Mandira Bedi Emotional: భర్త మరణం తర్వాత నన్ను కాపాడింది అదే.. స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న సాహో నటి మందిరా బేడీ

Mandira Bedi Emotional In Max Min Meowzaki Trailer Launch: ప్రముఖ నటి, టీవీ యాంకర్ మందిరా బేడీ తన భర్త రాజ్ కౌశల్ హఠాన్మరణం తర్వాత ఎదుర్కొన్న తీవ్ర మానసిక వేదనను గుర్తుచేసుకుని విలపించారు. ఆ కఠినమైన రోజుల్లో తనకు సహాయంగా నిలిచిందో ఏంటో చెబుతూ కన్నీరుమున్నీరు అయ్యారు.

Published on: Jul 12, 2026, 13:57:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mandira Bedi Emotional In Max Min Meowzaki Trailer Launch: సంగీత ప్రపంచంలో, బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన మందిరా బేడీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిసిన మందిరా బేడీ అంతకుముందు క్రికెట్ వరల్డ్ కప్ హోస్టింగ్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు.

భర్త మరణం తర్వాత నన్ను కాపాడింది అదే.. స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న సాహో నటి మందిరా బేడీ
భర్త మరణం తర్వాత నన్ను కాపాడింది అదే.. స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న సాహో నటి మందిరా బేడీ

ఒంటరితనంలోకి మందిర

వ్యక్తిగత జీవితంలో ఎంతో ధైర్యంగా కనిపించే మందిర.. 2021లో తన భర్త, దర్శకుడు రాజ్ కౌశల్‌ను కోల్పోయాక తీవ్రమైన ఒంటరితనంలోకి జారుకున్నారు. తాజాగా ఆమె నటించిన 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్‌జాకీ' చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న మందిరా బేడీ, భర్త మరణం తర్వాత తాను అనుభవించిన నరకాన్ని గుర్తుచేసుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

మానసిక ప్రయాణంపై మందిర మనసు విప్పిన వేళ

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మందిరా బేడీ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం, కౌన్సిలింగ్ ప్రాధాన్యత గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే మొదటిసారి థెరపీ సహాయం తీసుకోవడం ప్రారంభించానని చెప్పారు. ఆ సమయంలో సమాజంలో మానసిక కౌన్సిలింగ్‌పై ఉన్న అపోహలను కూడా మందిర ప్రస్తావించారు.

"నేను మొదటిసారి థెరపీ సెషన్‌కు వెళ్లి వచ్చినప్పుడు ఆ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె వెంటనే కంగారుపడుతూ.. 'ఎందుకు వెళ్లావు? నీకేమైంది? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చు కదా!' అని అడిగింది. కానీ నా మనసులో ఉన్న గందరగోళాన్ని, ఆలోచనలను ఒక పద్ధతి ప్రకారం బయటకు నెట్టడానికి ప్రొఫెషనల్ సహాయం అవసరమని నేను నా తల్లికి నచ్చజెప్పాను" అని మందిరా బేడీ ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

భర్త మరణం.. థెరపీతోనే కోలుకున్నా

జీవితంలో ఎప్పుడు మానసిక సమతుల్యత దెబ్బతిన్నా తాను ఒంటరిగా కుంగిపోకుండా థెరపిస్టులు, కౌన్సిలర్ల దగ్గరకు వెళ్లడం అలవాటు చేసుకున్నానని మందిర వివరించారు. అది తనకు ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇచ్చిందని స్పష్టం చేశారు.

"నా భర్తను కోల్పోయిన కఠిన సమయంలో ఆ తీరని లోటు నుంచి, బాధ నుంచి కోలుకోవడానికి థెరపీ నాకు ఒక సంజీవనిలా పనిచేసింది. అందుకే నేను మళ్లీ కౌన్సిలింగ్ ఆశ్రయించాల్సి వచ్చింది" అని మందిర భావోద్వేగంతో పేర్కొన్నారు.

మందిరా బేడీ 1999 ఫిబ్రవరి 14న సినీ నిర్మాత అయిన రాజ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి వీర్ అనే కుమారుడు ఉన్నాడు. 2020లో తారా అనే చిన్నారిని వీరు దత్తత తీసుకున్నారు. అంతా సంతోషంగా సాగుతుందనుకున్న సమయంలో, 2021 జూన్ నెలలో రాజ్ కౌశల్ 50 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్‌తో అకస్మాత్తుగా మరణించారు.

'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్‌జాకీ'తో ప్రేక్షకుల ముందుకు

ఆయన దర్శకుడిగా 'ప్యార్ మే కభీ కభీ', 'షాదీ కా లడ్డూ' వంటి చిత్రాలను తెరకెక్కించారు. మందిరా బేడీ కీలక పాత్రలో నటించిన 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్‌జాకీ' సినిమాను నరసింహమూర్తి రాసి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో '12త్ ఫెయిల్' సినిమాతో యూత్‌కు క్రష్‌గా మారిన మేధా శంకర్ హీరోయిన్‌గా నటించగా.. సిద్ధార్థ్ మీనన్, ఆదిల్ హుస్సేన్, నఫీసా అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమా కథాంశం ఒక యువ జంట బ్రేకప్ చుట్టూ తిరుగుతుంది. ప్రేమ విఫలమై తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న హీరో.. 'మ్యావ్‌జాకీ' అనే ఒక పెంపుడు పిల్లి వల్ల తిరిగి తన జీవితంలో సాధారణ స్థితికి ఎలా వచ్చాడనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.

ఆధునిక కాలపు ప్రేమకథలు, అందులోని గందరగోళాన్ని చర్చిస్తూ వైవిధ్యభరితంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More