...
...
Next Story

Sreeleela: శ్రీలీల షర్ట్ వెనుక పవన్ కల్యాణ్ డైలాగ్.. 'ఇచ్చిపడేసే గోత్రం..' అంటూ ఎయిర్‌పోర్ట్‌లో సెన్సేషన్.. వీడియో వైరల్

Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ క్రేజే కనిపిస్తుంది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్ శ్రీలీల వేసుకున్న ఓ షర్ట్ వైరల్ గా మారింది. దీనిపై ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ప్రింట్ ఉండటమే కారణం.

Published on: Mar 17, 2026, 11:16:26 IST
Advertisement

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఓ భారీ ప్రాజెక్ట్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఆమె ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటించింది. ఈ మూవీ ఉగాదికి థియేటర్లలో రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను శ్రీలీల డిఫరెంట్ గా ట్రై చేస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్

శ్రీలీల (x)
శ్రీలీల (x)

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. పవన్ కల్యాణ్ ఎంటర్ టైన్మెంట్ మోడ్ లో ఫ్యాన్స్ కు ట్రీట్ అందిస్తారని అంటున్నారు. ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ దగ్గరపడటంతో శ్రీలీల వినూత్నంగా ప్రమోషన్లు చేస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇగరదీసే నక్షత్రం’’ అనే పవర్ ఫుల్ డైలాగ్ డైలాగ్ ను షర్ట్ పై ప్రింట్ చేసుకుంది.

వీడియో వైరల్

తాజాగా శ్రీలీల ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆమె వేసుకున్న బ్లాక్ షర్ట్ వెనుకాల వైట్ కలర్ లో ‘‘శ్రీలీల.. ఇచ్చిపడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం’’ అని రాసి ఉంది. ఇందుకు సంబంధించిన శ్రీలీల వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. శ్రీలీల ప్రమోషన్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్ అని పొగిడేస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ దగ్గర పడటంతో ఎక్కడ చూసినా ఆ మూవీ క్రేజ్ కనిపిస్తోంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ చేసిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో పవన్ కల్యాణ్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేశాడు. పవన్ డైలాగ్స్, యాక్షన్ అదిరిపోయిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

ధురంధర్ 2తో ఢీ

బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 మూవీతో ఉస్తాద్ భగత్ సింగ్ పోటీపడనుంది. ధురంధర్ 2 కూడా మార్చి 19నే థియేటర్లకు రాబోతుంది. మరి ఈ హిందీ సినిమా నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కు పోటీ ఏ మేరకు ఉంటుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks