గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పించారు.
ఫైట్ మాస్టర్స్ ఇంట్రెస్టింగ్ విషయాలు

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందించిన అఖండ 2 ది తాడవం టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
'అఖండ 2' ఫైట్స్ ఎంత కొత్తగా ఉండబోతున్నాయి ?
-అఖండకి మించిన అంచనాలు 'అఖండ 2పై ఉన్నాయి. అఖండలో బాలకృష్ణ గారి పాత్రని అఖండగా పరిచయం చేశారు. ఇందులో డైరెక్టర్ బోయపాటి గారు బాలయ్య గారి విశ్వరూపం చూపించారు.
-భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీ కొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్‌లో ఆది పినిశెట్టి గారు కూడా అద్భుతంగా నటించారు.
నెగెటివ్, పాజిటివ్ ఎనర్జీ
-డైరెక్టర్ గారు చాలా కొత్త గెటప్ ఇచ్చారు. అతని (ఆది పినిశెట్టి) దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అఖండ పాత్రలో ఉంటుంది. అలాంటి రెండు శక్తులు మధ్య యాక్షన్‌ని చాలా కొత్తగా కంపోజ్ చేయడం జరిగింది.
-అఖండకి మించిన స్పాన్, కాన్వాస్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీయాలని డైరెక్టర్ గారు మొదటి నుంచే మనసులో పెట్టుకొని ప్రతిదీ చాలా గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. చాలా హోంవర్క్ చేశారు. ప్రతి చిన్న విషయంలో 100% ఎఫర్ట్ పెట్టారు.
వెయ్యి శాతం అందుకునేలా
{{/usCountry}}-అఖండకి మించిన స్పాన్, కాన్వాస్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీయాలని డైరెక్టర్ గారు మొదటి నుంచే మనసులో పెట్టుకొని ప్రతిదీ చాలా గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. చాలా హోంవర్క్ చేశారు. ప్రతి చిన్న విషయంలో 100% ఎఫర్ట్ పెట్టారు.
వెయ్యి శాతం అందుకునేలా
{{/usCountry}}-అందరం ప్రేక్షకులకి ఒక గొప్ప సినిమాని ఇవ్వాలనే ఉద్దేశంతో ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ప్రేక్షకులు అభిమానులు 100% అంచనాలు పెట్టుకుంటే వెయ్యి శాతం ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుంది.
-అఖండ 2 టీజర్, ట్రైలర్‌లో గన్ త్రిశూలంతో ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌ని చూసే ఉంటారు. మామూలుగా గన్‌కే ఒక పవర్ ఉంటుంది. ఆ గన్‌కి ఒక త్రిశూలం మరో పవర్. దానికి శివుని శక్తి తోడైతే ఎలా ఉంటుందో ఆ పవర్‌తో యాక్షన్ సీక్వెన్స్‌ని కంపోజ్ చేయడం జరిగింది.
శివ శక్తిని గుండెల్లె నింపుకుంటే
-ఓంకారం శక్తి, శివశక్తిని గుండెల్లో నింపుకుంటే జీవితం ఎంత ఆనందంగా, అద్భుతంగా జరుగుతుందనే విషయాన్ని డైరెక్టర్ బోయపాటి గారు చాలా అద్భుతంగా చెప్పారు.