బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా స్టార్ కిడ్స్ హవా నడుస్తోంది. గతేడాది ‘ఉయి అమ్మ’ అనే సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే, ఈ పాటలో స్టార్ కిడ్ రాషా తడానీ నటించినప్పటికీ ఆమె డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇతర స్టార్ కిడ్స్ కంటే రాషా చాలా బెటర్ అని తెగ కామెంట్స్ వచ్చాయి.
రాషా తడానీపై రూమర్స్

అలా ఉయి అమ్మ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత సీనియర్ హీరోయిన్, కేజీఎఫ్ 2 నటి రవీనా టాండన్ కూతురు అయిన రాషా తడానీపై కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.
స్టార్ కిడ్స్‌పై నెగెటివ్ పీఆర్
తన సొంత ఇమేజ్‌ని పెంచుకోవడానికి ఇతర స్టార్ కిడ్స్‌పై రాషా తడానీ నెగెటివ్ పీఆర్ (Negative PR) చేయిస్తోందని నెట్టింట కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ రూమర్లపై రవీనా టాండన్ తాజాగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
మా కుటుంబానికి అలాంటి అవసరం లేదు
ఒక పాపులర్ పాడ్‌కాస్ట్ సెషన్‌లో పాల్గొన్న రవీనా టాండన్ తన కూతురిపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. "నా సుదీర్ఘ కెరీర్‌లో నేను ఎప్పుడూ ఒక పీఆర్ వ్యక్తిని పెట్టుకోలేదు. అలాంటిది మా స్నేహితుల పిల్లల గురించి, మా కళ్ల ముందే పెరిగిన పిల్లల గురించి తప్పుగా ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇది మా కుటుంబ సంస్కృతే కాదు" అని రవీనా టాండన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
విషపూరితమైన ఫ్యాన్ వార్స్
ఈ వివాదం ‘ఉయి అమ్మ’ సాంగ్ విడుదల తర్వాత మొదలైందని రవీనా గుర్తు చేశారు. కొందరు ఫ్యాన్స్ రాషాను ప్రశంసిస్తూనే ఇతర స్టార్ కిడ్స్‌తో పోలికలు పెట్టడం, అది కాస్తా విషపూరితమైన ఫ్యాన్ వార్స్ (Fan Wars)కి దారితీయడం దురదృష్టకరమని రవీనా టాండన్ పేర్కొన్నారు. ఎవరో ఒకరిని తక్కువ చేసి చూపిస్తేనే మనం గొప్పవాళ్లం అవుతామనే నీచమైన ఆలోచన ఎవరికీ ఉండదని ఆమె నొక్కి చెప్పారు.
రాషా సినీ ప్రయాణం
{{/usCountry}}ఈ వివాదం ‘ఉయి అమ్మ’ సాంగ్ విడుదల తర్వాత మొదలైందని రవీనా గుర్తు చేశారు. కొందరు ఫ్యాన్స్ రాషాను ప్రశంసిస్తూనే ఇతర స్టార్ కిడ్స్‌తో పోలికలు పెట్టడం, అది కాస్తా విషపూరితమైన ఫ్యాన్ వార్స్ (Fan Wars)కి దారితీయడం దురదృష్టకరమని రవీనా టాండన్ పేర్కొన్నారు. ఎవరో ఒకరిని తక్కువ చేసి చూపిస్తేనే మనం గొప్పవాళ్లం అవుతామనే నీచమైన ఆలోచన ఎవరికీ ఉండదని ఆమె నొక్కి చెప్పారు.
రాషా సినీ ప్రయాణం
{{/usCountry}}ఇకపోతే అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆజాద్’ సినిమాతో రాషా తడానీ హిందీ చిత్ర పరిశ్రమలో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, రాషా డ్యాన్స్, నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం రాషా చేతిలో ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.
లైకీ లైకా (Laikey Laikaa): అభయ్ వర్మతో కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో రాషా తడానీ ‘ఛాప్ తిలక్’ అనే పాటతో సింగర్‌గా కూడా పరిచయం కాబోతోంది.
టాలీవుడ్ ఎంట్రీ: ఇటీవల రాషా తడానీ తన తెలుగు అరంగేట్రం గురించి కూడా ప్రకటన చేసింది. మెగా హీరోలతో ఆమె నటించబోతుందనే వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.