సనన్ ఇంట్లో పెళ్లి సందడి ముగిసింది. బాలీవుడ్, టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ కృతి సనన్ గారాల పట్టి, చెల్లెలు నుపుర్ సనన్ పెళ్లి జరిగింది. ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్, నుపుర్ సనన్ ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అయితే, నుపుర్ పెళ్లి వేడుకలన్నీ ముగిశాక ఇప్పుడు కృతి సనన్ ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతున్నారు. తన ప్రాణం లాంటి చెల్లెలు అత్తారింటికి వెళ్లడంతో, ఇల్లంతా వెలితిగా ఉందంటూ ఆమె పంచుకున్న మాటలు ప్రతి అక్కాచెల్లెళ్లనూ కదిలిస్తున్నాయి.
నుపుర్ నా ప్రాణం.. కళ్లు చెమర్చిన కృతి
గురువారం (జనవరి 15) ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన మధుర స్మృతులను పంచుకుంటూ కృతి సనన్ ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. "నా మనసులోని మాటలను చెప్పడానికి పదాలు సరిపోవు.. నా చిన్న తల్లికి పెళ్లి అయిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అంటూ తన ఆవేదనను, ఆనందాన్ని వ్యక్తపరిచింది కృతి సనన్.
"నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు నిన్ను మొదటిసారి ఎత్తుకున్న క్షణం నుంచి.. నేడు నీ పెళ్లిలో నీ తలపై 'పూల చాదర్' పట్టుకుని, నిన్ను అందమైన వధువుగా చూసే వరకు.. కాలం ఎంత త్వరగా మారిపోయింది! నువ్వు నీకు నచ్చిన, నిన్ను ప్రాణంలా చూసుకునే భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే నా మనసు గర్వంతో నిండిపోయింది" అని కృతి సనన్ పేర్కొంది.
స్టెబిన్‌కు సాదర స్వాగతం
స్టెబిన్ బెన్ గత ఐదేళ్లుగా తమ కుటుంబంలో ఒక సభ్యుడిలా కలిసిపోయారని కృతి తెలిపారు. "స్టెబు.. నువ్వు మా ఫ్యామిలీలో ఒకడివి. నీ రూపంలో నాకు ఒక తమ్ముడు, ఒక మంచి స్నేహితుడు దొరికారు. మీరిద్దరూ పెళ్లి ప్రమాణాలు చేసుకుంటున్నప్పుడు అది నా జీవితంలోనే అత్యంత అందమైన ఎమోషనల్ మూమెంట్. మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది" అని చెల్లెలి భర్తపై ప్రేమని చాటింది కృతి సనన్.
ఇల్లు వెలితిగా ఉంది..
పోస్ట్ చివర్లో కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. "నుపుర్.. నువ్వు మా ఇంటికి కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉంటావని, తరచూ వస్తావని నాకు తెలుసు. కానీ, నీ నవ్వులు లేని ఇల్లు ఇప్పుడు చాలా వెలితిగా అనిపిస్తోంది. బోసిపోయినట్లుగా ఉంది. నువ్వు ఇప్పుడు రెండు ఇళ్లలో సంతోషాన్ని నింపుతావు. లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్" అంటూ కన్నీళ్లతో ముగించింది కృతి సనన్.
అక్కా.. నువ్వే నా ప్రపంచం
{{/usCountry}}పోస్ట్ చివర్లో కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. "నుపుర్.. నువ్వు మా ఇంటికి కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉంటావని, తరచూ వస్తావని నాకు తెలుసు. కానీ, నీ నవ్వులు లేని ఇల్లు ఇప్పుడు చాలా వెలితిగా అనిపిస్తోంది. బోసిపోయినట్లుగా ఉంది. నువ్వు ఇప్పుడు రెండు ఇళ్లలో సంతోషాన్ని నింపుతావు. లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్" అంటూ కన్నీళ్లతో ముగించింది కృతి సనన్.
అక్కా.. నువ్వే నా ప్రపంచం
{{/usCountry}}అయితే అక్క పోస్ట్‌కు చెల్లి నుపుర్ సనన్ కూడా అంతే ఎమోషనల్‌గా స్పందించారు. "కృత్సూ.. నువ్వే నా ప్రపంచం, నా లైఫ్ లైన్. ఆ పూల చాదర్ చాలా బరువుగా ఉందని, నువ్వు పట్టుకోలేవని అందరూ నీ ముందే అన్నారు. కానీ, నీకు తెలుసు.. దాన్ని పట్టుకోవాల్సింది కేవలం నువ్వేనని! నా సోదరిగా, సోదరుడిగా, నా ధైర్యంగా, నా చిన్న తల్లిగా నువ్వు చేసిన ప్రతిదీ నాకు గుర్తుంది. లవ్ యూ అక్కా" అంటూ రిప్లై ఇచ్చింది నుపుర్ సనన్.
కాగా, నుపర్ సనన్, స్టెబిన్‌ల వివాహం ఉదయ్‌పూర్‌లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు జరిగింది. ముంబైలో జరిగిన వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు సల్మాన్ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.