టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ "కొత్త కొత్తగా". ఈ సాంగ్ లో "దేవగుడి" మూవీ ఫేమ్ అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక ఈ పాటను పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం (ఏప్రిల్ 4) ఘనంగా జరిగింది.
సీరియల్స్‌లో నటించింది

ఈ కార్యక్రమంలో నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ.. "శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము నిర్మించిన సీరియల్స్‌లో నటించింది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆమెలో కనిపించేది. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్‌లో తనే నటించి నిర్మించి, దర్శకత్వం వహించింది. ఈ సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్‌లా రిచ్‌గా రూపొందించింది శ్రీజ. ఆమెతో పాటు అభినవ్ శౌర్యకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని చెప్పారు.
మాలాంటి వారికి అవకాశాలు
నటి పొట్టి విజయ మాట్లాడుతూ.. "శ్రీజ అందమైన హీరోయిన్ మాత్రమే కాదు అందమైన వ్యక్తిత్వం గల అమ్మాయి. ఆమె తనతో నటించే తోటి ఆర్టిస్టులను ఎంతో ఆదరంగా చూసుకుంటుంది. కొత్త కొత్తగా సాంగ్ చాలా బాగుంది. ఆమె ఇప్పుడు నిర్మాత, దర్శకురాలు అయ్యింది కనుక మాలాంటి వారికి అవకాశాలు ఇస్తుందని ఆశిస్తున్నా" అని ఆశించారు.
డైరెక్టర్‌గా మారడం గర్వంగా ఉంది
నటి మేఘన చౌదరి మాట్లాడుతూ.. "శ్రీజ నాకు మంచి ఫ్రెండ్. ఆమె శ్రీజ మ్యూజిక్ అని ఛానెల్ పెట్టి మంచి సాంగ్స్ చేస్తోంది. తను నిర్మాతగా, డైరెక్టర్‌గా మారడం గర్వంగా ఉంది. కొత్త కొత్తగా సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్ చూసిన ఫీల్ కలుగుతోంది. ఆమె ఇలాంటి మరిన్ని సాంగ్స్ చేయాలి" అని కోరారు.
మ్యూజిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు
నటి సంధ్య మాట్లాడుతూ.. "కొత్త కొత్తగా సాంగ్ ఎంత బాగుందో, ఈ పాటలో శ్రీజ, అభినవ్ శౌర్య పర్ఫార్మెన్స్లు కూడా అంతే బాగున్నాయి. వీళ్లిద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సాంగ్‌ను మ్యూజిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
చాలా రఫ్ అండ్ టఫ్
{{/usCountry}}నటి సంధ్య మాట్లాడుతూ.. "కొత్త కొత్తగా సాంగ్ ఎంత బాగుందో, ఈ పాటలో శ్రీజ, అభినవ్ శౌర్య పర్ఫార్మెన్స్లు కూడా అంతే బాగున్నాయి. వీళ్లిద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సాంగ్‌ను మ్యూజిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
చాలా రఫ్ అండ్ టఫ్
{{/usCountry}}నటుడు ఫణి మాట్లాడుతూ.. "శ్రీజ ఈ పాటలో సాఫ్ట్‌గా కనిపిస్తుంది గానీ ఆమె చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉంటుంది. మాతో జబర్దస్త్ షో చేసేప్పుడు శ్రీజ ఎంత ఎనర్జిటిక్‌గా, అగ్రెసివ్‌గా ఉంటుందో అర్థమైంది" అని తెలిపాడు.
టీవీ ప్రోగ్రామ్స్‌తోపాటు
"జెమినీ టీవీలోనూ నాతో ఒక ప్రోగ్రాం చేసింది. మంచి స్థాయికి ఎదగాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటుంది. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తోంది. శ్రీజ చేసిన ఈ సాంగ్ ఆల్బమ్ ఆమెకు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా" అని యాక్టర్ ఫణి ఆకాంక్షించాడు.
హీరోయిన్ శ్రీజ టీవీ షోలు
ఇదిలా ఉంటే, బుల్లితెరపై సీరియల్స్‌లో నటించిన శ్రీజ పలు టీవీ ప్రోగ్రామ్స్‌తో కూడా ఆకట్టుకుంది. జబర్దస్త్, జూ లకటక, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాపులర్ అయిన శ్రీజ ఇప్పుడు డైరెక్టర్, నిర్మాతగా మారి కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ విడుదల చేయడం టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.