Ameesha Patel Family Connection With Indira Gandhi: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ కేవలం ఒక నటిగానే కాకుండా, రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తాతగారు రజనీ పటేల్ ముంబైలో పేరుమోసిన బారిస్టర్ మాత్రమే కాదు, రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన నేత.
రాజకీయ సలహాదారుగా

నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆయన, ఇందిరా గాంధీకి రాజకీయ సలహాదారుగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యం వల్లే గాంధీ కుటుంబంతో అమీషా పటేల్ ఫ్యామిలీకి విడదీయలేని బంధం ఏర్పడింది.
జాతకాలు వద్దు.. ఇందిరా గాంధీ ఖాళీగా ఉంటే చాలు!
సాధారణంగా మన దేశంలో పెళ్లి అంటే జాతకాలు చూసి ముహూర్తం పెడతారు. కానీ, అమీషా పటేల్ తల్లిదండ్రుల పెళ్లి విషయంలో మాత్రం ఇందిరా గాంధీ మాటే ముహూర్తమైంది. "మా నాన్న పెళ్లి కోసం జాతకాలు చూడలేదు. నా తాతగారు నేరుగా ఇందిరా గాంధీ దగ్గరకు వెళ్లి.. ఇందిరా, నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు? అని అడిగారు. జూలై 4న నేను ఫ్రీగా ఉన్నాను అని ఆమె చెప్పడంతో.. అదే రోజున ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌లో పెళ్లి జరిపించారు" అని మహేశ్ బాబు నాని మూవీ హీరోయిన్ అమీషా పటేల్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
పుట్టగానే చూడటానికి వచ్చిన ప్రధాని
తన పుట్టుక గురించి చెబుతూ అమీషా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "నేను బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో పుట్టినప్పుడు, నన్ను చూడటానికి వచ్చిన మొదటి వ్యక్తి ఇందిరా గాంధీ గారే. దేశ ప్రధాని హోదాలో ఉండి కూడా ఆమె మా కుటుంబం కోసం సమయం కేటాయించేవారు" అని అమీషా పటేల్ గర్వంగా చెప్పుకొచ్చారు. ముంబైలోని ప్రసిద్ధ నెహ్రూ ప్లానిటోరియం కూడా తన తాతగారే నెహ్రూ జ్ఞాపకార్థం నిర్మించారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇంట్లో ప్రముఖుల సందడి
అమీషా చిన్నతనం నుంచే దేశంలోని అగ్రనేతలు, మేధావుల మధ్య పెరిగారు. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్. హుస్సేన్‌తో పాటు ప్రఫుల్ పటేల్, రాజీవ్ శుక్లా వంటి రాజకీయ నేతలు తరచూ తమ ఇంటికి వచ్చేవారని ఆమె తెలిపారు.
{{/usCountry}}అమీషా చిన్నతనం నుంచే దేశంలోని అగ్రనేతలు, మేధావుల మధ్య పెరిగారు. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్. హుస్సేన్‌తో పాటు ప్రఫుల్ పటేల్, రాజీవ్ శుక్లా వంటి రాజకీయ నేతలు తరచూ తమ ఇంటికి వచ్చేవారని ఆమె తెలిపారు.
{{/usCountry}}ప్రస్తుతం అమీషా పటేల్ 'గదర్ 2' విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. గతంలో సల్మాన్ ఖాన్ సరసన 'తేరే నామ్' సినిమాలో నటించే అవకాశం వచ్చినా కాదనడం తన కెరీర్‌లో ఒక పెద్ద పొరపాటని ఆమె ఈ మధ్యే ఒప్పుకోవడం విశేషం.