...
...
Next Story

Allu Arjun Raaka: అల్లు అర్జున్ రాకాలో నలుగురు హీరోయిన్లు? అట్లీ స్కెచ్ మామూలుగా లేదు.. ఐపీఎల్లో హార్దిక్ మూవీ ప్రమోషన్

Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఏకంగా నలుగురు స్టార్ హీరోయిన్లు సందడి చేయనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.

Published on: Apr 14, 2026, 17:53:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Allu Arjun Raaka: టాలీవుడ్ నుంచి గ్లోబల్ బాక్సాఫీస్ వరకు తన సత్తా చాటుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. 'పుష్ప 2: ది రూల్' తర్వాత బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు అట్లీ కుమార్‌తో అతడు చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Allu Arjun Raaka: అల్లు అర్జున్ రాకాలో నలుగురు హీరోయిన్లు? అట్లీ స్కెచ్ మామూలుగా లేదు.. ఐపీఎల్లో హార్దిక్ మూవీ ప్రమోషన్
Allu Arjun Raaka: అల్లు అర్జున్ రాకాలో నలుగురు హీరోయిన్లు? అట్లీ స్కెచ్ మామూలుగా లేదు.. ఐపీఎల్లో హార్దిక్ మూవీ ప్రమోషన్

తాజాగా ఈ సినిమాకు 'రాకా' (RAAKA) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

రాకాలో నలుగురు ముద్దుగుమ్మలు?

ఈ రాకా సినిమాలో బన్నీ సరసన ఏకంగా నలుగురు గ్లామర్ క్వీన్స్ నటించబోతున్నారట. అట్లీ సినిమాలంటేనే భారీ తారాగణం, కమర్షియల్ హంగులు పుష్కలంగా ఉంటాయి. 'జవాన్' చిత్రంతో బాలీవుడ్‌ను షేక్ చేసిన అట్లీ, ఇప్పుడు బన్నీ సినిమా కోసం అంతకుమించి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, ఆమెతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న, అందాల భామ మృణాల్ ఠాకూర్, యువ సంచలనం జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

ఒకే ఫ్రేమ్‌లో నలుగురు అగ్ర హీరోయిన్లను చూడటం అంటే ప్రేక్షకులకి కన్నుల పండుగే అని చెప్పాలి. ఇది కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కథా రీత్యా కూడా ఆ నలుగురు పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని టాక్.

రాకా మూవీ విశేషాలు

ఈ సినిమా సాంకేతికంగా కూడా అత్యున్నత ప్రమాణాలతో ఉండబోతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఐరన్ మ్యాన్ 2, ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి చిత్రాలకు పనిచేసిన అంతర్జాతీయ టెక్నీషియన్లను రంగంలోకి దించారు. సుమారు రూ.900 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

హార్దిక్ పాండ్యా రాకా పోజ్

రాకా పోస్టర్ స్టైల్లో హార్దిక్ పాండ్యా పోజ్

అటు ఐపీఎల్లోనూ బన్నీ రాకా పోజు వైరల్ అవుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా ఓ మ్యాచ్ లో వికెట్ తీసిన తర్వాత రాకా పోజుతో ఆకర్షించాడు. బన్నీ లుక్‌ను హార్దిక్ అనుకరించిన తీరు చూస్తుంటే.. ఐకాన్ స్టార్ మేనియా క్రికెటర్లను కూడా ఏ రేంజ్‌లో ఊపేస్తుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో డేవిడ్ వార్నర్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ‘పుష్ప’ పాటలకు స్టెప్పులేయగా.. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ‘రాకా’ మోడ్‌లోకి వెళ్లడం విశేషం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'రాకా' సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతోంది?

జవాబు: ఈ చిత్రంలో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని రీతిలో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం లేదా విభిన్న కాలక్రమాల్లో (Dual timelines) సాగే పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రశ్న: రాకా సినిమాలో దీపికా పదుకోన్ పాత్ర ఏమిటి?

జవాబు: దీపికా పదుకోన్ ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా నటిస్తున్నారు. 'జవాన్' తర్వాత అట్లీతో ఆమె చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. సినిమాలో ఆమె పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం.

ప్రశ్న: సినిమా విడుదల ఎప్పుడు ఉండొచ్చు?

జవాబు: 'రాకా' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2027 ప్రథమార్ధంలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe