Alia Sadhguru: మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఏం చేయాలి? సద్గురుకు అలియా భట్ ప్రశ్న- ఆన్సర్‌కి ఒక్కసారిగా నవ్వేసిన జనం!
Alia Bhatt Questioned Sadhguru Parenting Advice: చెన్నైలో జరిగిన జిటో కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురును అలియా భట్ కలిసింది. ఈ ఈవెంట్‌లో పిల్లల పెంపకంపై అలియా, సద్గురు ఆసక్తికర చర్చ జరిపారు. తన మూడేళ్ల కుమార్తె రాహా కోసం మంచి తల్లిగా ఎలా ఉండాలో అలియా భట్ అడిగి తెలుసుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజాగా చెన్నైలో జరిగిన 'జిటో' (JITO) కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురును కలిశారు. తన మూడేళ్ల కుమార్తె రాహా కపూర్‌కు మంచి తల్లిగా ఉండాలని తపించే అలియా భట్, సద్గురుతో జరిపిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సాధారణ తల్లిలాగే అలియా భట్ తన మనసులోని సందేహాన్ని సద్గురు ముందుంచారు.

"కంగారు పడేవారు మంచి పేరెంట్స్ కాలేరు!"
ఈ కార్యక్రమం మధ్యలో అలియా భట్ సద్గురును ఒక ప్రశ్న అడిగారు. "తాము మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామా? లేదా? అని కంగారు పడేవారికి మీరిచ్చే ఒకే ఒక్క సలహా ఏంటి?" అని అడిగారు. దీనికి సద్గురు తనదైన శైలిలో నవ్వుతూ.. "ఎప్పుడూ ఆందోళన చెందే తల్లిదండ్రులు ఎప్పటికీ మంచి తల్లిదండ్రులు కాలేరు" అని బదులిచ్చారు.
సద్గురు సమాధానంతో హాల్లో ఉన్న జనమంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనికి అలియా స్పందిస్తూ.. "పిల్లల విషయంలో ఆందోళనను పూర్తిగా తీసివేయలేమని నేను అనుకుంటున్నాను.. మీరూ అంగీకరిస్తారు కదా?" అని సరదాగా అంటే, ఆయన కూడా నవ్వుతూ అవునని తలూపారు.
అలియా ట్రెడిషనల్ లుక్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
ఇదిలా ఉంటే, ఈ వేదికపై అలియా భట్ లేత ఆకుపచ్చ రంగు (Pastel Green) ఆర్గాంజా శారీలో ఎంతో అందంగా కనిపించారు. అలియా భట్ ట్రెడిషనల్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "సద్గురు ఎవరినైనా ధ్యానంలోకి తీసుకెళ్లగలరు" అని ఒకరు, "నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సంతోషంగా ఉంది" అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.
రాహా కపూర్.. సోషల్ మీడియా సెన్సేషన్
కాగా, అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లకు 2022లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అదే ఏడాది ఈ బాలీవుడ్ జంటకు కుమార్తె రాహా కపూర్ జన్మించింది. కరీనా కపూర్ కుమారులు తైమూర్, జెహ్‌ల తర్వాత రాహా కపూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ సెలబ్రిటీ కిడ్‌గా నిలిచింది. మొదట్లో రాహా ముఖాన్ని ప్రపంచానికి చూపించని ఈ జంట, ఆ తర్వాత పాపను మీడియా ముందుకు తీసుకొచ్చారు.
వరుస సినిమాలతో బిజీ..
గతేడాది 'జిగ్రా' సినిమాతో పలకరించిన ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఆల్ఫా' (Alpha) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో అలియా భట్‌తోపాటు పాటు బ్యూటిఫుల్ శార్వరి వాఘ్, బాబీ డియోల్ నటిస్తున్నారు.
సద్గురు సమాధానం వైరల్
అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి 'లవ్ అండ్ వార్' చిత్రంలోనూ అలియా భట్ నటిస్తోంది. అయితే, మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఏం చేయాలని అలియా భట్ అడిగిన ప్రశ్నకు సద్గురు ఇచ్చిన సమాధానం, దానికి అంతా నవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


