Indraja About Anakapalli Theaters And OTT Watch In Thank You Meet: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట హీరోహీరోయిన్లుగా.. తారక్ పొన్నప్ప విలన్‌గా నటించారు.
అక్టోబర్ 2న విడుదలై మంచి రెస్పాన్స్

ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన అనకాపల్లి సినిమాకు కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించిన అనకాపల్లి సినిమా అక్టోబర్ 2న విడుదలై అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది.
త్రినాథరావు, ఇంద్రజ, లగడపాటి శ్రీధర్ కామెంట్స్
ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 6) నాడు అనకాపల్లి థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, లగడపాటి శ్రీధర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నేను డబ్బులేమీ పెట్టలేదు
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. "‘అనకాపల్లి’ సినిమాకి నేను డబ్బులేమీ పెట్టలేదు. నా పేరు పెడితే ఎవరైనా చూసేందుకు వస్తారని అలా పెట్టారు. సోమవారం వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేశాను. సోమవారమే కాదు.. ఈ రోజు (మంగళవారం) కూడా మంచి ఫ్లోటింగ్ ఉంది. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి" అని చెప్పారు.
ఆర్టిస్టులందరికీ మంచి పేరు వస్తోంది
"అనకాపల్లి సినిమాకు అన్ని వైపుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. పర్ఫామెన్స్ పరంగా ఆర్టిస్టులందరికీ మంచి పేరు వస్తోంది. ఈ సినిమాని ఇలానే మరింత ముందుకు తీసుకు వెళ్లాలని మీడియా, ఆడియెన్స్‌ని కోరుకుంటున్నాను" అని త్రినాథరావు నక్కిన కోరారు.
అసలు సిసలు విజయం
సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ మాట్లాడుతూ .. "‘అనకాపల్లి’ అసలు సిసలు విజయాన్ని సాధించింది. అందుకే ఈ రోజు ఈ థాంక్యూ మీట్‌కి వచ్చాను. ఇలాంటి మంచి చిత్రానికి సరైన సంఖ్యలో థియేటర్లు ఇవ్వకపోవడం బాధగా ఉంది. చూసిన ప్రతీ ఒక్కరూ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు" అని అన్నారు.
థియేటర్లో చూడలేకపోయామనుకుంటారు
{{/usCountry}}సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ మాట్లాడుతూ .. "‘అనకాపల్లి’ అసలు సిసలు విజయాన్ని సాధించింది. అందుకే ఈ రోజు ఈ థాంక్యూ మీట్‌కి వచ్చాను. ఇలాంటి మంచి చిత్రానికి సరైన సంఖ్యలో థియేటర్లు ఇవ్వకపోవడం బాధగా ఉంది. చూసిన ప్రతీ ఒక్కరూ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు" అని అన్నారు.
థియేటర్లో చూడలేకపోయామనుకుంటారు
{{/usCountry}}"సినిమాలో ఎవరున్నారు? ఎవరు తీశారు అన్నది పట్టించుకోవడం లేదు. బాగుందా? లేదా? నచ్చిందా? లేదా? అన్నది మాత్రమే ఆడియెన్స్ చూస్తున్నారు. మా సినిమాకి మరిన్ని మంచి థియేటర్లు లభిస్తాయని ఆశిస్తున్నాను. ఓటీటీలో కూడా మా మూవీని చూడండి. కానీ అప్పుడు థియేటర్లో చూడలేకపోయామనే ఫీల్ అవుతారు. మా చిత్రం అంత అద్భుతంగా ఉంటుంది" అని ఇంద్రజ చెప్పుకొచ్చారు.
నా కొడుకు మీద సినిమా తీయడం
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ .. "‘అనకాపల్లి’ సక్సెస్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. విక్రమ్ నా కొడుకు అవ్వడం, అతని మీద ఒక సినిమా తీయడానికి త్రినాథ్ రావు గారు, నాయుడు గారు ముందుకు రావడం గొప్ప విషయం. ఇలాంటి చిన్న చిత్రాలకు మీడియానే ముందుండి సపోర్ట్ చేస్తుంది" అని తెలిపారు.
ఎవడిగోల వాడిదే లాగా
"‘ఎవడిగోల వాడిదే’ సినిమాని ఫస్ట్ వీక్‌కే తీసేస్తామని అన్నారు. కానీ, అదే థియేటర్లో చివరకు సిల్వర్ జూబ్లీ జరిగింది. అలానే ‘అనకాపల్లి’ కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. దసరా ధమాకాగా ‘అనకాపల్లి’ నిలుస్తుంది. మండే నైట్ షోలు కూడా ఫుల్స్ అయ్యాయి. నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో ‘అనకాపల్లి’ చిత్రం మరింత విజయాన్ని సాధిస్తుందని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు లగడపాటి శ్రీధర్.