Nushrratt Bharuccha Spine Injury In Accident: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నుష్రత్ భరూచా అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేసే వార్త వెలుగులోకి వచ్చింది. పనికి కాస్త విరామం ఇచ్చి సరదాగా గడిపేందుకు ఇండోనేషియాలోని బాలి వెళ్లిన నుష్రత్ అక్కడ అనుకోకుండా తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలింపు

ఈ దురదృష్టకర ఘటనలో నుష్రత్ భరూచా వెన్నెముకకు తీవ్ర గాయమై ఎముక విరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే నుష్రత్‌ను బాలిలోని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడ ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
అత్యవసర శస్ర్తచికిత్స కోసం
అయితే, వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో అత్యవసర శస్త్రచికిత్స (Spine Surgery) అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మెరుగైన వైద్య సేవలు, ఆపరేషన్ కోసం నుష్రత్ భరూచాను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా బాలి నుంచి ముంబైకి తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది.
వైద్య సదుపాయాలు ఉండే ఎయిర్ అంబులెన్స్‌లో
తీవ్రమైన వెన్నెముక గాయాలు ఉన్నప్పుడు సాధారణ విమాన ప్రయాణం ప్రమాదకరం కాబట్టి, సకల వైద్య సదుపాయాలు ఉండే ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ముంబై చేరిన వెంటనే ఆమెను ప్రధాన ఆసుపత్రిలో చేర్చి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు.
ప్రైవసీని ఇవ్వాలని కోరుతున్నాం
"నుష్రత్ భరూచా బాలిలో ఒక ప్రాజెక్ట్ పనిమీద వెళ్లి, ఆ తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉన్నారు. దురదృష్టవశాత్తూ ఆమె ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబానికి, ఆమెకు కావలసిన ప్రైవసీని ఇవ్వాలని కోరుతున్నాం" అని నుష్రత్ పీఆర్ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది.
కోలుకోవడానికి సమయం!
నుష్రత్ భరూచా త్వరగా కోలుకోవడానికి కొంతకాలం విశ్రాంతి అవసరమని, అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆమె పీఆర్ టీమ్ పేర్కొంది.
కీలక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలో..
{{/usCountry}}నుష్రత్ భరూచా త్వరగా కోలుకోవడానికి కొంతకాలం విశ్రాంతి అవసరమని, అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆమె పీఆర్ టీమ్ పేర్కొంది.
కీలక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలో..
{{/usCountry}}ఇకపోతే 'ప్యార్ కా పంచనామా', 'డ్రీమ్ గర్ల్', 'ఛోరీ', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి (హిందీ రీమేక్) వంటి విభిన్న చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నుష్రత్. ఇటీవల సోహమ్ షాతో కలిసి 'ఉఫ్ ఏ సియాపా' చిత్రంలో మెరిసిన ఆమె, ప్రస్తుతం యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన ఒక భారీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సంతకం చేశారు.
టైగర్ ష్రాఫ్‌తో మొదటి సినిమా
టైగర్ ష్రాఫ్, నుష్రత్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది. విక్కీ జైన్ 'విజె ఫ్రేమ్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో పష్మీనా రోషన్, అభిషేక్ బెనర్జీ, ఎల్విష్ యాదవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కథలో ఎంతో ప్రాధాన్యం ఉన్న, వైవిధ్యమైన పాత్రలో నుష్రత్ కనిపించనున్నారు.
షూటింగ్‌లపై ప్రభావం
సరిగ్గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం, నుష్రత్ భరూచా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో రాబోయే సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌పై ప్రభావం పడనుంది.