టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి మార్చి 6న తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. విశేషమేమిటంటే, అదే రోజున బన్నీ తమ్ముడు అల్లు శిరీష్-నయనిక రెడ్డిల వివాహం కూడా జరిగింది. ఒకవైపు తమ్ముడి పెళ్లి వేడుకలో సందడి చేస్తూనే, మరోవైపు తన ప్రియమైన భార్య స్నేహకు బన్నీ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.
కోట్ల లగ్జరీ కారు.. ఫిదా అయిన స్నేహా!

తమ 15 ఏళ్ల బంధానికి గుర్తుగా స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ ఒక ఖరీదైన, విలాసవంతమైన 'మెర్సిడెస్-బెంజ్ AMG CLE 53' (Mercedes-Benz AMG CLE 53) కారును గిఫ్ట్‌గా అందించారు. హైదరాబాద్‌లో దీని ధర సుమారు రూ. 1.81 కోట్లు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్ కలిసి కారు తాళాలను స్నేహకు అందజేశారు. ఆ కొత్త కారును చూడగానే మురిసిపోయిన స్నేహ, వెంటనే బన్నీ బుగ్గపై ముద్దు పెట్టి తన సంతోషాన్ని పంచుకుంది. అనంతరం మామగారు అల్లు అరవింద్‌ను హత్తుకుని కృతజ్ఞతలు తెలిపింది. భార్య ముఖంలో ఆ ఆనందాన్ని చూసి అల్లు అర్జున్ ఎంతో మురిసిపోయారు.
నా జీవిత భాగస్వామివి నువ్వే: స్నేహ ఎమోషనల్ నోట్
ఈ ప్రత్యేక సందర్భంలో స్నేహా రెడ్డి తన భర్తకు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ రాశారు. "15 ఏళ్ల ప్రయాణం.. ప్రేమతో నిండిన జీవితం, నాకు సర్వస్వమైన కుటుంబం, మన ఇద్దరు ముద్దుల పిల్లలు, మన రెండు కుక్కపిల్లలు.. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు. నా జీవితంలోని ప్రతి అధ్యాయంలో భాగస్వామిగా ఉన్నందుకు థాంక్యూ అర్జున్. హ్యాపీ యానివర్సరీ" అని స్నేహా రెడ్డి పేర్కొన్నారు.
నా ప్రపంచం ఇక్కడే ఉంది
అలాగే, తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ "నా ప్రపంచం అంతా ఇక్కడే ఉంది" అని స్నేహా రెడ్డి మురిసిపోయారు. అల్లు అర్జున్ కూడా యానివర్సరీ సందర్భంగా తన భార్యను 'క్యూటీ' అని సంబోధిస్తూ విష్ చేశారు.
{{/usCountry}}అలాగే, తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ "నా ప్రపంచం అంతా ఇక్కడే ఉంది" అని స్నేహా రెడ్డి మురిసిపోయారు. అల్లు అర్జున్ కూడా యానివర్సరీ సందర్భంగా తన భార్యను 'క్యూటీ' అని సంబోధిస్తూ విష్ చేశారు.
{{/usCountry}}"హ్యాపీ యానివర్సరీ క్యూటీ. 15 ఏళ్ల ఈ ప్రయాణం నువ్వు లేకుండా సాధ్యం అయ్యేది కాదు" అని తన సక్సెస్‌లో స్నేహా రెడ్డి పాత్రను కొనియాడుతూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. వీరి పోస్టులపై మంచు లక్ష్మి సరదాగా స్పందిస్తూ.. "సరే సరే.. యానివర్సరీ విషెస్ అంతా బానే ఉంది కానీ, గిఫ్ట్ ఏం ఇచ్చావో చెప్పు.. నేను చూడాలి" అంటూ ఆటపట్టించారు.
అల్లు అర్జున్-స్నేహ ప్రయాణం
మంచు లక్ష్మి అడిగిన దానికి లగ్జరీ బెంజ్ కారు సమాధానం ఇచ్చినట్లు అయింది. ఇకపోతే 2011 మార్చి 6న అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. వీరికి 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. అర్హ ఇప్పటికే సమంత నటించిన 'శాకుంతలం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
అగ్ర దర్శకులతో
ఇక అల్లు అర్జున్ 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి అగ్ర దర్శకుల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.