Allu Arjun Video Call To Fan: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రెండు భిన్నమైన కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక చిన్నారి చిరకాల కోరికను తీర్చి తన ఉదారత్వాన్ని చాటుకోగా, మరోవైపు గతంలో జరిగిన ఒక విషాద ఘటనకు సంబంధించిన కేసులో ఆయనకు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.

పుష్ప-2 సినిమా విడుదల సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ సోమవారం (జూన్ 22) కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
చిన్నారి శ్రద్ధకు అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
మేక్ ఏ విష్ (Make-A-Wish) ఫౌండేషన్ వేదికగా అల్లు అర్జున్ తన చిన్నారి అభిమాని శ్రద్ధ కోరికను నెరవేర్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పాపతో బన్నీ వీడియో కాల్ మాట్లాడారు. ఈ భేటీకి సంబంధించిన వీడియోను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
"సినిమాలకు అతీతంగా నవ్వులు పూయించడం అంటే ఇదే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిన్నారి శ్రద్ధతో మాట్లాడి, ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాన్ని అందించారు. బన్నీ చూపించిన ఈ చొరవ ఆయనలోని మానవత్వాన్ని చాటుతోంది" అని మేక్ ఏ విష్ ఫౌండేషన్ పేర్కొంది.
పుష్ప డైలాగ్స్ రిపీట్
ఈ వీడియోలో శ్రద్ధ.. తనకు పుష్ప డైలాగ్ చెప్పాలని ఉందని అనగానే, బన్నీ ఎంతో ఓపిగ్గా ఆమెతో ఆ డైలాగ్ చెప్పించారు. "పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్!" అంటూ ఆ చిన్నారి ముద్దుముద్దుగా డైలాగ్ చెప్పడమే కాకుండా, "తగ్గేదే లే" అంటూ మేనరిజం కూడా చేసి చూపించింది. ఆ పాప క్యూట్‌నెస్ చూసి అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా నవ్వేశారు.
ఆ తర్వాత పెద్దయ్యాక ఏం అవుతావని అడగగా, తాను డాక్టర్ అవుతానని ఆ చిన్నారి సమాధానమిచ్చింది. దాంతో బన్నీ ఎంతో సంతోషపడి.. త్వరగా కోలుకోవాలని, పూర్తిగా నయం అయ్యాక హైదరాబాద్ వచ్చి తనను కలవాలని ఆ పాపను ఆహ్వానించారు.
సంధ్య థియేటర్ కేసు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు
{{/usCountry}}ఆ తర్వాత పెద్దయ్యాక ఏం అవుతావని అడగగా, తాను డాక్టర్ అవుతానని ఆ చిన్నారి సమాధానమిచ్చింది. దాంతో బన్నీ ఎంతో సంతోషపడి.. త్వరగా కోలుకోవాలని, పూర్తిగా నయం అయ్యాక హైదరాబాద్ వచ్చి తనను కలవాలని ఆ పాపను ఆహ్వానించారు.
సంధ్య థియేటర్ కేసు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు
{{/usCountry}}ఇలాంటి సంతోషకరమైన వార్త నడుస్తుండగానే, అల్లు అర్జున్‌కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. 2024లో పుష్ప-2 సినిమా స్క్రీనింగ్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
జూన్ 22, సోమవారం నాడు జరగబోయే విచారణకు అల్లు అర్జున్ కోర్టుకు రావాల్సి ఉంటుందని బన్నీ లీగల్ టీమ్ కూడా ధృవీకరించింది. "నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు సమన్లు పంపింది. ఈ కేసు విచారణకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం" అని లీగల్ టీమ్ పేర్కొంది.
ఏ11గా అల్లు అర్జున్
ఈ తొక్కిసలాట కేసులో పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చగా, అల్లు అర్జున్ పేరును 11వ నిందితుడిగా (A11) నమోదు చేశారు. 2024లో పుష్ప-2 ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ సంధ్యా థియేటర్‌కు వచ్చినప్పుడు, ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా దూసుకువచ్చారు.
ఆ ఉక్కిరిబిక్కిరి వాతావరణంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె 8 ఏళ్ల బాబు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఆ సమయంలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయగా, మరుసటి రోజే ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించింది.
ఆదుకున్న అల్లు అరవింద్
ఈ ఘటనపై బన్నీ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లోనే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. ఇప్పుడు ఈ కేసు తుది విచారణకు రావడంతో టాలీవుడ్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.