...
...
Next Story

Amitabh Bachchan: అది తప్పినప్పుడు ఆ రోజంతా మిస్టరీలా అనిపిస్తుంది, అనవసరమైన ఒత్తిడికి లోనవుతుంటారు: అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan About Work Ethic: ఎనిమిది పదుల వయసులోనూ కుర్రాళ్లకు పోటీనిచ్చే ఎనర్జీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సొంతం. ప్రతిరోజూ పని చేయకపోతే ఏదో తెలియని అశాంతి కలుగుతుందని, అది లేని రోజు తనకు ఒక మిస్టరీలా అనిపిస్తుందని అమితాబ్ బచ్చన్ తన తాజా బ్లాగ్‌లో పేర్కొన్నారు.

Published on: Apr 6, 2026, 06:24:34 IST
Advertisement

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘వర్క్ ఎథిక్’ (పని పట్ల నిబద్ధత) గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు అమితాబ్ బచ్చన్. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్, ఎన్నో భాషల్లో వందలాది సినిమాలు, లెక్కలేనన్ని అవార్డులు.. ఇవన్నీ ఆయనను ఒక లెజెండ్‌గా నిలబెట్టాయి.

అది తప్పినప్పుడు ఆ రోజంతా మిస్టరీలా అనిపిస్తుంది, అనవసరమైన ఒత్తిడికి లోనవుతుంటారు: అమితాబ్ బచ్చన్
అది తప్పినప్పుడు ఆ రోజంతా మిస్టరీలా అనిపిస్తుంది, అనవసరమైన ఒత్తిడికి లోనవుతుంటారు: అమితాబ్ బచ్చన్

అయితే, ఇంతటి ఘనత సాధించినా ఇప్పటికీ ఆయనకు పని చేయని రోజు గడవదు. ఖాళీగా కూర్చుంటే తనకు కలిగే అసౌకర్యం గురించి బిగ్ బి తన బ్లాగ్ ద్వారా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పని లేని రోజు ఒక 'మిస్టరీ'!

ఒక రోజు పని లేకుండా సోమరిగా గడపాల్సి రావడం తనను ఎంతలా ఇబ్బంది పెడుతుందో అమితాబ్ వివరించారు. "ఏ కారణం లేకుండా సోమరిగా గడిచిపోయే రోజు నన్ను కలవరపెడుతుంది. ప్రతిరోజూ ఒక పద్ధతి ప్రకారం పని చేయడం నాకు అలవాటు. ఆ షెడ్యూల్ లేదా క్రమశిక్షణ తప్పినప్పుడు, ఆ రోజంతా ఒక మిస్టరీలా అనిపిస్తుంది. సాధారణంగా క్రమశిక్షణతో సాగిపోయే పనులన్నీ ఒక్కసారిగా గందరగోళంగా మారతాయి" అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.

మనం అనుకున్నట్లుగా ఆ రోజు సాగనప్పుడు మనసులో ఆందోళన మొదలవుతుందని 83 ఏళ్ల అమితాబ్ బచ్చన్ అన్నారు. "ఆందోళనతో గడపడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ కొంతమందికి ఆ ప్రశాంతత దొరకదు. అనవసరమైన ఒత్తిడికి లోనవుతుంటారు" అంటూ పని పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు అమితాబ్.

కేబీసీ 17కు కన్నీటి వీడ్కోలు

వృత్తిపరంగా చూస్తే.. అమితాబ్ బచ్చన్ చివరిగా తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘కల్కి 2898 ఏడీ’లో అశ్వత్థామగా మెప్పించారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంలో ఆయన నటనకు నీరాజనాలు దక్కాయి.

గొప్ప స్ఫూర్తి

ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఎనిమిది పదుల వయసులోనూ అమితాబ్ బచ్చన్ చూపిస్తున్న ఈ ఉత్సాహం నేటి యువతరానికి గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks