...
...
Next Story

అనగనగా ఒక రాజు ట్విటర్ రివ్యూ-కడుపుబ్బా నవ్విస్తున్న నవీన్ పొలిశెట్టి మూవీ-సంక్రాంతికి పేలిన కామెడీ పంచ్ లు

అనగనగా ఒక రాజు అంటూ సంక్రాంతి సినిమాల రేసులో దిగిపోయాడు నవీన్ పొలిశెట్టి. ఈ రోజు ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ముందుగా వేసిన ప్రీమియర్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ ట్విటర్ రివ్యూపై ఓ లుక్కేయండి.

Published on: Jan 14, 2026, 08:26:51 IST
Advertisement

సంక్రాంతి 2026కు మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వచ్చేసింది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన అనగనగా ఒక రాజు సినిమా ఇవాళ (జనవరి 14) రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియర్ షోలు ముగిశాయి. సినిమాలో కామెడీ అదిరిపోయిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అనగనగా ఒక రాజు ట్విటర్ రివ్యూను ఒక సారి చూసేయండి.

అనగనగా ఒక రాజు ట్విటర్ రివ్యూ

అనగనగా ఒక రాజు మూవీ పోస్టర్ లో నవీన్ పొలిశెట్టి (x/sitara entertainments)
అనగనగా ఒక రాజు మూవీ పోస్టర్ లో నవీన్ పొలిశెట్టి (x/sitara entertainments)

తనదైన కామెడీ టైమింగ్ తో, పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ను నవ్వించడానికి వచ్చేశాడు నవీన్ పొలిశెట్టి. జనవరి 14న రిలీజైన అనగనగా ఒక రాజు సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఎక్స్ (ట్విటర్)లో తమ రివ్యూలు పోస్టు చేస్తున్నారు. మెజారిటీ రివ్యూల్లో సినిమా కడుపుబ్బా నవ్వించిందనే ఉంది.

వన్ మ్యాన్ షో

అనగనగా ఒక రాజు మూవీలో నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో అని అమెరికాలో ప్రీమియర్ చూసిన ఓ యూజర్ పోస్టు చేశాడు. ‘‘నా షో అయిపోయింది. అనగనగా ఒక రాజు మూవీ నిజంగా నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో. సెకండాఫ్ స్లోగా స్టార్ట్ అయినా చివరకు వచ్చేసరికి పుంజుకుంది. క్లైమాక్స్ ఎమోషన్ పని చేసింది. సినిమా అంతా అందరూ నవ్వుతూనే ఉన్నారు. నా రేటింగ్ 3.5/5’’ అని తన రివ్యూ ఇచ్చాడు.

ఫీల్ గుడ్ పొంగల్ ఎంటర్ టైనర్

బ్లాక్ బస్టర్

‘‘బ్లాక్ బస్టర్ ఫస్టాఫ్. నవీన్ పొలిశెట్టి అన్న ప్రతి సారి గొప్పగా అందించడంలో ఎప్పుడూ ఫెయిల్ కాడు. సెకండాఫ్ కోసం వెయిటింగ్’’ అని అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఓ యూజర్ పోస్టు చేశాడు.

‘‘ఫస్టాఫ్ బాగుంది. నవీన్ తన టైమింగ్, వన్ లైనర్ పంచ్ లతో సినిమాను నడిపించాడు. ఫన్ ఎపిసోడ్లు బాగా కుదిరాయి’’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.

సంక్రాంతి విన్నర్

‘‘యునానిమస్ బొమ్మ. సంక్రాంతి 2026 విన్నర్. అద్భుతమైన వన్ లైనర్స్. క్రిస్పీ రైటింగ్. ఇది నవీన్ పొలిశెట్టి షో. అనగనగా ఒక రాజు’’ అని మరో ప్రేక్షకులు ఎక్స్ లో తన రివ్యూ పంచుకున్నాడు.

అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరో. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ చిత్రానికి మారి డైరెక్టర్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks