Akkineni Akhil Comments On Agent Movie Flop: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంతో తనలోని సరికొత్త నటుడిని ఆవిష్కరించారు అఖిల్. అర్బన్ లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కనబెట్టి, రస్టిక్ మాస్ అవతారంలో ఆయన చూపించిన నటనను ప్రేక్షకులు ఇష్టపడ్డారు.
ఏజెంట్ సినిమా రిజల్ట్ గురించి

గతంలో వచ్చిన 'ఏజెంట్' తీవ్ర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ విజయం అఖిల్‌కు, అక్కినేని అభిమానులకు కొండంత ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న అఖిల్ అక్కినేని తన 'ఏజెంట్' సినిమా రిజల్ట్ గురించి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
'నాపై నాకు గౌరవం లేకుండా పోయింది'
'రా టాక్స్ విత్ వికే' అనే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ ఏజెంట్ సినిమా విఫలం కావడంపై ఓపెన్‌గా మాట్లాడారు. "ఒక హిట్ సినిమా రావాలంటే 24 క్రాఫ్ట్‌లు కలిసి పనిచేయాలి. చిత్రం ఆడకపోయినా, నటుడిగా నా పాత్రకు న్యాయం చేశాననే నమ్మకం ఉండాలి. అప్పుడే పరిశ్రమలో నటుడిగా గౌరవం దక్కుతుంది. కానీ ఏజెంట్ షూటింగ్ సమయంలో నటుడిగా నన్ను నేను గౌరవించుకోలేకపోయాను. ఫస్ట్ ఎడిట్, కొన్ని సీన్లు చూసినప్పుడే నాకు ఎన్నో అనుమానాలు వచ్చాయి" అని అఖిల్ తన మనసులోని నిరాశను బయటపెట్టారు.
నిర్మాత కోసమే ముందుకు వెళ్లా!
సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడదని ముందే గ్రహించినా వెనకడుగు వేయలేకపోయానని అఖిల్ అక్కినేని వెల్లడించారు. "ఏజెంట్ సినిమా ఫలితం తేడా కొట్టబోతోందని విడుదల ముందే నాకు అర్థమైంది. నా స్నేహితులతో కూడా ఇదే విషయాన్ని పంచుకున్నాను. కానీ, ప్రాజెక్ట్ మధ్యలో ఉండి తప్పుకోవడం సరైన పద్ధతి కాదు" అని అక్కినేని అఖిల్ అన్నారు.
"నా సినిమా కోసం కోట్లు కుమ్మరించిన నిర్మాత పెట్టుబడిని రాబట్టడం నా నైతిక బాధ్యత. అందుకే సమస్య ఉందని తెలిసినా, మరింత కష్టపడి పనిచేశాను. అయితే అలాంటి సినిమాలు తీసే రోజులు చెల్లిపోయాయి" అని హీరో అక్కినేని అఖిల్ చెప్పుకొచ్చారు.
పరాజయాన్ని తుడిచేసిన 'లెనిన్' రికార్డు వసూళ్లు
{{/usCountry}}"నా సినిమా కోసం కోట్లు కుమ్మరించిన నిర్మాత పెట్టుబడిని రాబట్టడం నా నైతిక బాధ్యత. అందుకే సమస్య ఉందని తెలిసినా, మరింత కష్టపడి పనిచేశాను. అయితే అలాంటి సినిమాలు తీసే రోజులు చెల్లిపోయాయి" అని హీరో అక్కినేని అఖిల్ చెప్పుకొచ్చారు.
పరాజయాన్ని తుడిచేసిన 'లెనిన్' రికార్డు వసూళ్లు
{{/usCountry}}సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'ఏజెంట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 15 కోట్ల లోపే వసూలు చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి, కథల ఎంపికలో మార్పుల కోసం అఖిల్ దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నారు.
అనంతరం మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' చిత్రంతో జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చారు అఖిల్ అక్కినేని. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి అక్కినేని అఖిల్ కెరీర్‌లోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది.
బలమైన పునాది
ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముందుగా హీరోయిన్‌గా శ్రీలీల అనుకున్న మేకర్స్ తర్వాత భాగ్యశ్రీకి అవకాశం ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద బాగా రాణిస్తున్న లెనిన్ సినిమా అఖిల్ అక్కినేని సినీ కెరీర్‌కు మళ్లీ బలమైన పునాది వేసిందని చెప్పుకోవచ్చు.