Akhil Fan: టాలీవుడ్‌లో ఒక వైరల్ మీమ్ లేదా ఫ్యాన్ స్లోగన్.. ఒక హీరో ఇమేజ్‌ను ఏ రేంజ్‌లో మార్చగలదనే దానికి అక్కినేని అఖిల్ తాజా సంఘటనే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. గతంలో అఖిల్ సినిమాల రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా బుల్లితెరపై, సోషల్ మీడియాలో విపరీతంగా వినిపించిన ట్యాగ్‌లైన్ "అయ్యగారే నంబర్ వన్". ఈ స్లోగన్‌ను ట్రెండ్ చేసిన ఫేమస్ ఫ్యాన్ నాగరాజును అఖిల్ రీసెంట్‌గా కలవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అఖిల్ గట్టి హగ్

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తనను ప్రాణంగా అభిమానించే నాగరాజును అక్కినేని అఖిల్ పిలిపించుకున్నాడు. గుంటూరులో లెనిన్ సక్సెస్ ఈవెంట్ సందర్భంగా తన ఫ్యాన్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు. అఖిల్‌ను చూడగానే నాగరాజు తన ఎమోషన్స్ ఆపుకోలేక వెక్కివెక్కి ఏడవడం చూసిన వారందరినీ కదిలిస్తోంది. అఖిల్ కాళ్ల మీద పడిపోయిన నాగరాజును పైకి తీసుకున్నాడు హీరో. గట్టిగా హగ్ ఇచ్చాడు.
వైరల్ వీడియో
అఖిల్ ఆ ఎమోషనల్ మూమెంట్లో తన ఫ్యాన్‌ను చాలా గట్టిగా హగ్ చేసుకుని సంతోషపడటం అక్కినేని అభిమానులకు ఒక కంటి పండుగలా నిలిచింది. ఒకప్పుడు కేవలం ట్రోల్స్ లేదా మీమ్స్ కోసం వాడిన "అయ్యగారే నంబర్ వన్" అనే మాటను.. నాగరాజు ఎంతో జెన్యూన్‌గా ఓన్ చేసుకున్నాడు. ఆ నమ్మకానికి అఖిల్ ఇచ్చిన ఈ గౌరవం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
అఖిల్ ఇచ్చిన క్రేజీ ప్రామిస్!
{{/usCountry}}అఖిల్ ఆ ఎమోషనల్ మూమెంట్లో తన ఫ్యాన్‌ను చాలా గట్టిగా హగ్ చేసుకుని సంతోషపడటం అక్కినేని అభిమానులకు ఒక కంటి పండుగలా నిలిచింది. ఒకప్పుడు కేవలం ట్రోల్స్ లేదా మీమ్స్ కోసం వాడిన "అయ్యగారే నంబర్ వన్" అనే మాటను.. నాగరాజు ఎంతో జెన్యూన్‌గా ఓన్ చేసుకున్నాడు. ఆ నమ్మకానికి అఖిల్ ఇచ్చిన ఈ గౌరవం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
అఖిల్ ఇచ్చిన క్రేజీ ప్రామిస్!
{{/usCountry}}గతంలో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడిన అఖిల్‌కు రీసెంట్‌గా వచ్చిన ‘లెనిన్’ (Lenin) చిత్రం కెరీర్ బెస్ట్ మైల్‌స్టోన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, అఖిల్ లోని అసలైన నటుడిని మాస్ ఆడియన్స్‌కు పరిచయం చేసింది.
ఈ సక్సెస్ తెచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే నాగరాజుతో మాట్లాడిన అఖిల్.. హ్యాపీనా అని అడిగాడు. ‘‘చాలా హ్యాపీ సార్’’ అని నాగరాజు చెప్పాడు. ‘‘నీ వల్లే ఈ సారి ఇంకోటి కొడదాం’’ అని వెంటనే అఖిల్ అన్నాడు. ‘‘కచ్చితంగా కొట్టాలి. ఇంకా పైకి వెళ్లిపోవాలి’’ అని నాగరాజు కన్నీళ్లను ఆపుకుంటూ చెప్పాడు.
బ్లాక్ బస్టర్ లెనిన్
అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కెరీర్ లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసినా అతనికి సక్సెస్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే వచ్చిన ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. అఖిల్ కు ఇదే ఫస్ట్ సాలిడ్ హిట్. దీంతో అక్కినేని ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుష్ లో ఉన్నారు.