...
...
Next Story

Bigg Boss: బిగ్ బాస్‌లో దారుణం- ఒళ్లంతా దద్దుర్లు, అందరికీ ఒకే టవల్, రేజర్- ఎలుకలు, పురుగులు- నటి సోనాలి లీగల్ నోటీసులు!

Sonali Raut Complaints Bigg Boss 6 Marathi: బిగ్ బాస్ మరాఠీ సీజన్ 6 కంటెస్టెంట్, నటి సోనాలి రౌత్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ హౌస్‌లోని అపరిశుభ్ర వాతావరణం వల్ల తనకు తీవ్రమైన చర్మ వ్యాధి సోకిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Published on: Apr 19, 2026, 07:41:21 IST
Advertisement

Sonali Raut About Bigg Boss Marathi 6: టెలివిజన్ రియాలిటీ షో 'బిగ్ బాస్' అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అయితే ఈసారి బిగ్ బాస్ మరాఠీ 6వ సీజన్ తీవ్ర విమర్శల పాలవుతోంది. నటి సోనాలి రౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

బిగ్ బాస్‌లో దారుణం- ఒళ్లంతా దద్దుర్లు, అందరికీ ఒకే టవల్, రేజర్- ఎలుకలు, పురుగులు- నటి సోనాలి లీగల్ నోటీసులు!
బిగ్ బాస్‌లో దారుణం- ఒళ్లంతా దద్దుర్లు, అందరికీ ఒకే టవల్, రేజర్- ఎలుకలు, పురుగులు- నటి సోనాలి లీగల్ నోటీసులు!

ఆ వీడియోలో సోనాలి రౌత్ శరీరంపై ఉన్న ఎర్రటి దద్దుర్లు, స్కిన్ ఇన్‌ఫెక్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 17న షేర్ చేసిన ఈ వీడియో చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. హౌస్‌లో ఉన్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తన పరిస్థితి ఇలా తయారైందని సోనాలి ఆరోపించారు.

వంటింట్లో ఎలుకలు.. అపరిశుభ్రతకు పరాకాష్ట

బిగ్ బాస్ హౌస్ బయటకి కనిపించేంత కలర్‌ఫుల్‌గా లోపల లేదని సోనాలి రౌత్ కుండబద్దలు కొట్టారు. ప్రేక్షకులు టీవీలో చూసేదానికి, వాస్తవానికి చాలా తేడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వంటింట్లో ఎలుకలు, పురుగులు తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని సోనాలి విమర్శించారు. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేదని, నిద్ర లేకుండా వేధించారని సోనాలి ఆవేదన వ్యక్తం చేశారు.

"బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం నాకు ఒక పీడకలలా అనిపించింది. కేవలం వినోదం పేరుతో మనుషుల ప్రాణాలతో, ఆరోగ్యంతో ఆడుకోవడం సరైంది కాదు" అని సోనాలి రౌత్ మండిపడ్డారు.

ఒకే టవల్.. ఒకే రేజర్.. వ్యక్తిగత పరిశుభ్రత సున్నా!

హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత వస్తువుల వినియోగం విషయంలో తీవ్ర అశ్రద్ధ వహించారని సోనాలి తెలిపారు. టవల్స్, రేజర్లు వంటి వ్యక్తిగత వస్తువులను కూడా అందరూ పంచుకోవాల్సిన దుస్థితి కల్పించారని, దీనివల్లే ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధులు సోకుతున్నాయని సోనాలి వివరించారు.

షో నిర్వాహకుల తీరుపై సోనాలి రౌత్ ఇప్పటికే చట్టపరమైన పోరాటం మొదలుపెట్టారు. తనకు కలిగిన శారీరక, మానసిక వేదనకు బాధ్యత వహించాలని కోరుతూ షో మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినా ఇప్పటికీ ఆ ఇన్ఫెక్షన్ తగ్గలేదని, తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని ఆమె వాపోయారు. అయితే ఈ ఆరోపణలపై జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ మరాఠీ 6 టీమ్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe