Akriti Agarwal: చాలా సార్లు మోసం చేశాడు- హీరోయిన్ ఆకృతి అగర్వాల్- నిశ్చితార్థం తర్వాత క్రికెటర్ పృథ్వీ షా బంధంలో బీటలు?

Akriti Agarwal Comments On Prithvi Shaw: టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా, టాలీవుడ్ హీరోయిన్ ఆకృతి అగర్వాల్ రిలేషన్‌షిప్‌లో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. తాజాగా ఆకృతి పెట్టిన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలిచింది.

Published on: Jul 6, 2026, 22:19:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Akriti Agarwal Comments On Prithvi Shaw: సెలబ్రిటీల జీవితాల్లో ప్రేమలు, పెళ్లిళ్లు, ఆపై వచ్చే మనస్పర్థలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే యంగ్ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు కొత్త తుఫాను మొదలైనట్లు కనిపిస్తోంది.

చాలా సార్లు మోసం చేశాడు- హీరోయిన్ ఆకృతి అగర్వాల్- నిశ్చితార్థం తర్వాత క్రికెటర్ పృథ్వీ షా బంధంలో బీటలు?
చాలా సార్లు మోసం చేశాడు- హీరోయిన్ ఆకృతి అగర్వాల్- నిశ్చితార్థం తర్వాత క్రికెటర్ పృథ్వీ షా బంధంలో బీటలు?

పృథ్వీ షా బంధంలో మనస్పర్థలు

ఈ ఏడాది మార్చి నెలలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ బంధంలో మనస్పర్థలు వచ్చాయనే వార్తలు జోరందుకున్నాయి. ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పెట్టిన కొన్ని పోస్టులు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఈ ఏడాది తెలుగులో వచ్చిన 'త్రిముఖ' సినిమాలో నటించిన ఆకృతి అగర్వాల్, పృథ్వీ షా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఫ్యాన్స్ సంతోషపడేలోపే ఈ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

నన్ను చాలాసార్లు మోసం చేశారు.. ఆకృతి ఆవేదన

ఆదివారం (జూలై 5) నాడు ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "నన్ను చాలాసార్లు మోసం చేశారు, అయినా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీవితంలో ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత కూడా ఇలా జరుగుతుందని నమ్మలేకపోతున్నా" అని ఆకృతి రాసుకొచ్చారు.

అంతటితో ఆగకుండా ఎవరి పేరు ప్రస్తావించకుండా, "అతని గురించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి రూమర్ నిజమే, మీరు చూస్తున్నదంతా నిజమే" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆకృతి పెట్టిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. పృథ్వీ షా ఆమెను మోసం చేశాడనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలు ఉండటంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మరో పోస్ట్ పెడుతూ, "నన్ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు" అని పేర్కొన్నారు. మొదటి పోస్ట్‌ను జనం తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నారా లేక తన మానసిక పరిస్థితి గురించి చెబుతున్నారా అనేదానిపై ఆమె ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

పృథ్వీ షా మౌనం.. ఇంకా పోస్టులు డిలీట్ చేయలేదు

ఈ గొడవపై క్రికెటర్ పృథ్వీ షా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోలేదు. వారి నిశ్చితార్థపు ఫోటోలు, వీడియోలు ఇంకా వారి ప్రొఫైల్స్‌లో అలాగే ఉన్నాయి. అయితే, నిశ్చితార్థం సమయంలో పృథ్వీ షా పెట్టిన పోస్ట్ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

"మైదానంలో సిక్సర్లు కొట్టడం నుంచి జీవితాంతం కలిసి సాగే ఇన్నింగ్స్ మొదలైంది. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్" అని పృథ్వీ షా అప్పట్లో రాసుకొచ్చారు. మే నెలలో ఆకృతి పుట్టినరోజు సందర్భంగా కూడా పృథ్వీ ఎంతో ఎమోషనల్ నోట్ రాశారు. ఎలాంటి కష్ట సుఖాల్లోనైనా తనకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రపంచంలో ఎన్ని ఆప్షన్లు ఉన్నా ప్రతిసారీ ఆకృతినే ఎంచుకుంటానని చెప్పారు.

టాలీవుడ్‌లో ఆకృతి అగర్వాల్ ప్రయాణం

ఆకృతి అగర్వాల్ ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలైన 'త్రిముఖ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాజేష్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అఖిర డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించారు.

ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
ఆకృతి అగర్వాల్ మరో పోస్ట్
ఆకృతి అగర్వాల్ మరో పోస్ట్

ఈ సినిమాలో సన్నీ లియోన్, యోగేష్ కల్లే, సుమన్, ఆదిత్య శ్రీవాస్తవ్‌ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ నటి, అటు క్రికెటర్ పృథ్వీ షా మధ్య అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇరుపక్షాల నుంచి క్లారిటీ వస్తేనే ఈ రూమర్లకు చెక్ పడే అవకాశం ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More