...
...
Next Story

Prime Video: ప్రైమ్ వీడియో సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్.. ఒకేసారి రెండు కొత్త సీజన్లు అనౌన్స్ చేసిన ఓటీటీ

Prime Video: ప్రైమ్ వీడియో సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆదర్శ్ బాల్ విద్యాలయ మరో రెండు సీజన్లు రాబోతోంది. ఒకేసారి ఈ సిరీస్ రెండు సీజన్లను అనౌన్స్ చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. తొలి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ తో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published on: Aug 15, 2026, 09:16:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి గత నెల చివరి వారంలో వచ్చిన 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' వెబ్ సిరీస్ ఓటీటీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కేవలం మూడు వారాల్లోనే ఏకంగా సీజన్ 2 తో పాటు సీజన్ 3లను ఒకేసారి అనౌన్స్ చేసి ప్రైమ్ వీడియో డిజిటల్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ ప్లాట్‌ఫామ్ అయినా ఒక సీజన్ సక్సెస్ అయ్యాక నెలల తరబడి విశ్లేషించి నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తుంది. కానీ ఈ సిరీస్ సాధించిన గ్లోబల్ రికార్డులు చూసి మేకర్స్ ఒకేసారి రెండు సీజన్లకు పచ్చజెండా ఊపేశారు.

చాలా అరుదుగా ఇలా..

Prime Video: ప్రైమ్ వీడియో సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్.. ఒకేసారి రెండు కొత్త సీజన్లు అనౌన్స్ చేసిన ఓటీటీ
Prime Video: ప్రైమ్ వీడియో సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్.. ఒకేసారి రెండు కొత్త సీజన్లు అనౌన్స్ చేసిన ఓటీటీ

ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఒకేసారి రెండు సీజన్లను రెనివల్ చేయడం డిజిటల్ కంటెంట్ రంగంలో చాలా అరుదుగా జరిగే సంఘటన. ఈ ఆదర్శ్ బాల్ విద్యాలయ వెబ్ సిరీస్ విషయంలో ప్రైమ్ వీడియో ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

మొదటిది సిరీస్ రిలీజ్ అయిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ రేంజ్ కాన్ఫిడెన్స్ చూపించడం ప్రైమ్ వీడియో చరిత్రలోనే వింత అని చెప్పాలి. సాధారణంగా వ్యూయర్ షిప్ డేటా, వాచ్ టైమ్ రిపోర్ట్స్ విశ్లేషించడానికి ప్లాట్‌ఫామ్స్‌కి చాలా సమయం పడుతుంది.

రెండవది ఇండియాలోని ఏకంగా 94 శాతం పిన్ కోడ్‌లలో ఈ సిరీస్ విపరీతంగా స్ట్రీమ్ అయింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ స్కూల్ కామెడీ డ్రామా కనెక్ట్ చేసింది.

మూడవది అంతర్జాతీయంగా నాన్-ఇంగ్లీష్ కేటగిరీలో గ్లోబల్ ఛార్ట్స్‌ను టాప్ చేయడం. యాక్షన్, డార్క్ థ్రిల్లర్లు రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఒక చిన్న టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన క్లీన్ కామెడీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవ్వడం విశేషం.

సర్కారీ స్కూల్ హంగామా.. కే కే మీనన్ మార్క్ యాక్టింగ్

ఆయనతో పాటు అర్చనా పూరన్ సింగ్, నవీన్ కస్తూరియా, అభిమన్యు సింగ్ తమ మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రముఖ క్రియేటర్లు బిశ్వపతి సర్కార్, సమీర్ సక్సేనా తమ 'పోషం పా పిక్చర్స్' బ్యానర్‌పై దీనిని నిర్మించగా, హిమాంక్ గౌర్ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు.

రచయిత బిశ్వపతి సర్కార్ ఈ సక్సెస్ పై స్పందిస్తూ.. "మా టీమ్‌కు ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతం. ఆదర్శ్ బాల్ విద్యాలయ సిరీస్‌కు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. సీజన్ 2, 3లో మరింత పవర్ ఫుల్ కంటెంట్‌తో మీ ముందుకు వస్తాం" అని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"హాలీవుడ్ కంటే టీవీఎఫ్ తోపు".. సోషల్ మీడియాలో వైరల్ కామెంట్స్

ఈ డబుల్ రెనివల్ న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒకప్పుడు టీవీఎఫ్ (TVF) ద్వారా ఎన్నో ఐకానిక్ షోస్ ఇచ్చిన క్రియేటివ్ టీమ్, ఇప్పుడు పోషం పా పిక్చర్స్ బ్యానర్‌పై మళ్లీ అదే మేజిక్‌ను రిపీట్ చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

"చాలా రోజుల తర్వాత హృషీకేష్ ముఖర్జీ సినిమాల తరహాలో హాయిగా నవ్వుకునే మంచి ఫీల్ గుడ్ కంటెంట్ చూశాం. ఇలాంటి షోస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కి చాలా అవసరం" అని నెటిజన్లు రాసుకొస్తున్నారు.

మరొక నెటిజన్ అయితే.. "హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్నింటికంటే టీవీఎఫ్ రూట్స్ నుంచి వచ్చిన ఈ మేకర్స్ ఆలోచనలే గొప్పవి. మా చిన్నతనాన్ని, టీనేజ్ రోజులను మీ కంటెంట్‌తో ఎంతగానో ఎంజాయ్ చేశాం" అని ప్రశంసల జల్లు కురిపించారు.

ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో 240కి పైగా దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్, అటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఇటు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాబోయే సీజన్లలో ఈ స్కూల్ రచ్చ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks