టాలీవుడ్ తెలుగు హీరోయిన్లలో బ్యూటిపుల్ శివాని నాగరం ఒకరు. సుహాస్ హీరోగా తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో శివాని నాగరం బాగానే క్లిక్ అయింది. అనంతరం కొంచెం గ్యాప్ తర్వాత లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటి.
కాత్యాయనిగా క్రేజ్

లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయనిగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది శివాని నాగరం. ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి సుహాస్‌తో జత కట్టి శివాని నాగరం నటించిన సినిమా హే బల్‌వంత్. ముందు ఈ సినిమా పేరు హే భగవంత్‌గా ఉండేది.
పలు అనివార్య కారణాల వల్ల రీసెంట్‌గా ఆ టైటిల్ మార్చి హే బలవంత్‌గా పెట్టారు. సుహాస్ హీరోగా శివాని నాగరం హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు గోపి ఆచార్య దర్శకత్వం వహించారు. నరేష్, సుదర్శన్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
పాడ్‌కాస్ట్‌లో కామెంట్స్
తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన హే బల్‌వంత్ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల అయింది. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్‌లో హీరోయిన్ శివాని నాగరం పాల్గొంది. ఈ కార్యక్రమంలో తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
హీరోయిన్ శివాని నాగరం తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. "ఇంటర్ తర్వాత ఇక చాలు చదువుకోడం లైట్ అనుకున్నాను. కానీ మా నాన్న ఒకటి చెప్పారు. నువ్వు ఇంటర్ పాస్ అయితే (ఇంటర్ వరకు చదువు ఆపేస్తే అన్నఅర్థంలో) ఆటో వాడితో పెళ్లి చేస్తా అన్నారు" అని తెలిపింది.
అంత చదువుకుని
{{/usCountry}}హీరోయిన్ శివాని నాగరం తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. "ఇంటర్ తర్వాత ఇక చాలు చదువుకోడం లైట్ అనుకున్నాను. కానీ మా నాన్న ఒకటి చెప్పారు. నువ్వు ఇంటర్ పాస్ అయితే (ఇంటర్ వరకు చదువు ఆపేస్తే అన్నఅర్థంలో) ఆటో వాడితో పెళ్లి చేస్తా అన్నారు" అని తెలిపింది.
అంత చదువుకుని
{{/usCountry}}శివాని నాగరం కొనసాగిస్తూ.. "డిగ్రీ పాస్ అయితే బస్సోడు.. కారు ఓనరు, క్యాబ్ డ్రైవర్ కావాలంటే నువ్వు కనీసం ఎంబీఏ చేయాలి అన్నారు. ఎంబీఏ చేస్తే క్యాబోడు వస్తాడ నాకు అనుకున్నా. తప్పుగా అనుకోకండి (క్యాబ్ డ్రైవర్ల గురించి). కానీ, నిజంగానా.. అంత చదువుకున్నా, అంత కష్టపడ్డా.. ఇదంతా చేసి" అని చెప్పుకొచ్చింది.
దానికి హోస్ట్ నవ్వుతూ.. "ఎంబీఏ చేసి ఓటీపీ చెప్పాలా" అని అన్నారు. దానికి నవ్విన శివాని నాగరం.. "నేనే కారు నేర్చుకుని నేనే క్యాబ్ డ్రైవర్ అవుతా అనిపించింది.. అది చూసి మా డాడీ.. నువ్వు అసలు ఎలా ఆలోచిస్తున్నవ్ బేటా.. అని గివప్ ఇచ్చేశారు" అని వెల్లడించింది.
ప్లే గ్రౌండ్ కూడా లేదు
అనంతరం ఇంటర్‌లో నారాయణ చైతన్య కాలేజీలో జాయన్ అవుదామని, మనం చదువుకోవాల్సిన అవసరం లేదని వాడే చదివిపిస్తాడని అనుకున్నట్లు శివాని నాగరం తెలిపింది. "కానీ, మా డాడీ స్ట్రిక్ట్‌గా నో. నారాయణ చైతన్య నో. అక్కడ ప్లే గ్రౌండ్ కూడా లేదు. ఎందుకు అక్కడ నువ్వు అన్నారు" అని శివాని పేర్కొంది.
"నేను ఆయన్ని కాలేజీకి మరి పట్టుకపోయి చూపించాను. వాళ్లు చెబుతుంటే సర్ మేను రాత్రి 7 వరకు పిల్లలను పంపించము. ఈ పది సమ్స్ చేయకుంటే పంపము. ప్రతి వారం ఒక టెస్ట్ ఉంటది. దాన్నిబట్టి ఏ, బీ సెక్షన్స్ (చదువు రానివాళ్లకు) పెడతాం అన్నాడు" అని శివాని నాగరం చెప్పింది.
నాకు అడ్మిషన్ ఇచ్చినట్లే
"అదంతా విన్నాక మా డాడీ ఏం స్కూల్ ఇది.. ఏం బేఖార్, ఏం గలీజ్ స్కూల్ ఇది. ఏం అవసరం లేదు అన్నాడు. అదంతా చూసి ఇక వీడు నాకు అడ్మిషన్ ఇచ్చినట్లే అనుకున్నా. నడు ఇక్కడి నుంచి అని చెప్పి తీసుకెళ్లి ఫ్రాన్సిస్‌ల వేశారు" అని తన స్కూల్, పెళ్లిపై హీరోయిన్ శివాని నాగరం వెల్లడించింది.