Allu Arjun Peddi Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. గత బుధవారం (జూన్ 3) రాత్రి పెయిడ్ ప్రీమియర్స్, గురువారం (జూన్ 4) పూర్తిస్థాయి విడుదలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా సోమవారం (జూన్ 8) రాత్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెద్ది సినిమాను వీక్షించారు. సినిమా చూసిన వెంటనే ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పెద్ది రివ్యూ ఇస్తూ చిత్ర బృందాన్ని అభినందించారు అల్లు అర్జున్. సినిమాలో రామ్ చరణ్ మేకోవర్, యాక్టింగ్ శైలిపై అల్లు అర్జున్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
చరణ్ నటన మైండ్ బ్లోయింగ్.. గర్వంగా ఉందన్న బన్నీ
"గత రాత్రి 'పెద్ది' సినిమా చూశాను. నా ప్రియమైన రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక రఫ్ అండ్ రా లుక్, అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, అదిరిపోయే డాన్స్ మూవ్స్‌తో చరణ్ ప్రతి అంశంలోనూ అదరగొట్టాడు. నా బ్రదర్‌ని చూసి నిజంగా గర్వపడుతున్నాను. ఈ సినిమాకు వస్తున్న చప్పట్లకు, ప్రశంసలకు తను వంద శాతం అర్హుడు" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
దీనితో పాటు సీనియర్ నటుడు జగపతి బాబు అద్భుతమైన నటనను, చిత్ర సాంకేతిక నిపుణులను, నిర్మాతలను ఆయన అభినందించారు బన్నీ. చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సాన ప్రతి పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుందని, చరణ్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేశారని కొనియాడారు.
వివాదాల నడుమ జాన్వీ కపూర్‌కు ప్రేమపూర్వక మద్దతు
ఒకవైపు బాక్సాఫీస్ వసూళ్లు అదరగొడుతున్నా, మరోవైపు హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రీకరణపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సినిమాలో హీరోయిన్ పాత్రను మితిమీరిన గ్లామర్‌తో, కేవలం ఆబ్జెక్టిఫై (వస్తువులా) చేస్తూ చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
{{/usCountry}}ఒకవైపు బాక్సాఫీస్ వసూళ్లు అదరగొడుతున్నా, మరోవైపు హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రీకరణపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సినిమాలో హీరోయిన్ పాత్రను మితిమీరిన గ్లామర్‌తో, కేవలం ఆబ్జెక్టిఫై (వస్తువులా) చేస్తూ చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
{{/usCountry}}కథానాయిక అనుమతి లేకుండా హీరో ముద్దు పెట్టుకునే సీన్లను రొమాన్స్‌గా చూపించడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ వివాదం నడుస్తున్న తరుణంలో చిత్ర బృందం నిర్వహించిన రెండు ప్రెస్ మీట్లలోనూ జాన్వీ కపూర్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. సోమవారం సాయంత్రం మాట్లాడిన రామ్ చరణ్ కూడా శివ రాజ్‌కుమార్, జగపతి బాబుల గురించి చెప్పారు తప్ప హీరోయిన్ పేరు ఎత్తలేదు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన ట్వీట్‌లో ప్రత్యేకంగా "లీడింగ్ లేడీ జాన్వీ కపూర్‌కు నా ప్రేమ" అంటూ పేర్కొనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌కు జరిగిన అవమానానికి ఇది 'అత్యంత ఖరీదైన తప్పు' అంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్‌ను జాన్వీ కపూర్ సైతం లైక్ చేయడం గమనార్హం.
300 కోట్ల క్లబ్ వైపు 'పెద్ది'
సినిమాపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసి దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయినప్పటికీ, కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లతోనే పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నెగెటివ్ రివ్యూలు కూడా ఈ సినిమా భారీ విజయానికి ఒక రకంగా సహాయపడ్డాయని సీనియర్ నటుడు జగపతి బాబు వ్యాఖ్యానించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ నటనపై అల్లు అర్జున్ ఏమని ప్రశంసించారు?
రామ్ చరణ్ రఫ్ అండ్ రా యాక్టింగ్, అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, డాన్స్ మూవ్స్‌తో ప్రతి అంశంలోనూ అదరగొట్టాడని, తన సోదరుడిని చూసి చాలా గర్వంగా ఉందని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
2. 'పెద్ది' సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చుట్టూ వస్తున్న వివాదం ఏంటి?
సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను మితిమీరిన గ్లామర్‌తో కెమెరా యాంగిల్స్ ద్వారా ఆబ్జెక్టిఫై చేశారని, అలాగే ఆమె అనుమతి లేని ముద్దు సీన్లను రొమాన్స్‌గా చిత్రీకరించారనే విమర్శలు వస్తున్నాయి.
3. 'పెద్ది' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది?
వివాదాలు, మిశ్రమ విమర్శలు ఉన్నప్పటికీ 'పెద్ది' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.