Lenin Trailer: అక్కినేని యువ వారసుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఎట్టకేలకు బాక్సాఫీస్ దగ్గర తన అసలు సిసలైన మాస్ పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు. గత కొన్ని రోజులుగా రకరకాల వాయిదాలు ఎదుర్కొంటున్న అతని మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) జులై 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతో అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమనే నమ్మకంతో అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు.
వైజాగ్ వేదికగా 'లెనిన్' ట్రైలర్ లాంచ్..

ఈ లెనిన్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను వైజాగ్‌లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఓపెన్ అవుతూనే ఫుల్ ఇంటెన్స్, వైలెంట్ యాక్షన్ మోడ్‌తో మొదలైంది. ముఖ్యంగా కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసిన విధానం థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం.
చిత్తూరు జిల్లాలోని 'శ్రీరామపురం' అనే పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. ఆ ఊరిని అందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారని, అక్కడ ఒక్క చుక్క రక్తం కూడా నేలపై పడకూడదనే ఒక బలమైన నమ్మకం బ్యాక్‌డ్రాప్‌తో సినిమాను చాలా ఆసక్తికరంగా మలిచినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
మహాభారతం రేంజ్ డ్రామా.. రొమాన్స్ అండ్ యాక్షన్ బ్లెండ్
ట్రైలర్ మొదట్లోనే శ్రీరామపురం ఊరి విశేషాలను చూపించిన తర్వాత, కథ మెల్లగా లీడ్ రోల్స్ మధ్య సాగే క్యూట్ రూరల్ లవ్ స్టోరీ లోకి మారుతుంది. అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే కొన్ని సరదా సంభాషణలు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి.
అయితే ఆ తర్వాత కథ సీరియస్ మోడ్ లోకి మారుతుంది. విలన్లు హీరోకు ఎంతో దగ్గరైన ఓ వ్యక్తిని టార్గెట్ చేయడంతో కథ ఒక్కసారిగా హై-వోల్టేజ్ యాక్షన్ జోన్లోకి వెళ్తుంది. ఈ సినిమా కథాంశం ఆధునిక మహాభారతాన్ని పోలి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ చివరి నిమిషంలో రొమాన్స్, ఎమోషన్, యాక్షన్‌ను బ్లెండ్ చేసిన విధానం డైరెక్టర్ విజన్‌కు అద్దం పడుతోంది.
గ్రామీణ యువకుడిగా అఖిల్.. శివాజీ విలనిజం
{{/usCountry}}అయితే ఆ తర్వాత కథ సీరియస్ మోడ్ లోకి మారుతుంది. విలన్లు హీరోకు ఎంతో దగ్గరైన ఓ వ్యక్తిని టార్గెట్ చేయడంతో కథ ఒక్కసారిగా హై-వోల్టేజ్ యాక్షన్ జోన్లోకి వెళ్తుంది. ఈ సినిమా కథాంశం ఆధునిక మహాభారతాన్ని పోలి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ చివరి నిమిషంలో రొమాన్స్, ఎమోషన్, యాక్షన్‌ను బ్లెండ్ చేసిన విధానం డైరెక్టర్ విజన్‌కు అద్దం పడుతోంది.
గ్రామీణ యువకుడిగా అఖిల్.. శివాజీ విలనిజం
{{/usCountry}}ఈ సినిమాలో అఖిల్ లుక్, అతని రగ్గడ్ బాడీ లాంగ్వేజ్ ఒక పల్లెటూరి ఊరమాస్ కుర్రాడిలా పక్కాగా సెట్ అయ్యాయి. యాక్షన్ సీన్స్ లో అఖిల్ చూపించిన రౌద్రరూపం మరో లెవెల్ లో ఉంది. మొదట హీరోయిన్‌ను వదిలేయాలంటూ విలన్లను ఎంతో అమాయకంగా బ్రతిమిలాడే హీరో, ఆ తర్వాత ఒక్కసారిగా వైలెంట్ మోడ్‌లోకి మారి నరమేధం సృష్టించే సీన్ అద్భుతంగా పండింది.
భాగ్యశ్రీ బోర్సే కూడా ఓ గ్రామీణ యువతి లుక్‌లో చాలా అందంగా కనిపిస్తూ అఖిల్‌తో మంచి కెమిస్ట్రీ పండించింది. ఇక మరో సీనియర్ నటుడు శివాజీ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటం సినిమాకు మరో అసెట్ కానుంది. దానికి తోడు స్టార్ కంపోజర్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి యాక్షన్ ఫ్రేమ్‌ను ఎలివేట్ చేసింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. ట్రైలర్ కట్ చూస్తుంటే జులై 10న బాక్సాఫీస్ దగ్గర అక్కినేని వారసుడి వేట గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.