Agadha OTT Release Today In 4 Languages: ఎప్పుడైనా సరే హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ వేరు. రెగ్యులర్ ఫార్మాట్‌లోనే కథ ఉన్నప్పటికీ డిఫరెంట్‌గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అయితే, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన మైండ్-బెండింగ్ డివోషనల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అగధ’.
ఓటీటీలోకి అగధ

థియేటర్లలో రిలీజై సస్పెన్స్, హారర్ ప్రేమికులను అలరించిన అగధ ఓటీటీలోకి ఇవాళ (సెప్టెంబర్ 25) స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ వచ్చింది. మిస్టరీ,క్షుద్రపూజలు, రివేంజ్ వంటి ఎలిమెంట్స్‌తో అగధను తెరకెక్కించారు.
'అగధ' అసలు కథేంటి?
ఆధ్యాత్మిక శక్తులున్న మహదేవి (కామాక్షి భాస్కర్ల) అనే యంగ్ ఉమెన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊరిలో వరుసగా జరిగే వింత మరణాలు, ఆమె చెల్లెలి అనుమానాస్పద ఆత్మహత్య ఈ కథకు ప్రధాన మలుపుగా మారుతాయి. ఈ వరుస దారుణాల వెనుక ఉన్న నిజానిజాలు తేల్చడానికి మహదేవి సాగించే అన్వేషణ, ఆమెను ఒక నిషేధించిన అడవిలోని గుహ వైపు నడిపిస్తుంది.
దైవశక్తికి దుష్టశక్తికి పోరాటం
అక్కడ ఆమెకు 'అగధ' అనే భయానక దుష్టశక్తి ఎదురవుతుంది. దైవ శక్తికి, దుష్ట శక్తికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమాలోని ప్రధానాంశం. క్షుద్ర శక్తులు, కంటికి కనిపించని భయానక వాతావరణం, గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ రహస్యాలు ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తాయి.
ఎవరు ఏ పాత్రల్లో నటించారు
అగధ సినిమాలో మహదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల తన నటనతో మెప్పించగా, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రలు పోషించారు. అలనాటి నటుడు భానుచందర్, వనితా విజయకుమార్, జోవికా విజయకుమార్, షిజూ, రోషన్ బషీర్ ఇతర పాత్రల్లో కనిపించారు.
అగధ కలెక్షన్స్
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బాలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ వెంకటాపురం సంగీతం అందించగా, నాని చామిడిశెట్టి ఛాయాగ్రహణం నిర్వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారత్‌లో రూ. 1.30 కోట్ల నికర వసూళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 1.44 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఆశించన స్థాయిలో రాని కలెక్షన్స్
{{/usCountry}}శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బాలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ వెంకటాపురం సంగీతం అందించగా, నాని చామిడిశెట్టి ఛాయాగ్రహణం నిర్వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారత్‌లో రూ. 1.30 కోట్ల నికర వసూళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 1.44 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఆశించన స్థాయిలో రాని కలెక్షన్స్
{{/usCountry}}అయితే, థియేట్రికల్ రన్‌లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాకపోయినా, డిజిటల్ వేదికలపై ఇలాంటి మిస్టరీ, క్షుద్ర పూజల నేపధ్యంలో సాగే కథలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది.
అగధ ఓటీటీ స్ట్రీమింగ్
తెలుగు హారర్ థ్రిల్లర్ అయిన అగధ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. జీ5లో అగధ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో జీ5లో అగధ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు జీ5 ఓటీటీలో అగధ సినిమాను ఎంచక్కా చూడొచ్చు.