...
...
Next Story

శివ మూవీని రీమేక్ చేసే దమ్ము, ధైర్యం నాగ చైతన్య, అఖిల్‌కు లేవు: నాగార్జున కామెంట్స్ వైరల్

శివ మూవీని రీమేక్ చేసే దమ్ము, ధైర్యం నాగ చైతన్య, అఖిల్ కు లేవని నాగార్జున అనడం విశేషం. ఈ మూవీ రీరిలీజ్ నేపథ్యంలో అతడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలిసి మీడియాతో మాట్లాడాడు. ఈ శుక్రవారం (నవంబర్ 14) ఈ మూవీ రీరిలీజ్ కానుంది.

Published on: Nov 10, 2025, 22:21:42 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో 35 ఏళ్ల కిందట వచ్చి తెలుగు సినిమా దశ, దిశను మార్చేసిన సినిమా శివ. ఈ మూవీ ఇప్పుడు రీరిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో వర్మతో కలిసి మీడియాతో మాట్లాడిన నాగార్జున.. ఈ మూవీని రీమేక్ చేసే ధైర్యం తన కొడుకులు ఇద్దరికీ లేదని అనడం విశేషం.

వాళ్లకు ఆ దమ్ము, ధైర్యం లేవు

శివ మూవీని రీమేక్ చేసే దమ్ము, ధైర్యం నాగ చైతన్య, అఖిల్‌కు లేవు: నాగార్జున కామెంట్స్ వైరల్
శివ మూవీని రీమేక్ చేసే దమ్ము, ధైర్యం నాగ చైతన్య, అఖిల్‌కు లేవు: నాగార్జున కామెంట్స్ వైరల్

శివ మూవీ రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రామ్ గోపాల్ వర్మ, నాగార్జున షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మూవీని రీరిలీజ్ కాకుండా.. నాగ చైతన్య లేదా అఖిల్ రీమేక్ చేసే అవకాశం ఉందా, మీరు ఆ ఛాన్స్ ఇస్తారా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి నాగార్జున స్పందిస్తూ.. “వాళ్లకు ఆ దమ్ము, ధైర్యం లేవని నేను అనుకుంటున్నాను” అని నాగ్ నవ్వుతూ చెప్పడం విశేషం.

శివ కంటే ముందు సినిమాలు నాకు నచ్చలేదు

ఇక శివ మూవీ కంటే ముందు తాను చేసిన సినిమాలు తనకు నచ్చలేదని కూడా నాగార్జున చెప్పాడు. “శివ మూవీకి ముందు గీతాంజలి చేశాను. అక్కడి నుంచే కాస్త మేకోవర్ మొదలైంది. అయితే అంతకుముందు నేను చేసిన సినిమాలు నాకు నచ్చలేదు. వేసుకున్న బట్టలు నచ్చలేదు. అలా అని ఆ సినిమాలను, డైరెక్టర్లను విమర్శించడం నా ఉద్దేశం కాదు. నాకు నచ్చలేదు అంతే. ఆ సమయంలోనే మణిరత్నం, వర్మ వచ్చిన రెండు సినిమాలు చెప్పారు. రెండూ డిఫరెంట్ జానర్ల సినిమాలు” అని నాగ్ అన్నాడు.

పెద్ద హిట్ అని నాన్న అన్నారు

ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా మాట్లాడాడు. శివ మూవీ కేవలం నాగార్జున కోసమే తీసినది అని, అతని స్థానంలో మరొకరిని తాను ఊహించుకోలేనని స్పష్టం చేశాడు. తానే కాదు మరో డైరెక్టర్ ఇప్పుడా సినిమా తీసినా.. వన్ అండ్ ఓన్లీ నాగార్జున తప్ప మరొకరు కాదని అన్నాడు. నాగ చైతన్య, అఖిల్ లలో ఎవరితో తీస్తారు అని అడినప్పుడు కూడా తాను తీయనని, శివ కేవలం నాగార్జునదే అని ఆర్జీవీ స్పష్టంగా చెప్పాడు.

మరి నాగార్జునతో మరో సినిమా చేస్తారా అని ప్రశ్నించినప్పుడు.. తాను ప్రస్తుతం ఓ హిట్ మూవీ ఇచ్చిన తర్వాతే నాగార్జున దగ్గరికి వెళ్తానని వర్మ తెలిపాడు. తన కాలేజీ అనుభవాలన్నింటినీ పోగేసి కేవలం 20 నిమిషాల్లో ఈ శివ మూవీ వన్ లైనర్ స్టోరీని రెడీ చేశానని ఆర్జీవీ చెప్పాడు. శివ మూవీ నవంబర్ 14న థియేటర్లలో రీరిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks