...
...
Next Story

Shalini: అజిత్ గ్లాడియేటర్స్ ట్రైలర్ రిలీజ్- భయం వేస్తుందన్న హీరో భార్య షాలిని-ఆ కొన్ని సెకన్లకోసమే రేసింగ్ ట్రాక్‌పైకి!

Shalini Reacts To Ajith Gladiators Trailer: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ రేసింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గ్లాడియేటర్స్’ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైంది. ఎల్.విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ వీడియోలో అజిత్ సతీమణి షాలిని, పిల్లలు పంచుకున్న ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.

Published on: Sep 20, 2026, 10:45:37 IST
Advertisement

Shalini Reacts To Ajith Gladiators Trailer: తమిళ చిత్రసీమలోనే కాకుండా దక్షిణ భారత్‌లో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న కథానాయకుడు అజిత్ కుమార్. ఆయన కేవలం వెండితెరపై మాత్రమే కాదు.. రేసింగ్ ట్రాక్‌పై కూడా మెరుపులు మెరిపిస్తారన్న సంగతి తెలిసిందే.

అజిత్ గ్లాడియేటర్స్ ట్రైలర్ రిలీజ్- భయం వేస్తుందన్న హీరో భార్య షాలిని-ఆ కొన్ని సెకన్లకోసమే రేసింగ్ ట్రాక్‌పైకి!
అజిత్ గ్లాడియేటర్స్ ట్రైలర్ రిలీజ్- భయం వేస్తుందన్న హీరో భార్య షాలిని-ఆ కొన్ని సెకన్లకోసమే రేసింగ్ ట్రాక్‌పైకి!

మోటార్ స్పోర్ట్స్‌పై తనకున్న అపరిమితమైన ప్రేమ, రేసింగ్ ప్రయాణం నేపథ్యంగా రూపొందిన ప్రత్యేక డాక్యుమెంటరీ 'గ్లాడియేటర్స్' (Gladiators). తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన విజువల్స్, విపరీతమైన ఉత్సాహాన్ని నింపేలా గ్లాడియేటర్స్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

రేస్ ట్రాక్‌పై రియల్ 'గ్లాడియేటర్'

3 నిమిషాల 46 సెకన్ల నిడివితో సాగిన ఈ గ్లాడియేటర్స్ ట్రైలర్ ప్రేక్షకులను, మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. "మోటార్ స్పోర్ట్స్ ప్రపంచం చాలా విస్తృతమైనది. ఇది కేవలం గ్లామర్, స్పీడ్‌కు సంబంధించినది మాత్రమే కాదు. వేగంతో పాటు క్రమశిక్షణ, కచ్చితత్వం, క్లిష్ట పరిస్థితుల్లో క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడ అత్యంత ముఖ్యం" అంటూ అజిత్ చెప్పే మాటలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

దుబాయ్ 24 అవర్స్ రేస్, లే మాన్స్ (Le Mans) వంటి ప్రసిద్ధ అంతర్జాతీయ రేసింగ్ ట్రాక్‌లపై అజిత్ దూసుకెళ్లిన దృశ్యాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ డాక్యుమెంటరీలో అజిత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అరుదైన కోణాలు కూడా బయటికొచ్చాయి.

"భయం వేస్తుంది.. కానీ ఆయన ఆశయమే ముఖ్యం": షాలిని

సుదీర్ఘ కాలం తర్వాత అజిత్ సతీమణి, మాజీ హీరోయిన్ షాలిని కెమెరా ముందుకు వచ్చి తన మనసులోని మాటను పంచుకున్నారు. "అందరికీ ఆయన ఒక నటుడిగానే తెలుసు. కానీ ఆయన కనే కలలు, వాటిని నిజం చేసుకోవడానికి పడే తపన దగ్గరగా ఉండే మాకే తెలుస్తుంది" అని షాలిని తెలిపారు.

అజిత్ కుమార్ కుమార్తె అనౌష్క, కుమారుడు ఆద్విక్ కూడా ఈ ట్రైలర్‌లో కనిపించి సందడి చేశారు. "నన్ను పెంచిన తీరు, నాకు నేర్పిన విలువలే నా నాన్నలో నాకు అత్యంత నచ్చే అంశాలు" అని అనౌష్క పేర్కొంది.

"తొలిసారి నాన్న రేస్ కార్‌లో కూర్చున్నప్పుడు ఆ చిన్నపాటి ప్లేసులో ఆయన ఎలా సర్దుకుంటారో చూసి చాలా ఆశ్చర్యపోయా" అని ఆద్విక్ సరదాగా పంచుకున్నాడు. డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌కు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సినిమాల విషయానికొస్తే..

గతేడాది 'విడాముయర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అజిత్, ప్రస్తుతం రేసింగ్ సీజన్ విరామంలో కొత్త చిత్రాలకు సంతకం చేస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఆయన నటించనున్న 'డేర్ డెవిల్' చిత్రం నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది.

'గ్లాడియేటర్స్' ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అధిక్ రవిచంద్రన్.. "అజిత్ సర్ అంకితభావం, పట్టుదలకు ఈ గ్లాడియేటర్స్ నిదర్శనం. థియేటర్లలో ఈ అనుభూతి వేరే స్థాయిలో ఉంటుంది" అని ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలోనే ఈ డాక్యుమెంటరీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks