...
...
Next Story

Allu Sirish: నా భార్యను పెంచినందుకు థ్యాంక్స్.. పెళ్లి తర్వాత అల్లు శిరీష్ ఫస్ట్ పోస్ట్.. చనిపోయిన మామను గుర్తు చేస్తూ!

Allu Sirish: తన ప్రేయసి నయనికను అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 6న ఈ జంట వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో అల్లు శిరీష్ తన ఫస్ట్ పోస్టులో దివంగత మామను గుర్తు చేసుకున్నాడు. నయనిక తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు.

Published on: Mar 7, 2026, 19:07:52 IST
Advertisement

తన ప్రేయసి నయనిక రెడ్డిని అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల వెడ్డింగ్ మార్చి 6, 2026న అత్యంత సన్నిహితుల నడుమ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు అల్లు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అయ్యారు. పెళ్లి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫస్ట్ పోస్టు షేర్ చేశాడు అల్లు శిరీష్. ఇందులో తన దివంగత మామను తలుచుకున్నాడు.

అల్లు శిరీష్ పోస్ట్

నయనిక, శిరీష్ (instagram-allusirish)
నయనిక, శిరీష్ (instagram-allusirish)

నయనిక రెడ్డి- అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ జంట మూడు ముళ్లతో ఒక్కటైంది. వెడ్డింగ్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు శిరీష్ తన ఫస్ట్ పోస్ట్ పెట్టాడు. పెళ్లి ఫొటోలను పంచుకున్నాడు. అలాగే తన భార్య నయనిక తండ్రి ఫొటోను కూడా అల్లు శిరీష్ షేర్ చేశాడు.

నా భార్యను పెంచినందుకు

‘‘మా దివంగత మామ డి.శరత్ చంద్ర రెడ్డిని కలిసే అవకాశం నాకు దక్కలేదు. ఇప్పుడు నేను నా వైఫ్ అని పిలుస్తున్న అమ్మాయిని పెంచినందుకు మీకు థ్యాంక్స్. నయనికపై మీరు మొదలెట్టిన ప్రేమను ఈ భూమి మీద నేను ఉన్నన్ని రోజులు కొనసాగిస్తా’’ అని అల్లు శిరీష్ పోస్టు చేశాడు.

వైరల్ ఫొటోలు

శిరీష్​ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన తమ పెళ్లి ఫొటోలు వైరల్ గా మారాయి. మొదట తన భార్యతో రొమాంటిక్ గా ఉన్న ఫోటోను షేర్​ చేశాడు. శిరీష్​ గోల్డ్​ ఎంబ్రాయిడరీతో కూడిన ఐవరీ సిల్క్​ షేర్వానీ, ధోతీలో కనిపించాడు. నయనిక ఏమో లేత లావెండర్​ కాంజీవరం చీరలో.. వజ్రాలు, రూబీలతో కూడిన నగలతో మెరిసిపోయింది. ఆ తర్వాత తన భార్య నయనిక రెడ్డి దివంగత తండ్రి డి. శరత్​ చంద్రారెడ్డి ఫోటోను శిరీష్ పంచుకున్నాడు.

ఫ్యాన్స్ రియాక్షన్

అన్నయ్య అల్లు అర్జున్ పెళ్లి రోజైన మార్చి 6నే తమ్ముడు అల్లు శిరీష్ వివాహం చేసుకోవడం విశేషం. అల్లు శిరీష్-నయనిక పెళ్లికి చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. తమ్ముడి పెళ్లిలో అల్లు అర్జున్ చేసిన సందడికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks