OTT Trending: ఓటీటీ ప్రియులకు ఈ వారం అదిరే వినోదాల విందు రెడీ గా ఉంది. థియేటర్లలో సందడి చేసిన చిత్రాలతో పాటు నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టిన విభిన్న జోనర్ల సౌత్ సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న 5 సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్ చిత్రాలు డిజిటల్ వీక్షకుల హిట్ లిస్ట్‌లో నిలిచాయి.
లెనిన్ (Lenin)

అక్కినేని అఖిల్ హీరోగా విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘లెనిన్’. థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ స్పేస్‌లో భారీ అంచనాల మధ్య ఓటీటీలోకి అడుగుపెట్టింది. అఖిల్ సరికొత్త మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన ఈ చిత్రం.. సామాజిక నేపథ్యం, యాక్షన్ డ్రామాతో సాగుతుంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదయం మురళి (Idhayam Murali)
తమిళ యంగ్ హీరో అథర్వ మురళి కథానాయకుడిగా నటించిన ‘ఇదయం మురళి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొండుతోంది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, సస్పెన్స్ ఎలిమెంట్లతో కూడిన ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.
ఓ.. సుకుమారి
డిఫరెంగ్ స్టోరీ లైన్ తో వచ్చిన మూవీ ఇది. తాత రూ.80 కోట్ల ఆస్తి కోసం ఓ దామినిని యాదగిరి పెళ్లి చేసుకుంటాడు. కానీ దామినికి ఓ రేర్ కండీషన్ వల్ల ఇబ్బందకర పరిస్థితి ఏర్పడుతుంది. ఆమెను ఎవరు తాకినా కరెంట్ షాక్ కొడుతుంది. ఈ రొమాంటిక్ కామెడీ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.
నూరు సామి
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానే నూరు సామి. తెలుగులో ఇది వంద దేవుళ్లు పేరుతో థియేటర్లో రిలీజైంది. థియేటర్లో ఫర్వాలేదనిపించిన ఈ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తన తల్లి కలను నిజం చేసేందుకు కొడుకు ఏం చేశాడన్నది ఈ సినిమాలో ఎమోషనల్ గా చూపించారు.
ఉయిర్
{{/usCountry}}విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానే నూరు సామి. తెలుగులో ఇది వంద దేవుళ్లు పేరుతో థియేటర్లో రిలీజైంది. థియేటర్లో ఫర్వాలేదనిపించిన ఈ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తన తల్లి కలను నిజం చేసేందుకు కొడుకు ఏం చేశాడన్నది ఈ సినిమాలో ఎమోషనల్ గా చూపించారు.
ఉయిర్
{{/usCountry}}మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. పాడుబడిన బావిలో దొరికిన ఓ మహిళ శవం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అసలు ఆ మహిళ ఎవరు? అనేది పోలీసులు విచారణ చేస్తుంటారు. ఈ క్రమంలో వెల్లడయ్యే విషయాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. తెలుగులోనూ ఈ సినిమా జియోహాట్ స్టార్ లో అదరగొడుతోంది.
బెస్ట్ ఆప్షన్
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కేవలం పెద్ద హీరోల సినిమాలే కాకుండా, కంటెంట్ ఓరియెంటెడ్ సౌత్ చిత్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అఖిల్ అక్కినేని ‘లెనిన్’, అథర్వ 'ఇదయం మురళి', రోషన్ ‘ఉయిర్’ ఓటీటీలో అదరగొట్టడమే ఇందుకు నిదర్శనం.
ముఖ్యంగా తమిళం, మలయాళం నుంచి తెలుగులోకి రీ-డబ్ అయి వస్తున్న ఇన్వెస్టిగేటివ్ అండ్ రొమాంటిక్ డ్రామాలు ఓటీటీ వాచ్‌టైమ్‌ను పెంచుతున్నాయి. వీకెండ్‌లో విభిన్న కంటెంట్ చూడాలనుకునే వారికి ఈ 5 సౌత్ సినిమాల క్యూరేటెడ్ లిస్ట్ బెస్ట్ ఆప్షన్.