...
...
Next Story

Allu Arjun Raaka: తోడేలు గెటప్‌లో గుండుతో అల్లు అర్జున్.. బన్నీ-అట్లీ సినిమా టైటిల్ ఇదే! అదిరిపోయిన బర్త్ డే ట్రీట్!

Allu Arjun Atlee Movie Title Release On Birthday: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. అట్లీ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌కు ‘రాకా’ (Raaka) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది.

Updated on: Apr 8, 2026, 13:05:44 IST
Advertisement

Allu Arjun Atlee Movie Title Release On Birthday: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అంటేనే అభిమానులకు ఒక పెద్ద పండుగ. సరిగ్గా ఆయన 44వ పుట్టినరోజు సందర్భంగా, గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ అప్‌డేట్‌ను మేకర్స్ బుధవారం (ఏప్రిల్ 8, 2026) ఉదయం 11 గంటలకు ప్రకటించారు. అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘రాక’ (Raaka) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

హద్దులు లేని ఊహాతీత ప్రపంచం..

తోడేలు గెటప్‌లో గుండుతో అల్లు అర్జున్.. బన్నీ-అట్లీ సినిమా టైటిల్ ఇదే! అదిరిపోయిన బర్త్ డే ట్రీట్!
తోడేలు గెటప్‌లో గుండుతో అల్లు అర్జున్.. బన్నీ-అట్లీ సినిమా టైటిల్ ఇదే! అదిరిపోయిన బర్త్ డే ట్రీట్!

ఇప్పటివరకు 'AA22xA6' అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాకు ‘రాకా’ అనే పేరు పెడుతూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. "పరిమితులకు అందని ఒక సరికొత్త ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి" అంటూ సన్ పిక్చర్స్ సంస్థ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది.

మునుపెన్నడూ చూడని రీతిలో

ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా చాలా ఇంటెన్స్‌గా, మునుపెన్నడూ చూడని రీతిలో ఉండబోతోందని అర్థమవుతోంది. చీకటి నేపథ్యం నుంచి తోడేలు తరహా పంజాతో కూడిన చెయ్యి బయటకు రావడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక రాక టైటిల్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

తోడేలు గెటప్‌లో పంజా అడ్డుపెట్టుకుని

ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ గుండుతో కనిపించి షాక్ ఇచ్చాడు. అలాగే, తోడేలు గెటప్‌లో పంజా అడ్డుపెట్టుకుని అల్లు అర్జున్ చూస్తున్న లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్‌లోని తోడేలు పంజా అల్లు అర్జున్‌దే అని తాజాగా ఇవాళ రివీల్ చేసిన ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది. రాకా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ చూసిన అభిమానులు అల్లు అర్జున్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్‌ అని భావిస్తున్నారు.

తొలిసారి బన్నీ - దీపికా జోడి!

మొత్తానికి అల్లు అర్జున్ పుట్టినరోజు వేళ ‘రాకా’ టైటిల్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. పుష్ప-2 కోసం వేచి చూస్తున్న అభిమానులకు, ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రకటన రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe