Amitabh Bachchan Family Diwali Celebration: దీపావళి పండుగ వేళ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నివాసంలో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి ఏడాదీ ఎంతో వైభవంగా వెలుగుల పండుగను జరుపుకునే బచ్చన్ కుటుంబం, ఈసారి కూడా అందరూ ఒకే చోట చేరి పండగ చేసుకున్నారు. అమితాబ్ మనవరాలు, యువ మహిళా పారిశ్రామికవేత్త నవ్య నవేలి నందా తన ఇంట్లోని సంబరాల దృశ్యాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఆకట్టుకున్న ఆరాధ్య-అగస్త్యల అనురాగం

ఈ ఫోటోల్లో ప్రధానంగా అమితాబ్ మనవడు అగస్త్య నందా, అభిషేక్-ఐశ్వర్య దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుని దిగిన ఫోటో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆరాధ్య ఫోటోలు నెట్టింట చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అంతటి క్రేజ్ ఉన్న బిగ్ బి మనవడు, మనవరాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ నవ్వులు చిందించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో బావమరదళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు అభిషేక్ బచ్చన్, ఆయన సోదరి శ్వేతా బచ్చన్ క్రాకర్స్ కాలుస్తూ చిన్నపిల్లల్లా సరదాగా గడిపిన క్షణాలు కూడా నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
నవ్య నవేలి ఎరుపు రంగు పలాజో డ్రెస్‌లో ఎంతో అందంగా మెరిసిపోయారు. బాలీవుడ్ హీరోయిన్, తన ప్రాణస్నేహితురాలు అనన్య పాండేతో కలసి ఆమె దిగిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి. "నా మనసుకు అత్యంత చేరువైన వారితో సంతోషకరమైన దీపావళి జరుపుకున్నాను" అని నవ్య ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. దీనికి స్పందించిన అనన్య పాండే "నువ్వే నా వెలుగు" అంటూ ప్రేమగా కామెంట్ చేశారు.
నెటిజన్ల ప్రశ్నలు.. ఐశ్వర్య రాయ్ ఎక్కడ?
బచ్చన్ ఫ్యామిలీ దీపావళి ఫోటోలు బయటకు రాగానే నెటిజన్ల నుంచి భిన్న రకాల కామెంట్లు వ్యక్తమయ్యాయి. అగస్త్య, ఆరాధ్యల అనుబంధాన్ని అభినందిస్తూనే, మరోవైపు నటి ఐశ్వర్య రాయ్ ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.
{{/usCountry}}బచ్చన్ ఫ్యామిలీ దీపావళి ఫోటోలు బయటకు రాగానే నెటిజన్ల నుంచి భిన్న రకాల కామెంట్లు వ్యక్తమయ్యాయి. అగస్త్య, ఆరాధ్యల అనుబంధాన్ని అభినందిస్తూనే, మరోవైపు నటి ఐశ్వర్య రాయ్ ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.
{{/usCountry}}"నవ్య, మీ మామి (అత్త) ఐశ్వర్య రాయ్ ఏ ఫోటోలోనూ కనిపించడం లేదేంటి?" అని ఒక అభిమాని కామెంట్ సెక్షన్లో అడిగారు. గత కొంతకాలంగా బచ్చన్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో, ఈ ఫోటోలు మరింత చర్చకు దారితీశాయి.
బచ్చన్ వారసత్వం.. క్రమశిక్షణే మూలం
అమితాబ్ బచ్చన్ కుటుంబంలో శ్వేతా బచ్చన్, నిఖిల్ నందాల కుమార్తె నవ్య నవేలి నందా మహిళా ఆరోగ్యంపై పనిచేసే 'ఆరా హెల్త్' అనే సంస్థను నిర్వహిస్తున్నారు. ఆమె తమ్ముడు అగస్త్య నందా 'ది ఆర్చీస్' సినిమాతో నటుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతుల కుమార్తె ఆరాధ్య ప్రస్తుతం పాఠశాల విద్యనభ్యసిస్తోంది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో నవ్య తమ కుటుంబ విలువల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మా ఇంట్లో పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికీ పరస్పర గౌరవం ఇవ్వడం నేర్పించారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ దంపతుల నుంచి మేము నేర్చుకున్న అతిపెద్ద విలువ ఇదే" అని నవ్య పేర్కొన్నారు.
సినిమా గ్లామర్ పక్కన పెడితే, భారతీయ సంస్కృతికి, కుటుంబ బంధాలకు బచ్చన్ నివాసం 'జల్సా' నిలువెత్తు రూపంగా నిలుస్తుందని అభిమానులు కొనియాడతారు.