే భావిస్తాను. సుదీర్ఘకాలం అవకాశాలు లేకపోతే ఆత్మవిశ్వాసం సడలే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిరోజూ మన మనసును దృఢంగా ఉంచుకోవాలి" అని సూచించారు.

నటులకు నటనే కాకుండా మరో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం ఉండటం చాలా అవసరమని, సోషల్ మీడియా ద్వారా ఆదాయం పొందే వెసులుబాటు ఉండటం వల్ల నచ్చిన ప్రాజెక్ట్‌లను మాత్రమే ఎంచుకునే స్వేచ్ఛ దక్కుతోందని హర్షిత గౌర్ చెప్పుకొచ్చారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks