TV Release: టీవీలోకి తెలుగు ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా- హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ సూపర్- 6.2 రేటింగ్-ఇక్కడ చూడండి!
Anaganaga Oka Raju TV Premier Date: బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండగ పండించిన నవీన్ పొలిశెట్టి లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ బుల్లితెరపై సందడి చేయనుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానున్న అనగనగా ఒక రాజు టీవీ ప్రీమియర్ డేట్ వివరాలపై ఓ లుక్కేద్దాం.
Anaganaga Oka Raju TV Premiere Date: వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతారు. అలాంటి సినీ ప్రియుల కోసం జీ తెలుగు ఛానల్ అదిరిపోయే వినోదంతో రెడీగా ఉంది. థియేటర్లలో నవ్వుల రైలు పరిగెత్తించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) చిత్రం ఇప్పుడు బుల్లితెర వీక్షకులను అలరించడానికి వస్తోంది.

సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు మీ ఇంట్లోనే!
జూన్ 28న అనగనగా ఒక రాజు సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ ఆదివారం సాయంత్రం
నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ టైమింగ్, హృదయానికి హత్తుకునే కుటుంబ విలువలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. వెండితెరపై ఈ చిత్రాన్ని మిస్ అయిన వారితో పాటు, మళ్లీ మళ్లీ చూసి నవ్వుకోవాలనుకునే హోమ్ ఆడియన్స్ కోసం జీ తెలుగు ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ నవ్వుల పండగను సిద్ధం చేసింది.
కుటుంబం అంతా కలిసి
"చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబం అంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఈ సినిమాను ఈ వారం మీ ముందుకు తెస్తున్నాం" అని జీ తెలుగు ఛానల్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
నవీన్, మీనాక్షి కెమిస్ట్రీ..
'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన హాస్యాన్ని పంచిన నవీన్ పొలిశెట్టి, ఈ చిత్రంలో మరోసారి తనదైన వన్-మ్యాన్ షోతో మెప్పించారు. ఆయనకు జోడీగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించగా, వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
సున్నితమైన హాస్యంతో పాటు
సీనియర్ నటుడు రావు రమేష్, తారక్ పొన్నప్ప తమదైన విలక్షణ నటనతో కథను మరింత ఆసక్తికరంగా మార్చారు. దర్శకుడు మారీ సున్నితమైన హాస్యంతో పాటు ఊహించని మలుపులతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు
తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా అనగనగా ఒక రాజు చిత్రాన్ని నిర్మించారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్
ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన ఈ సినిమాలోని రిచ్ విజువల్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అందుకే ఐఎమ్‌డీబీలో పదికి 6.2 రేటింగ్ వచ్చింది. అలా థియేటర్లలో మంచి కామెడీ ట్విస్టులతో మెప్పించిన ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఈ ఆదివారం (జూన్ 28) మీ ఫ్యామిలీతో కలిసి హాయిగా ఆస్వాదించండి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


