60 ఏళ్లకు తొలిసారి పెళ్లి చేసుకున్న నటి సుహాసిని- కలిసిన 7 రోజులకే లవర్ సైంటిస్ట్‌తో వివాహం- ఎక్కడ వినని లవ్ స్టోరీ ఇది!
Actress Suhasini Mulay Marriage At 60: 30 కాదు 40 కాదు ఏకంగా 60 ఏళ్లకు తొలిసారి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పాపులర్ సీనియర్ నటి సుహాసిని ములే. ఓ సైంటిస్ట్‌తో ఫేస్‌బుక్‌లో మొదలైన పరిచయం పెళ్లిగా మారింది. అయితే, తొలిసారి కలుకున్న 7 రోజులకే సుహాసిని పెళ్లి చేసుకున్న ఈ లవ్ స్టోరీని చూద్దాం.
Actress Suhasini Mulay Marriage At 60: ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలామంది చెబుతుంటారు. సినీ పరిశ్రమలో ఇలాంటి విలక్షణమైన ప్రేమకథలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.

సీనియర్ నటి పెళ్లి విషయం
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్ మూవీ ‘లగాన్’లో అమీర్‌కు తల్లిగా నటించిన సీనియర్ నటి సుహాసిని ములే ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సుహాసిని తన 60 ఏళ్ల వయసులో మొదటిసారి ప్రేమలో పడి అనంతరం పెళ్లి పీటలెక్కారు. సరిగ్గా తోడు దొరికితే ఏ వయసులోనైనా కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని సుహాసిని నిరూపించారు.
60 ఏళ్ల పాటు ఒంటరిగానే.. ఎందుకంటే?
ఇటీవల ఒక టాక్ షో ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని ములే తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పి మాట్లాడారు. అరవై ఏళ్ల వయసు వరకు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో వివరించారు.
"నాకు సరైన జోడీ దొరికే వరకు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. అందుకే 60 ఏళ్ల వయసులో తొలిసారి వివాహం చేసుకున్నాను. నా భర్త అతుల్ గుర్తూ దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన సైన్స్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. కానీ, ఆయన మనసు మాత్రం చాలా మంచిది" అని సుహాసిని సంతోషం వ్యక్తం చేశారు.
ఫేస్‌బుక్‌లో మొదలైన సైంటిస్ట్ లవ్ స్టోరీ
ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్తతో పరిచయం ఎలా ఏర్పడిందో సుహాసిని ఆసక్తికరంగా పంచుకున్నారు. నిజానికి ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉండేవి కావు. ఒక స్నేహితురాలి సలహా మేరకు, సినిమాల్లో మరిన్ని అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఆమె ఫేస్‌బుక్ ఖాతా తెరిచారు.
అలా ఒకరోజు ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు అతుల్ గుర్తూ ప్రొఫైల్ ఆమె కంటపడింది. వెంటనే ఆమె నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లింది. సైన్స్ మీద ఎప్పుడూ ఆసక్తి ఉండే సుహాసిని.. అతుల్ అప్పట్లో జెనీవాలో ఉన్న ప్రతిష్టాత్మక 'లార్జ్ హాడ్రాన్ కొలైడర్' (LHC) ప్రాజెక్టుపై పనిచేస్తున్నట్లు గమనించారు.
"ఫేస్‌బుక్‌లో ఫిజిసిస్ట్‌లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోయాను. ఎల్‌హెచ్‌సీ అంటే ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయనకు మెసేజ్ పంపాను" అని సుహాసిని గుర్తుచేసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం ఆ తర్వాత ఈమెయిల్ సంభాషణల వరకు వెళ్లింది.
నమ్మకం కుదిరాకే నెంబర్ షేరింగ్.. ఏడు రోజుల్లోనే పెళ్లి!
ఈమెయిల్స్ ద్వారా మాట్లాడుకునే క్రమంలోనే అతుల్ తనకు జీవిత భాగస్వామి కావాలని మనసులోని మాటను బయటపెట్టారు. అయితే ఆన్‌లైన్ పరిచయం కావడం వల్ల సుహాసిని మొదట్లో అతన్ని పూర్తిగా నమ్మలేదు. తన ఫోన్ నంబర్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. అతుల్ పనిచేసే సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆయన ఫేస్‌బుక్ ఫోటోను, వివరాలను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఆమెకు నమ్మకం కుదిరింది. ఆ తర్వాతే ఇద్దరూ నంబర్లు మార్చుకున్నారు.
వారిద్దరూ మొదటిసారి నవంబర్ చివరి వారంలో ముఖాముఖి కలుసుకున్నారు. ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఎంతో సమయం తీసుకోలేదు. "మేము నవంబర్ చివర్లో కలుసుకుని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇక ఆలస్యం చేయడం వృథా అనుకుని జనవరి 16వ తేదీన (2011) వివాహ బంధంలోకి అడుగుపెట్టాం" అని సుహాసిని తెలిపారు.
సుహాసిని ములే నేపథ్యం
మొదటిసారి కలిసిన ఏడు రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకోవడం విశేషం. సుహాసిని ములే కేవలం నటి మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలో గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రతిభావంతురాలు. అస్సామీ, హిందీ, మరాఠీ చిత్రాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
భారతీయ చలనచిత్ర దిగ్గజం సత్యజిత్ రే నిర్మించిన బెంగాలీ చిత్రం 'జన అరణ్య'కు ఆమె అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ జాతీయ అవార్డు సాధించిన 'మృగయా' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
4 డాక్యుమెంటరీలకు అవార్డులు
నటిగా రాణిస్తూనే దాదాపు 60కి పైగా డాక్యుమెంటరీలను రూపొందించారు సుహాసిని ములే. వాటిలో నాలుగు డాక్యుమెంటరీలకు గానూ ఆమె ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


