...
...
Next Story

Akshay Kumar: నా ఇంట్లో సీక్రెట్ మెషిన్ లేదు, ఐదేళ్లలో నా సినిమాలను మా ఇంట్లోవాళ్లే చూడలేదు, ఆరోజే రిటైర్: అక్షయ్ కుమార్

Akshay Kumar On Secret Machine And Retirement: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'వెల్‌కమ్ టు ది జంగిల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న అక్షయ్.. తన సుదీర్ఘ సినీ ప్రయాణం, క్రమశిక్షణ, తనపై వచ్చే పుకార్లపై మనసు విప్పి మాట్లాడారు.

Published on: Jun 30, 2026, 10:00:56 IST
Advertisement

Akshay Kumar On Secret Machine And Retirement: థియేటర్లలో ఏ సినిమా రిలీజ్ అయినా అగ్నిపరీక్షలా మారిన ప్రస్తుత రోజుల్లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఆయన నటించిన సరికొత్త మల్టీస్టారర్ చిత్రం 'వెల్‌కమ్ టు ది జంగిల్' (Welcome to the Jungle) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇంటర్వ్యూలో అక్షయ్ కామెంట్స్

నా ఇంట్లో సీక్రెట్ మెషిన్ లేదు, ఐదేళ్లలో నా సినిమాలను మా ఇంట్లోవాళ్లే చూడలేదు, ఆరోజే రిటైర్: అక్షయ్ కుమార్
నా ఇంట్లో సీక్రెట్ మెషిన్ లేదు, ఐదేళ్లలో నా సినిమాలను మా ఇంట్లోవాళ్లే చూడలేదు, ఆరోజే రిటైర్: అక్షయ్ కుమార్

యాక్షన్, కామెడీలను సమపాళ్లలో పండిస్తూ ప్రేక్షకులు థియేటర్లలో నవ్వుల పండగ చేసుకునేలా ఈ చిత్రాన్ని మలిచారు. ఈ సినిమా సక్సెస్ అందించిన ఆనందంలో అక్షయ్ కుమార్ రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"నేను ఏది మాట్లాడినా మనసులోంచి నిజాయితీగా మాట్లాడుతాను. హెడ్‌లైన్స్ కోసమో, టీఆర్‌పీ కోసమో అబద్ధాలు చెప్పను" అని ఇంటర్వ్యూ ప్రారంభంలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు.

వీకెండ్‌లోనే రూ. 65 కోట్లు.. 'జై మహాకాల్' అన్న ఖిలాడీ

మొదటి వీకెండ్‌లోనే 'వెల్‌కమ్ టు ది జంగిల్' చిత్రం రూ. 65 కోట్ల క్లబ్‌ను దాటేసింది. ఈ వసూళ్లపై పరిశ్రమ వర్గాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అక్షయ్ స్పందిస్తూ.. "కేవలం రెండు ముక్కల్లో చెప్పాలంటే.. జై మహాకాల్!" అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ విజయం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా థియేట్రికల్ మార్కెట్‌కు ఒక ఊపునిచ్చిందని చెప్పాలి.

నా ఇంట్లో ఆ మెషిన్ లేదు!

పరిశ్రమలోకి వచ్చి మూడు దశాబ్దాలు దాటినా అక్షయ్ కుమార్ గురించి జనాల్లో ఒక గట్టి అపోహ ఉంది. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్ ఇంట్లో ఏదో సీక్రెట్ మెషిన్ ఉందనుకుంటారు. దీనిపై ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో ఊహించడం చాలా కష్టం. దీనిపై అక్షయ్ మాట్లాడుతూ.. ఒక్కోసారి ప్రేక్షకులకు ఏం కావాలో వారికే తెలియదని, అలాంటి సమయంలో కొత్త రకం కంటెంట్ ఇస్తే ఆదరిస్తారని చెప్పారు.

"మనం నమ్మిన కథను ధైర్యంగా తెరకెక్కించడమే ముఖ్యం. కొన్నిసార్లు మనం ప్రాణం పెట్టి తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి. గత ఐదేళ్లలో నా ఫేవరెట్ సినిమాలను థియేటర్లలో చూడటానికి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్లలేదేమో! అయినా నేను ప్రయత్నం ఆపలేదు. ఫ్లాప్ వస్తుందని భయపడి ఇంట్లో కూర్చోవడం కంటే, నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగడమే నాకు తెలుసు" అని అక్షయ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

అడవిలో జరిగే పెను రచ్చ

గతంలో వచ్చిన 'వెల్‌కమ్' సినిమాలు ఒక గదిలో జరిగే రచ్చ అయితే, ఈ సినిమా అడవిలో జరిగే పెను రచ్చ అని అక్షయ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు అనీస్ బాజ్మీని ఆయన ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.

"గడిచిన 20 ఏళ్లుగా మాకు అండగా నిలిచిన అనీస్ బాజ్మీజీకి నేను చేతులెత్తి మొక్కుతాను. ఈ 'వెల్‌కమ్' ఫ్రాంచైజీ సృష్టికర్త ఆయనే. ఆయన లేకపోతే ఈ సినిమాలో ఉన్న 30 మందికి పైగా నటీనటులు ఈ రోజు ఇంత సక్సెస్‌ను చూసేవారు కాదు" అని అక్షయ్ కుమార్ తెలిపారు.

ఆ నలుగురి భుజాలపై నిలబడ్డ 'వెల్‌కమ్'

"మార్షల్ ఆర్ట్స్‌లో మొదటి రూల్ ఏంటంటే.. మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు. అనీస్ జీ, ఫిరోజ్ జీ, అనిల్ కపూర్, నానా పటేకర్.. ఇప్పుడు మా ఫ్రెండ్ అహ్మద్ ఖాన్ (దర్శకుడు) లాంటి దిగ్గజాల భుజాలపైనే ఈ 'వెల్‌కమ్ టు ది జంగిల్' సినిమా నిలబడింది" అని అక్షయ్ కుమార్ కృతజ్ఞత చాటుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks