Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో మస్ట్ వాచ్ డార్క్ కామెడీ సిరీస్.. 8.2 ఐఎండీబీ రేటింగ్.. వీకెండ్ కు ఓటీటీలో ఓ లుక్కేయండి

Netflix: మీకు డార్క్ కామెడీ సిరీస్‌లు అంటే ఇష్టం. అయితే నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ సిరీస్‌ను తప్పక చూడాల్సిందే. ఈ సిరీస్ మిమ్మల్ని నవ్విస్తుంది. అక్కడక్కడా ఆలోచింపచేస్తుంది. చివరకు మీ మనసు దోచుకుంటుంది. మరి ఇంకెందుకు లేటు ఇప్పుడే ఓటీటీలో ఈ సిరీస్ ను చూసేయండి. 

Published on: Apr 18, 2026, 17:00:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Netflix: వీకెండ్ లో ఓటీటీలో ఏం చూడాలో అర్థం కావడం లేదా? మంచి డార్క్ కామెడీ సిరీస్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఆగండి, ఈ న్యూస్ మీకోసమే. నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన ఈ డార్క్ కామెడీ సిరీస్ పై ఓ లుక్కేయండి. ఆ సిరీస్ పేరు 'ఆఫ్టర్‌లైఫ్'.

నెట్‌ఫ్లిక్స్‌లో మస్ట్ వాచ్ డార్క్ కామెడీ సిరీస్ (x/NetflixIndia)
నెట్‌ఫ్లిక్స్‌లో మస్ట్ వాచ్ డార్క్ కామెడీ సిరీస్ (x/NetflixIndia)

ఆఫ్టర్ లైఫ్ ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆఫ్టర్ లైఫ్’ డార్క్ కామెడీ సిరీస్ ఓ మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్రిటిష్ డ్రామా టీవీ సిరీస్. దీనిని రిక్కీ గెర్వైస్ సృష్టించాడు.ఈ సిరీస్ మిమ్మల్ని నవ్విస్తుంది. కొన్ని చోట్ల ఆహా అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కాస్త అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది.

మూడు సీజన్ లు

ఈ ఆఫ్టర్ లైఫ్ సిరీస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో వచ్చే ఒక అంశం గురించి మాట్లాడుతుంది. ఈ సిరీస్‌లో మూడు సీజన్‌లు ఉన్నాయి. ఆఫ్టర్‌లైఫ్ అనేది ట్యాంబరీ అనే సిటీలో నివసించే టోనీ జాన్సన్ అనే రిపోర్టర్ కథ. టోనీ జాన్సన్ ఎంతో అమితంగా ప్రేమించే భార్యను కోల్పోతాడు. టోనీ భార్య రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తుంది.

ప్రపంచంపై ప్రతీకారం

భార్య మరణం తర్వాత టోనీ జీవితం తలకిందులవుతుంది. అతను ఆత్మహత్య ఆలోచనలతో బాధపడతాడు. కానీ అతను తన భార్య మరణానికి ప్రపంచంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. దీని కోసం, టోనీ ప్రపంచాన్ని పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నదంతా చేస్తాడు. అతను చెప్పాలనుకున్నది కచ్చితంగా చెప్తాడు. ప్రజలు అతన్ని ప్రశ్నిస్తే, అతను వారికి తిరిగి సమాధానాలు ఇస్తాడు.

6 ఎపిసోడ్ లు

ఓటీటీలో ఆఫ్టర్ లైఫ్ సిరీస్ లో స్టోరీ ముందుకు సాగుతున్న కొద్ద టోనీ జాన్సన్ ప్రవర్తన మీకు అర్థం అవుతుంది. అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుస్తుంది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019లో విడుదలైంది. రెండవ సీజన్ 2020లో, మూడవ సీజన్ 2022లో విడుదలైంది. ఒక్కో సీజన్ లో 6 ఎపిసోడ్‌ల చొప్పున ఉన్నాయి.

8.2 ఐఎండీబీ

ఆఫ్టర్‌లైఫ్ సిరీస్‌లో రిక్కీ గెర్వైస్, డైయాన్ మోర్గాన్, టామ్ బాస్డెన్, టోనీ వే, మందీప్ ధిల్లాన్, యాష్లే జెన్సెన్, డేవిడ్ బ్రాడ్లీ, కారీ గోడ్లిమన్, పెనెలోప్ విల్టన్, డేవిడ్ ఎర్ల్, జో విల్కిన్సన్, జో హార్ట్లీ, రోయిసిన్ కోనాటీ, టిమ్ ప్లెస్టర్, పాల్ వంటి నటీనటులు నటించారు. రిక్కీ యాక్టింగ్ చేయడంతో పాటు ఈ సిరీస్ కు కథ అందించాడు. అలాగే దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్‌కు IMDb రేటింగ్ 8.2గా ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More