...
...
Next Story

Akshay Kumar Son: సినిమాలు వదిలేసి రూ. 4500 జీతానికి ఉద్యోగం- సాధారణ జీవితం గడుపుతున్న స్టార్ హీరో అక్షయ్ కొడుకు ఆరవ్!

Akshay Kumar Son Aarav Job For ₹4500: స్టార్ కిడ్స్ అనగానే వెండితెరపై మెరిసిపోవాలని ఆరాటపడతారు. కానీ, అక్షయ్ కుమార్ తనయుడు ఆరవ్ మాత్రం ఇందుకు భిన్నం. సినిమాలపై ఆసక్తి లేదని తెగేసి చెప్పిన ఆరవ్ కుమార్ ప్రస్తుతం నెలకు కేవలం రూ. 4500 సంపాదిస్తూ ఫ్యాషన్ రంగంలో ఓనమాలు నేర్చుకుంటున్నాడు.

Published on: Apr 18, 2026, 11:10:21 IST
Advertisement

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ రెండు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా కూడా ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించారు. సహజంగానే అక్షయ్ కుమారుడు ఆరవ్ కూడా హీరో అవుతాడని ఫ్యాన్స్ అంతా భావించారు. అయితే, ఆరవ్ రూటే సెపరేటని అక్షయ్ కుమార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

రూ. 4500 జీతంతో సాధారణ జీవితం

సినిమాలు వదిలేసి రూ. 4500 జీతానికి ఉద్యోగం- సాధారణ జీవితం గడుపుతున్న స్టార్ హీరో అక్షయ్ కొడుకు ఆరవ్!
సినిమాలు వదిలేసి రూ. 4500 జీతానికి ఉద్యోగం- సాధారణ జీవితం గడుపుతున్న స్టార్ హీరో అక్షయ్ కొడుకు ఆరవ్!

తన కుమారుడికి సినిమా గ్లామర్ అంటే ఏమాత్రం ఆసక్తి లేదని, అతను ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటున్నట్లు అక్కీ వెల్లడించారు. శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో అక్షయ్ కుమార్ తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

"ఆరవ్ నాలాగే ఉంటాడు. ఫిట్‌నెస్ మీద అతనికి చాలా శ్రద్ధ. అయితే సినిమాల్లోకి రావడం అతనికి ఇష్టం లేదు. ప్రస్తుతం అతను ఫ్యాషన్ రంగంపై దృష్టి సారించాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే, కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా.. అతను నెలకు కేవలం రూ. 4500 జీతంతో ఒక సాధారణ ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామాలకు వెళ్లి రకరకాల ప్రింట్లు, ఫ్యాషన్ డిజైన్ల గురించి స్వయంగా నేర్చుకుంటున్నాడు" అని అక్షయ్ కుమార్ గర్వంగా చెప్పుకొచ్చారు.

తండ్రిగా తాను అతనికి ఇచ్చే ఏకైక సలహా 'ఎవరికీ హాని చేయవద్దు' అని మాత్రమేనని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. అలా, బాలీవుడ్‌లో సినిమాలు, ఆ అవకాశాలు వదిలి కేవలం రూ. 4500 జీతానికి ఉద్యోగం చేస్తున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమారుడైన ఆరవ్ కుమార్ అలియాస్ ఆరవ్ భాటియా.

పబ్లిసిటీకి దూరంగా

ఒకవైపు కొడుకు కెరీర్ గురించి చర్చిస్తూనే, అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన 'భూత్ బంగ్లా' చిత్రంలో అక్షయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ మిశ్రమ స్పందన పొందినప్పటికీ, తొలిరోజే రూ. 15 కోట్ల వసూళ్లు సాధించి అక్షయ్ బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది.

వచ్చే ఏడాది జూన్ 26, 2026న అక్షయ్ కుమార్ నటించిన భారీ మల్టీస్టారర్ 'వెల్కమ్ టు ది జంగిల్' థియేటర్లలోకి రానుంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, రవీనా టాండన్, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. దీనితో పాటు సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి 'హైవాన్' అనే మరో ఆసక్తికర ప్రాజెక్టును కూడా అక్షయ్ కుమార్ పట్టాలెక్కించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe