Allu Arjun Atlee: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ప్రస్తుతం 'AA22 x A6' (వర్కింగ్ టైటిల్) అనే భారీ పాన్-ఇండియా మూవీ రూపొందుతోంది. రేపు అంటే మంగళవారం (ఏప్రిల్ 7) అల్లు అర్జున్ పుట్టినరోజుకు ఒక రోజు ముందే అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది.
రేపు ఉదయం 11 గంటలకు 'బిగ్ అప్డేట్'

చాలా కాలంగా సస్పెన్స్‌లో ఉన్న అల్లు అర్జున్, అట్లీ మూవీ తాలూకు ఫస్ట్ లుక్, టైటిల్‌ను మంగళవారం (ఏప్రిల్ 7) ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. మూవీని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్.. సింపుల్ గా రేపు ఉదయం 11 గంటలకు #AA22 x A6 అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, ఈ సినిమా ఒక 'ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్' అని తెలుస్తోంది. అట్లీ కెరీర్‌లోనే ఇది మొదటిసారిగా భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ హంగులతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
అల్లు అర్జున్ - దీపికా పదుకోన్ కాంబో
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన గ్లోబల్ స్టార్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
కొత్త ప్రపంచంలోకి అట్లీ..
'జవాన్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటివరకు కమర్షియల్ యాక్షన్ సినిమాలకే పరిమితమైన అట్లీ.. ఈసారి ఫాంటసీ జోనర్‌ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి రేపు ప్రకటించబోయే టైటిల్ ఏంటి? అల్లు అర్జున్ గెటప్ ఎలా ఉండబోతోంది? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}'జవాన్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటివరకు కమర్షియల్ యాక్షన్ సినిమాలకే పరిమితమైన అట్లీ.. ఈసారి ఫాంటసీ జోనర్‌ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి రేపు ప్రకటించబోయే టైటిల్ ఏంటి? అల్లు అర్జున్ గెటప్ ఎలా ఉండబోతోంది? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}ప్రశ్న: అల్లు అర్జున్ - అట్లీ సినిమా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు?
జవాబు: ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
ప్రశ్న: ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు?
జవాబు: ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు.
ప్రశ్న: ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?
జవాబు: సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.